
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా క్వాలిఫయర్-1లో పోటీ పడే అవకాశాన్ని (ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది) కూడా దక్కించుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరడం ఇది పదోసారి. ఇన్ని ప్రయత్నాల్లో ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మూడు సందర్భాల్లో (2009, 2011, 2016) ఫైనల్ వరకు చేరినా రిక్తహస్తాలతో వెనుదిరిగింది.
ఐపీఎల్ చరిత్రలో 15 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి, పదింట ఓడింది. ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీని అత్యంత దురదృష్టమైన జట్టు అని అంటారు. లీగ్ దశలో చెలరేగి ఆడే ఈ జట్టు నాకౌట్ మ్యాచ్‌లు వచ్చే సరికి ఢీలా పడిపోతుంది. గతమంతా ఇలాగే సాగింది. కానీ ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తుంది.
ఆర్సీబీ ఈ సీజన్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇందుకు నిన్న (మే 27) లక్నోతో జరిగిన మ్యాచే నిదర్శనం. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి వికెట్ సహా నాలుగు వికెట్లు కోల్పోయినా ఏ మాత్రం ఒత్తిడికి లోనుకాకుండా అబ్బురపడే విజయం సాధించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు.
ఈ గెలుపుతో ఆర్సీబీ క్వాలిఫయర్-1లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. మే 29న జరిగే ఈ పోటీలో ఆర్సీబీ టేబుల్ టాపర్ పంజాబ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఆర్సీబీకి మరో అవకాశం ఉంటుంది. జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పోటీ పడే ఛాన్స్ ఉంటుంది. గుజరాత్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో తలపడుతుంది.
ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీ ప్రస్తానం..
2009- ఫైనల్లో డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి
2010- సెమీఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమి
2011- ఫైనల్లో సీఎస్‌కే చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి
2015- క్వాలిఫయర్-2లో సీఎస్‌కే చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి
2016- ఫైనల్లో సన్‌రైజర్స్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి
2020- ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి
2021- ఎలిమినేటర్‌లో కేకేఆర్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి
2022- క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి
2024- ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి
2025- క్వాలిఫయర్-1లో పంజాబ్ ప్రత్యర్థి