రణ్‌బీర్ పూర్, సాయిపల్లవి సీతారాములుగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ రామాయణ:రైజ్ ఆఫ్ ఏ లెజెండ్. ఈ మొదటి భాగాన్ని ఈ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నితీశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్ షోను కాలిఫోర్నియాలో ప్రదర్శించారు. ఓవర్‌సీస్‌లోనూ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో ప్రీ సేల్స్‌లోనూ రామాయణ దూసుకెళ్తోంది.
అయితే ఈ మూవీలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె రావణుడి సోదరి శూర్పణఖ రోల్‌లో ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చేస్తోంది. ఈ సందర్భంగా తన రోల్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ పాత్ర తాను చేయడానికి గల కారణాలను వెల్లడించింది. ఆ పాత్ర చాలా సంక్లిష్టమైనదని.. తనను ఎలా ఆకట్టుకుందో రకుల్ వివరించింది. ప్రపంచ ప్రేక్షకులకు భారతీయ సంస్కృతిని పరిచయం చేసే అవకాశం లభించడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె శూర్పణఖ పాత్రలోని విభిన్న కోణాల గురించి మాట్లాడారు.
రకుల్ మాట్లాడుతూ. "ఈ పాత్రకు నన్ను చాలా ఉత్తేజపరిచిన విషయాలు ఉన్నాయి. మొదటిది, ఇది ప్రపంచానికి భారతదేశ ప్రాతినిధ్యం గురించి చెప్పడం. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ చిత్రంలో మన చరిత్ర, మన సత్యం ప్రతిబింబించాయి. రెండోది శూర్పణఖ అనే పాత్రను చాలా అపార్థం చేసుకున్నారు. ఇది బహుముఖ పాత్ర.. అసలు యుద్ధం జరగడానికి కారణం ఆమెనే. కాబట్టి బహుముఖ కోణాలున్న ఇలాంటి పాత్రను పోషించడం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది" అని అన్నారు. శూర్పణఖ పాత్రలోని సంక్లిష్టతే తనను ఆ రోల్ అంగీకరించేలా ఒప్పించిందని రకుల్ వివరించింది.
కాగా.. ఈ రామాయణ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, యష్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీస్‌ను దాదాపు రూ. 4,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. మొదటి భాగం ఈ దీపావళికి రానుండగా.. రెండవ భాగం 2027 దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది.


