
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో గత మూడు రోజుల్లో సమీకరణలు శరవేగంగా మారిపోయాయి. ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారైనా.. లీగ్ దశ ముగిసే సరికి ఏ జట్లు టాప్-2లో (అదనపు ప్రయోజనం) ఉంటాయో ఇప్పటికీ స్పష్టత రాలేదు. గత మూడు మ్యాచ్‌ల్లో పాయింట్ల పట్టికలో టాప్-3లో ఉన్న జట్లకు (గుజరాత్, పంజాబ్, ఆర్సీబీ) ఆల్రెడీ ఎలిమినేట్ అయిన జట్లు వరుసగా షాకులిచ్చాయి.
మే 22న జరిగిన మ్యాచ్‌లో లక్నో గుజరాత్‌కు.. ఆతర్వాతి రోజు జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆర్సీబీకి.. నిన్న (మే 24) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌కు ఢిల్లీ షాకిచ్చాయి. టాప్-3 జట్లు వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఈ జట్లకు పెద్ద వ్యత్యాసం (పాయింట్ల తేడా) లేకుండా పోయింది.
టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ 18, రెండు, మూడు స్థానాల్లో ఉన్న పంజాబ్, ఆర్సీబీ తలో 17 పాయింట్లు, నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ 16 పాయింట్లు తమ ఖాతాలో కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లు తలో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. చివరి మ్యాచ్‌లో గెలిచే జట్లు టాప్-2 జట్లుగా ప్లే ఆఫ్స్‌కు చేరతాయి.
ముంబై టాప్-2లో ఉండాలంటే..?
నాలుగు జట్లతో పోలిస్తే టాప్-2లో ఉండేందుకు ముంబై ఇండియన్స్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ముంబై తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే టాప్-2లో నిలువనుంది. ఆ జట్టు రన్‌రేట్ (1.292) కూడా మిగిలిన జట్లకంటే మెరుగ్గా ఉంది. గుజరాత్ రన్‌రేట్ 0.602గా.. పంజాబ్ రన్‌రేట్ 0.327గా.. ఆర్సీబీ రన్‌రేట్ 0.255గా ఉంది.
- పంజాబ్ కింగ్స్‌పై ముంబై విజయం సాధించాలి. అలాగే లక్నో చేతిలో ఆర్సీబీ ఓడిపోవాలి.
- సీఎస్‌కే చేతిలో గుజరాత్ టైటాన్స్, లక్నో చేతిలో ఆర్సీబీ ఓడి.. పంజాబ్‌పై ముంబై విజయం సాధిస్తే ఏకంగా టాప్ ప్లేస్ ఖరారవుతుంది.
టాప్-2లో నిలిచేందుకు గుజరాత్ టైటాన్స్‌కు ఉన్న అవకాశాలు..
సీఎస్‌కేతో ఇవాళ (మే 25) జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే 20 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ఓడినా.. మెరుగైన రన్‌రేట్‌తో ఉంటే టాప్-2లో చోటు దక్కుతుంది.
గుజరాత్ సీఎస్‌కే చేతిలో ఓడి.. పంజాబ్, ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోయినా గుజరాత్ టాప్-2లో ఉంటుంది. అలా కాకుండా గుజరాత్ సీఎస్‌కే చేతిలో ఓడి.. ముంబైపై పంజాబ్, లక్నోపై ఆర్సీబీ గెలిస్తే మాత్రం గుజరాత్ ప్లేస్ టాప్-2లో గల్లంతవుతుంది.
ఆర్సీబీ టాప్-2లో నిలవాలంటే..
లక్నోతో జరిగే తమ ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆర్సీబీ 19 పాయింట్లతో టాప్-2లో నిలుస్తుంది. ఓడితే మాత్రం టాప్-2 ప్లేస్ గల్లంతవుతుంది.
పంజాబ్ కింగ్స్ అవకాశాలు ఇలా..
ముంబై ఇండియన్స్‌పై విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్‌కు టాప్-2లో ప్లేస్ ఖరారవుతోంది. అయితే ఆర్సీబీ, గుజరాత్ తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ, గుజరాత్ తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిచినా.. ఆర్సీబీ కంటే రన్‌రేట్ మెరుగ్గా ఉంటే టాప్-2 ప్లేస్ దక్కుతుంది.