బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పుడంతా ఫుల్ బిజీ అయిపోయారు. దీపావళికి ముందు జరుపుకునే కార్వా చౌత్ వేడుకల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కార్వా చౌత్ పోస్టులు దర్శనమిస్తున్నాయి. బాలీవుడ్ తారలు అత్యంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా మరింత భిన్నంగా ఈ ఏడాది జరుపుకుంది. రోటీన్‌కు భిన్నంగా తన భర్తతో కలిసి కార్వా చౌత్ వేడుక చేసుకుని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.
తన భర్త రాఘవ్ చద్దాతో కలిసి కర్వా చౌత్‌ను ప్రత్యేకంగా జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ జంట ఏకంగా విమానంలో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంది. విమానం దాదాపు 35 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఈ వేడుక చేసుకున్నామని పరిణీతి సోషల్ మీడియాలో పంచుకుంది. తన భర్తతో కలిసి చేసుకున్న రొమాంటిక్ వేడుకకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె తన ఉపవాసాన్ని విరమించగా.. రాఘవ్ ఆమెకు నీళ్లు, ఆహారం అందించారు. కాగా.. గతంలో ఆమె కజిన్ సిస్టర్, నటి ప్రియాంక చోప్రా సైతం ఇలానే తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.
కాగా.. బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా మే 13, 2023న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ జంట సెప్టెంబర్ 24, 2023న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ది లీలా ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి అక్టోబర్ 19, 2025న నీర్ అనే కుమారుడు జన్మించాడు.


