
PC: BCCI/IPL.com
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఈ ఏడాది ఐపీఎల్ ఆఖరి సీజన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన రిటైర్మెంట్ వార్తలపై ధోని స్పందించాడు. తన నిర్ణయాన్ని వెల్లడించడానికి ఇంకా సమయం ఉందని ధోని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్-2025లో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ప్రెజేంటర్ ధోని తన రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి ప్రశ్నించాడు.
"వచ్చే సీజన్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాలుగు లేదా ఐదు నెలల సమయం ఉంది. రిటైర్మెంట్ విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రొఫెషనల్ క్రికెట్. ఏ ఆటగాడైనా ఫిట్‌గా ఉండి, ఆడాలనే తపన ఉన్నంత కాలం ఆడొచ్చు.
ప్రదర్శన ఆధారంగా రిటైర్ అవ్వాలంటే, ప్రతీ ఆటగాడు 22 ఏళ్లకే వీడ్కోలు పలకాలి. నేను తిరిగి రాంఛీకి వెళ్లి ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతాను. ఆ తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. అయితే వచ్చే సీజన్‌కు తిరిగి వస్తాను అని చెప్పలేను.. అలా అని రానని చెప్పలేను. నాకు ఇంకా చాలా సమయముందని" 43 ఏళ్ల ధోని బదులిచ్చాడు.