breaking news
Vatsala
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన చాణక్యుడు మూవీ హీరోయిన్.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్ సేత్ ఒకరు. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్లో చాలా సినిమాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్‌లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్‌ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.తాజాగా ఈ ఈ ముద్దుగుమ్మకు రెండోసారి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా పంచుకుంది. ఇద్దరి నుంచి నలుగురిగా మారిపోయాం.. ఇప్పుడు మా ఫ్యామిలీ సంపూర్ణమైంది.. నాకు కూతురు పుట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.కాగా.. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. '9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి' అంటూ వాలైంటైన్ డే రోజున పోస్ట్ చేశాడు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్ 2017లో పెళ్లి చేసుకున్నారు. 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం 'దృశ్యం -2'లో కనిపించింది. ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ సేత్ చివరిసారిగా ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్‌లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం -1, దృశ్యం- 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
ఒక ఐడియా... కళను బతికిస్తోంది
తను కోరుకున్న వస్తువు దొరకనప్పుడు చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఉన్నదానితో సరిపెట్టుకుని పనిపూర్తిచేస్తారు. కానీ దొరకని వాటిని అందరికి అందుబాటులోకి తెచ్చే బిజినెస్ ఎందుకు చేయకూడదన్న ఒక ఐడియా వత్సల జీవితాన్నే మార్చేసి ఎంట్రప్రెన్యూర్‌గా మార్చింది. అందుకే మనకు వచ్చే ఐడియాలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఐడియా వచ్చినప్పుడు అది సాధారణంగా అనిపించినప్పటికీ... ఆచరణలోకి వచ్చినప్పుడు వాటి విలువ, గొప్పతనాలు తెలుస్తాయి. కశ్మీర్‌కు చెందిన వత్సల తనకు పెళ్లికి కావలసిన కాశ్మీరీ సంప్రదాయక వస్త్రాలు, ఆభరణాలు దొరకకపోవడంతో కొంత నిరాశకు గురైంది. ఆ తర్వాత ఆ నిరాశ నుంచి పుట్టిన ఆలోచననే స్టార్టప్‌గా చేసుకుని అంచెలంచెలుగా పైకి ఎదిగింది. వత్సల హలి సొంత రాష్ట్రం కశ్మీర్ అయినప్పటికీ..తన తండ్రి ఉద్యోగ రీత్యా హరిద్వార్‌లో ఉండడంతో అక్కడే పుట్టిపెరిగింది. ఇంజినీరింగ్ అయ్యాక, కమ్యునికేషన్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేసింది. ఎంబీఏ అయ్యాక ఓ అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేసింది. తరువాత బెంగళూరులోని ఓలా కంపెనీలో పీఆర్ టీమ్‌లో ఉద్యోగిగా చేరింది. ఇక్కడ పనిచేసే సమయంలో అనేక స్టార్టప్ కంపెనీల ప్రారంభం, ఎదుగుదల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. అప్పటి నుంచి తాను కూడా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలని అనుకునేది వత్సల. ఓలాలో నాలుగేళ్లు పనిచేసాక... వత్సలకు పెళ్లి కుదిరింది. తన పెళ్లికోసం బెంగళూరు, ఢిల్లీలలోని పెద్దపెద్ద మార్కెట్లలో షాపింగ్ చేయడం ప్రారంభించింది. ఎక్కడికెళ్లినా కశ్మీరీ శాలువలు తప్ప మరి ఇంకేమీ దొరకలేదు. కశ్మీరీ జరీతో తయారు చేసే చీరలు, ఆరీ ఎంబ్రాయిడరీ సూట్లు, డ్రెస్‌లు, జ్యూవెల్లరీలు ఏవీ దొరకలేదు. వత్సల షాపింగ్ పూర్తయింది కానీ ఎక్కడా కశ్మీరి సంప్రదాయానికి తగ్గట్టుగా ఉండేవి ఏవీ మార్కెట్లో దొరకడం లేదని నిరాశపడింది. అయినా ఉన్నవాటితో సర్దుకుని పెళ్లి చేసుకుంది. ఉద్యోగం వదిలేసి.. పెళ్లి తరువాత ఏడాది పాటు ఉద్యోగం చేసింది. కానీ సొంత స్టార్టప్ పెట్టాలన్న కోరిక, కశ్మీరి సంప్రదాయ వస్త్రాలపై ఉన్న మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి, 2020లో ‘ఉర్జువ్– ద స్పిరిట్ ఆఫ్ కశ్మీర్’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించింది. ఉర్జువ్ ప్రారంభం సమయంలోనే.. కరోనా కూడా దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ‘‘అంతా శానిటైజర్ల వ్యాపారం పెడితే..నువ్వు బట్టల వ్యాపారం పెట్టావు? ఈ సమయంలో ఎవరు కొంటారు?’’ అని ఇంట్లో వాళ్లు, స్నేహితులు, బంధువులు నిరాశపరిచారు. అయినా వత్సల ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. లక్షరూపాయలతో ఉర్జువ్ను ప్రారంభించి.. ఉన్నితో తయారు చేసిన స్టోల్స్‌ను మాత్రమే విక్రయించేది. ఇవి బాగా అమ్ముడవుతుండడంతో తరువాత కుర్తా, పీరాస్, సూట్లు, సమ్మర్ స్టోల్స్ అన్ని విక్రయిస్తోంది. బనారస్ వస్త్రంపై కశ్మీరి ఎంబ్రాయిడరీని వేస్తోంది. ఉర్జువ్ విక్రయాలలో ‘పష్మీనా’ శాలువలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి వారసత్వంగా ఒకరి నుంచి ఒకరికి ఇచ్చుకుంటారు కశ్మీరీలు. అందుకే ఇవి ఎంతో ప్రత్యేకంగా అమ్ముడవుతాయి. సోషల్ మీడియా ద్వారా.. వత్సల ఉత్పత్తులు నాణ్యంగానూ, కశ్మీరీ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుండడంతో చాలా వేగంగానే కస్టమర్లను ఆకర్షించాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా ఉర్జువ్ బాగా పాపులర్ అయ్యింది. తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పరచడానికి ‘లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో ఫ్యాషన్ బిజినెస్ కోర్సు కూడా చేసింది వత్సల. ఒకపక్క సంప్రదాయ ఉత్పత్తులను విక్రయిస్తూనే.. కశ్మీరీ హస్తకళాకారులకు పనికల్పించి ఉపాధినిస్తోంది. ఈ కళానైపుణ్యాలను తరువాతి తరానికి అందించాలని తపనతో హస్తకళాకారులందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి అభివృద్ధికి కృషిచేస్తోంది. -
అంతటి ఔన్నత్యాన్ని భరించలేకపోయాను!
