
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో క్వాలిఫయర్-2కు రంగం సిద్దమైంది. జూన్ 1(ఆదివారం) జరగనున్న సెకెండ్ క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. 2014 తర్వాత తొలిసారి ఫైనల్‌కు చేరుకునేందుకు పంజాబ్ ప్రయత్నిస్తుండగా.. ముంబై ఇండియన్స్ ఆరో ఐపీఎల్ టైటిల్ లక్ష్యంగా పెట్టుకుంది.
క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు మొహాలీలోని ముల్లాన్‌పూర్ స్టేడియం ఆతిథ్యమివ్వగా.. ఇప్పుడు క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నాయి.
క్వాలిఫయర్-2 రద్దు అయితే?
ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్ వర్షం లేదా ఏదైనా కారణం వల్ల రద్దు అయితే ఏంటి పరిస్థితి అని ఇరు జట్ల అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ మ్యాచ్‌కు బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించలేదు. దీంతో వర్షం లేదా వేరే ఇతర కారణం చేత మ్యాచ్ రద్దు అయితే.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌కు ఆర్హత సాధిస్తోంది.
అంటే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఫైనల్లో అడుగుపెడుతోంది. ముంబై పాయింట్ల టేబుల్‌లో నాలుగో స్ధానంలో ఉంది. అయితే వర్షం ముప్పు పొంచిలేదు. వెధర్.కామ్ ప్రకారం.. 24 శాతం మాత్రమే వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. దీంతో మ్యాచ్ సజావుగా జరిగనుంది. కాగా ఫైనల్ మ్యాచ్ మాత్రం బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించింది. జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తుది జట్లు(అంచనా)
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ
చదవండి: రిలాక్స్.. నా పని నాకు బాగా తెలుసు: కోచ్ మాట వినని బుమ్రా