
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ (మే 25) తమ ఆఖరి మ్యాచ్ ఆడుతుంది. అహ్మదాబాద్ వేదికగా టేబుల్ టాపర్స్ గుజరాత్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి.
గుజరాత్ తరఫున రబాడ స్థానంలో గెరాల్డ్ కొయెట్జీ తుది జట్టులోకి రాగా.. సీఎస్‌కే తరఫున అశ్విన్ స్థానంలో హుడా తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిచినా, ఓడినా ఒరిగేదేమీ ఉండదు. ఈ సీజన్‌ను ఆ జట్టు ఆఖరి స్థానంతోనే ముగిస్తుంది. గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టు సీఎస్‌కేపై గెలిస్తే టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.
జట్ల వివరాలు..
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, MS ధోని(w/c), నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్
ఇంపాక్ట్ సబ్స్: మతీష పతిరన, విజయ్ శంకర్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, రవిచంద్రన్ అశ్విన్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ
ఇంపాక్ట్ సబ్స్: సాయి సుదర్శన్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