వేదిక మాది చాలా పెద్ద ఇల్లు. మాకొక పాలేరు ఉండేవాడు. అతని కూతురు భవాని. తనూ, నేనూ చిన్నప్పట్నుంచీ కలసి ఉండేవాళ్లం. అయితే అమ్మానాన్నలు భవానిని నాతో సమానంగా చూడడం, తనకీ నాతో సమానంగా బట్టలు కొనడం, నాతోపాటు స్కూల్లో చదివించడం నచ్చేది కాదు. భవాని పుష్పవతి అయినప్పుడు అమ్మ బంగారు గాజులు ఇవ్వడంతో నా అసూయ హద్దులు దాటింది. భవాని మీద అనిష్టం పెరిగిపోయింది. చివరికి... చాలా దారుణమైన పని చేశాను. ఆ ఏడు అమ్మ నా పుట్టినరోజుకి ఒక ఉంగరం చేయించింది. నేను దాన్ని స్కూలుకు తీసుకెళ్లి, కావాలని భవాని బ్యాగులో వేశాను. ఆ విషయం తనకి తెలియదు. ఉంగరం కోసం అమ్మ ఇల్లంతా వెతుకుతుంటే చెప్పాను... భవాని గదిలోకి వచ్చిందని, ఏదో తీసుకుని గబగబా వెళ్లిపోవడం చూశానని! అమ్మ నమ్మలేదు. కానీ నేను గోల చేయడంతో భవాని వాళ్ల నాన్నకి బాధ కలిగింది. కావాలంటే ఇల్లంతా సోదా చేసుకోమన్నారు. నేనే వెళ్లి, సోదా చేసినట్టు నటించి, భవాని బ్యాగులోంచి ఉంగరం తీసిచ్చాను. దాంతో నాన్న అరిచారు. ‘నమ్మితే ఇలా మోసగిస్తున్నారా.. ఇంకెన్ని కాజేశారో’ అన్నారు. ఆ అవమానం తట్టుకోలేక భవానీ వాళ్ల నాన్న పని మానేసి, భవానిని తీసుకుని వెళ్లిపోయాడు. తర్వాత వాళ్లు ఎక్కడున్నారో కూడా మాకు తెలియలేదు. ఇది జరిగిన రెండేళ్లకు నాన్న హఠాత్తుగా చనిపోయారు. తర్వాత మా జీవితాలు తల్లకిందులయ్యాయి. ఎవరెవరో వచ్చి, నాన్న తమ దగ్గర అప్పులు చేశాడన్నారు. సాక్ష్యాలు చూపించారు. ఆస్తులు లాక్కున్నారు. అమ్మ, నేను రోడ్డున పడ్డాం. అమ్మ ఎలాగో కష్టపడి నన్ను పెంచింది. డిగ్రీ వరకూ చదివించింది. ఇక చదివే స్తోమత లేకపోవడంతో ఉద్యోగం కోసం వేట మొదలు పెట్టాను. ఎంతో కష్టపడి ఓ ప్రభుత్వాఫీసులో క్లర్క్ పోస్టు సంపాదించాను. అక్కడ నేను ఊహించని ఆశ్చర్యం ఒకటి ఎదురయ్యింది. భవాని అక్కడ పెద్ద అధికారి. తన కిందే నేను పని చేయాల్సింది. షాకైపోయాను. నేను ఫలానా అని చెప్పడానికి కూడా నోరు రాలేదు. కానీ తను నన్ను గుర్తు పట్టింది. ప్రేమగా పలకరించింది. నాన్న చనిపోయారని తెలిసి బాధపడింది. అంతటి ఔన్నత్యాన్ని భరించలేకపోయాను. కన్నీళ్లతో నేను తనకి చేసిన ద్రోహం చెప్పేశాను. కానీ, ఆమె పట్టించుకోనేలేదు. అవన్నీ మర్చిపొమ్మంది. సొంత సోదరిలా ఆదరించింది. చదువుకోవడానికి సాయం చేసింది. ఈ రోజు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఓ పెద్ద ఆఫీసులో మంచి హోదాలో ఉన్నానంటే దానికి కారణం భవానీయే! అర్థం లేని అసూయతో తనని, తన తండ్రిని అవమానించాను. నిలువ నీడ లేకుండా చేశాను. కానీ చివరికి ఏమైంది? ఆమె ఎత్తుకు ఎదిగింది. నేను ఎదగడానికి పెద్ద మనసుతో సాయం చేసింది. ఇంతకన్నా పెద్ద గుణపాఠం ఏం కావాలి! - వత్సల, నరసాపురం