మిచెల్ మార్ష్ విధ్వంసక‌ర సెంచ‌రీ.. 10 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో | GT vs LSG 2025: Mitchell Marsh Maiden IPL Ton | Sakshi
Sakshi News home page

IPL 2025: మిచెల్ మార్ష్ విధ్వంసక‌ర సెంచ‌రీ.. 10 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో

May 22 2025 10:35 PM | Updated on May 22 2025 10:35 PM

GT vs LSG 2025: Mitchell Marsh Maiden IPL Ton

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్టార్ ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను మార్ష్ ఊతికారేశాడు. 

నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఆస్ట్రేలియన్ సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. అత‌డిని ఆప‌డం ఎవ‌రి త‌రం కాలేదు. బౌల‌ర్ల‌ను ఎంత‌మందిని మార్చినా మార్ష్ నుంచి వ‌చ్చిన స‌మాధాన‌మే ఒక్క‌టే. ల‌క్నో ఇన్నింగ్స్ 12 ఓవ‌ర్ వేసిన ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో మార్ష్ రెండు సిక్స్‌లు, మూడు ఫోర్ల‌తో ఏకంగా 25 ప‌రుగులు రాబ‌ట్టాడు. ఈ క్ర‌మంలో కేవ‌లం  56 బంతుల్లో త‌న సెంచ‌రీ మార్క్‌ను మార్ష్ అందుకున్నాడు. 

మార్ష్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఓవ‌రాల్‌గా 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్‌.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. కాగా ఈ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

మార్ష్‌ సాధించిన రికార్డులు ఇవే..
👉ఒకే సీజ‌న్‌లో ల‌క్నో సూపర్‌ జెయింట్స్‌ త‌రపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ప్లేయ‌ర్‌గా మార్ష్ నిలిచాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో మార్ష్ ఇప్ప‌టివ‌ర‌కు 560 ప‌రుగులు చేశాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్‌(616) అగ్ర‌స్ధానంలో ఉన్నాడు. 

👉అదేవిధంగా ఒక సీజ‌న్‌లో ల‌క్నో త‌ర‌పున అత్యధిక ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు చేసిన కేఎల్ రాహుల్ రికార్డును మార్ష్ స‌మం చేశాడు. ఐపీఎల్‌-2022 సీజన్‌లో రాహుల్ 6 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేయగా.. ఈ ఏడాది సీజన్‌లో మార్ష్ కూడా సరిగ్గా ఆరు సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. మార్ష్ మరో హాఫ్ సెంచరీ చేస్తే రాహుల్‌ను అధిగమిస్తాడు.



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement