
Photo Courtesy: BCCI
సీఎస్‌కే యువ కెరటం ఆయుశ్ మాత్రే ఐపీఎల్ అరంగేట్రం సీజన్‌లోనే భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. సీఎస్‌కే తరఫున ఓ సీజన్‌లో అత్యధిక స్ట్రయిక్‌రేట్‌తో (కనీసం 200 పరుగులు) పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన మాత్రే 188.97 స్ట్రయిక్‌రేట్‌తో ఓ భారీ అర్ద సెంచరీ సాయంతో (94) 240 పరుగులు చేశాడు.
ఇదే సీజన్‌లో మరో చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ కూడా 180 స్ట్రయిక్‌రేట్‌తో 225 పరుగులు చేశాడు. మాత్రే తర్వాత ఓ సీజన్‌లో అత్యధిక స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించిన సీఎస్‌కే ఆటగాడిగా బ్రెవిస్ నిలిచాడు. ఈ రికార్డు విభాగంలో మాత్రే, బ్రెవిస్ తర్వాత అజింక్య రహానే (2023 సీజన్‌లో 172.48 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు), రవీంద్ర జడేజా (2020 సీజన్‌లో 1671.85 స్ట్రయిక్‌రేట్‌తో 232 పరుగులు), ఎంఎస్ ధోని (2013 సీజన్‌లో 162.89 స్ట్రయిక్‌రేట్‌తో 461 పరుగులు) ఉన్నారు.
కాగా, గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మే 25) జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సీజన్‌ను గెలుపుతో ముగించింది. అయినా సీజన్‌లో ఆఖరి స్థానంతోనే సరిపెట్టుకుంది. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే భారీ స్కోర్ (230/5) చేసింది. ఆయుశ్ మాత్రే (34), డెవాన్ కాన్వే (52), ఉర్విల్ పటేల్ (37), డెవాల్డ్ బ్రెవిస్ (57) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. సీఎస్‌కే బౌలర్లు చెలరేగడంతో 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ ఇలా తక్కువ స్కోర్‌కే చేతులెత్తేయడం ఈ సీజన్‌లో ఇదే మొదటిసారి. అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ తలో మూడు వికెట్లు తీసి గుజరాత్ పతనాన్ని శాశించారు.
రవీంద్ర జడేజా 2, ఖలీల్ అహ్మద్, పతిరణ తలో వికెట్ తీశారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (41) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అర్షద్ ఖాన్ (20), శుభ్‌మన్ గిల్ (13), షారుఖ్ ఖాన్ (19), తెవాటియా (140, రషీద్ ఖాన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు.