
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఇటీవలే సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన హీరోగా నటించిన 3బీహెచ్‌కే జూలై 4న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఈ చిత్రానికి శ్రీగణేశ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ మీతా రఘునాథ్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిద్ధార్థ్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేవలం రెండు వేల రూపాయలకే అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యానని వెల్లడించారు.









