
Photo Courtesy: BCCI
గుజరాత్‌పై ముంబై ఇండియన్స్ గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ముంబై రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించగా.. గుజరాత్ ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ఛేదనలో చివరి వరకు పోరాడిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగలిగింది.
ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్
రెండు వికెట్లు కోల్పోయిన సాయి సుదర్శన్ ఏమాత్రం తగ్గడం లేదు. 36 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 67 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా వాషింగ్టన్ సుందర్ (16) క్రీజ్‌లో ఉన్నాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 106/2గా ఉంది.
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
6.2వ ఓవర్- 67 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో కుసాల్ మెండిస్ (20) హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయినా, పవర్ ప్లేలో ఇరగదీసిన గుజరాత్ బ్యాటర్లు
తొలి ఓవర్‌లోనే గిల్ (1) వికెట్ కోల్పోయినా గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (43), కుసాల్ మెండిస్ (20) పవర్‌ప్లేలో ఇరగదీశారు. వీరి ధాటికి గుజరాత్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.
టార్గెట్ 229.. 3 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్
229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ 3 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (1) ఔటయ్యాడు.
ముంబై ఇండియన్స్ భారీ స్కోర్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్‌స్టో (47), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (25) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మూడు సిక్సర్లు బాదాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
17.2వ ఓవర్- 194 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో తిలక్ వర్మ (25) ఔటయ్యాడు.
సెంచరీ మిస్ చేసుకున్న రోహిత్
16.4వ ఓవర్- 186 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 81 పరుగుల వద్ద ఔటై రోహిత్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.
సెంచరీకి చేరువగా రోహిత్.. భారీ స్కోర్ దిశగా ముంబై ఇండియన్స్
16 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 175/2గా ఉంది. రోహిత్ శర్మ 81, తిలక్ వర్మ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
భారీ స్కోర్ దిశగా ముంబై
15 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 160/2గా ఉంది. రోహిత్ శర్మ 74, తిలక్ వర్మ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఒకే ఇన్నింగ్స్‌తో రెండు భారీ రికార్డులు
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (మే 30) జరుగుతున్న కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. ఐపీఎల్‌లో 7000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 2 సిక్సర్లు బాదిన రోహిత్ ఐపీఎల్‌లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెట్‌గా చరిత్ర సృష్టించాడు. 11 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 120/1 కాగా.. రోహిత్ 57, సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై
7.2వ ఓవర్- 84 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో కొయెట్జీ క్యాచ్ పట్టడంతో జానీ బెయిర్‌స్టో (47) ఔటయ్యాడు.
ప్రసిద్ద్ కృష్ణను ఉతికి ఆరేసిన బెయిర్‌స్టో
నాలుగో ఓవర్‌లో ప్రసిద్ద్ కృష్ణను జానీ బెయిర్‌స్టో ఉతికి ఆరేశాడు. ఈ ఓవర్‌లో అతను 3 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టాడు. ఫలితంగా ముంబై 4 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. బెయిర్‌స్టో 39, రోహిత్ శర్మ 13 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు.
రోహిత్ శర్మకు రెండు లైఫ్‌లు
ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మకు రెండు లైఫ్‌లు లభించాయి. గెరాల్డ్ కొయెట్జీ, కుసాల్ మెండిస్ సునాయాసమైన క్యాచ్‌లు వదిలేశారు. 3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 28/0గా ఉంది. రోహిత్, బెయిర్‌స్టో తలో 13 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు.
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 30) ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
జట్ల వివరాలు..
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్
ఇంపాక్ట్ సబ్స్: కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, అశ్వనీ కుమార్, రీస్ టోప్లీ.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, కుసల్ మెండిస్(w), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
ఇంపాక్ట్ సబ్స్: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, జయంత్ యాదవ్, అర్షద్ ఖాన్.