గుజరాత్‌ బ్యాటర్లు విధ్వంసం.. ముంబై మందు భారీ టార్గెట్‌ | Bharti Fulmali smashes 36 from 15 to take Gujarat to 192 | Sakshi
Sakshi News home page

WPL 2026: గుజరాత్‌ బ్యాటర్లు విధ్వంసం.. ముంబై మందు భారీ టార్గెట్‌

Jan 13 2026 9:25 PM | Updated on Jan 13 2026 9:25 PM

Bharti Fulmali smashes 36 from 15 to take Gujarat to 192

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌-2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ జెయింట్స్ బ్యాట‌ర్లు త‌మ సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా న‌వీ ముంబై వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. గత రెండు మ్యాచ్‌లలో మెరుపులు మెరిపించిన సోఫీ డివైన్.. ముంబైపై మాత్రం నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి డివైన్ ఔటైంది.

అయితే జార్జియా వేర్‌హామ్(33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43), భారతి ఫుల్మాలి(15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36) మెరుపులు మెరిపించారు. వీరిద్దరితో పాటు మూనీ(33), కనిక అహుజా(35) రాణించారు. ముంబై బౌలర్లలో ఇస్మాయిల్‌, హీలీ మాథ్యూస్‌, అమీలియా కేర్‌, కారీ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: T20 World Cup: ఆస్ట్రేలియాకు మ‌రో భారీ షాక్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement