ఈ సినిమాను సెన్సార్‌ కట్‌ లేకుండా చూస్తేనే!: రాధికా ఆప్టే | Actress Radhika Apte Embraces Her Movie Sister Midnight | Sakshi
Sakshi News home page

Radhika Apte: ఈ సినిమా సెన్సార్‌ కట్‌ లేకుండా చూస్తేనే అర్థమవుతుంది: రాధికా ఆప్టే

May 31 2025 4:36 PM | Updated on May 31 2025 5:27 PM

Actress Radhika Apte Embraces Her Movie Sister Midnight

హీరోయిన్ రాధికా ఆప్టే ఇటీవలే సిస్టర్‌ మిడ్‌నైట్‌ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో ఇంతకు ముందెన్నడు చేయని డిఫరెంట్‌ రోల్‌లో నటించింది. ఈ మూవీని ఇటీవలే కాన్స్‌ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించారు. అక్కడ ఈ సినిమాపై పలువురు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. మే 23న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.  ఈ నేపథ్యంలోనే రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ చిత్రం ఇండియాలో విడుదలకు ముందు సెన్సార్‌ గురించి ఆందోళన ఉండేదని రాధికా తెలిపింది. ఎలాంటి కట్‌ లేకుండా సెన్సార్‌ ఇస్తేనే బాగుంటుందని భావించినట్లు పేర్కొంది. ఎందుకంటే ఈ చిత్రం కట్ చేయకుండా ప్రదర్శిస్తేనే అర్థమవుతుందని వెల్లడించింది. అనుకున్నట్లే ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్‌ వచ్చిందని రాధికా ఆప్టే పంచుకుంది.

రాధికా ‍ఆప్టే మాట్లాడుతూ.. 'స్క్రిప్ట్‌ను తాను ఇంతకు ముందు చేసిన వాటికి భిన్నంగా ఉంది. ఇది చాలా విచిత్రమైన సినిమా. ఇది ఒక క్రేజీ సినిమా. అది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎవరికైనా నటనలో పూర్తి స్వేచ్ఛ లభిస్తే అది చాలా మంచి సినిమా అవుతుంది. లేకపోతే అది ఒక డిజాస్టర్‌గా మిగులుతుంది.  ప్రతి సృజనాత్మక నిర్ణయం వెనుక డైరెక్టర్‌ కాంధారి ఉన్నారని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ ఫెస్టివల్ సర్క్యూట్‌లో మా సినిమా విజయం సాధించడం నమ్మకాన్ని మరింత పెంచిందని ఆమె చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement