
PC: BCCI/IPL.com
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభానికి ఇంకా నాలుగు వారాల సమయం మాత్రమే మిగిలింది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.
అయితే ఇంగ్లండ్ టూర్‌కు ఇంకా భారత జట్టును బీసీసీఐ ఖారారు చేయలేదు. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. మే 24న భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేయడం సెలక్టర్లకు బిగ్ ఛాలెంజ్ వంటిదే అని చెప్పాలి.
ఇందుకు ఈ కీలక పర్యటనకు ముందు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికారు. దీంతో వారిద్దరూ స్ధానాలను భర్తీ చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు. ఈ పర్యటనలో భారత టెస్టు జట్టులో కొన్ని కొత్త ముఖాలను చూసే అవకాశముంది.
సాయిసుదర్శన్, అర్షదీప్ సింగ్‌లు టీమిండియా తరపున టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లకు హర్యానా స్పీడ్ స్టార్ అన్షుల్ కాంబోజ్‌ను ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయాలని చెన్నైసూపర్ కింగ్స్ హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సూచించాడు. ఐపీఎల్-2025 సీజన్‌లో కాంబోజ్ సీఎస్‌కే తరపున ఆడుతున్నాడు.
"కాంబోజ్ అద్బుతమైన బౌలర్. అతడు గంటకు 138-139 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలడు. అతడు తన పేస్ బౌలింగ్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. కాంబోజ్ వేసే బంతులు ఎల్లప్పుడూ చేతి గ్లౌవ్స్ దగ్గరగా వెళ్తూ ఉంటాయి.
దీంతో బ్యాటర్లు వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హైట్ ఎక్కువగా ఉండడంతో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. ప్లాట్ వికెట్లపై కూడా అతడు అద్బుతంగా బౌలింగ్ చేయగలడు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఫ్లాట్ వికెట్లపై ఎలా రాణించాడో చూశాము. కొంచెం సీమ్, స్వింగ్ ఉన్న పరిస్థితుల్లో ఇంకా బాగా రాణిస్తాడు. కాబట్టి ఇంగ్లండ్‌కు వెళ్లే భారత జట్టులో అతడు ఉంటాడని ఆశిస్తున్నానని" ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.