జమ్మూ కశ్మీర్‌: చీనాబ్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ | PM Narendra Modi Visit To Jammu And Kashmir To Launch Major Bridges, Watch Live Updates In Telugu | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్‌: చీనాబ్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

Jun 6 2025 8:41 AM | Updated on Jun 6 2025 1:16 PM

Pm Narendra Modi Visit To Jammu And Kashmir Updates

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా జమ్మూ కశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐకానిక్ చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు.. చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జి నిర్మించారు. 1,315 మీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ శుక్రవారం.. జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో  జమ్మూ కశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా,  రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొన్నారు.

ఈ క్రమంలో పలు అభివృద్ధి పథకాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే కాట్రా- శ్రీనగర్ మధ్య వందే భారత్ ట్రైన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ రైలు ప్రారంభంతో కాట్రా-శ్రీనగర్ మధ్య దూరం తగ్గనుంది. కేవలం మూడు గంటలోనే రైలు చేరుకుంటోంది. భారత్‌లో తొలిసారిగా రూపొందించిన కేబుల్ రైల్వే బ్రిడ్జి అంజి బ్రిడ్జిని మోదీ ప్రారంభించనున్నారు. 43,780  కోట్ల రూపాయల వ్యయంతో ఉదంపూర్ శ్రీనగర్ భారముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు ప్రకటన ప్రధాని మోదీ చేయనున్నారు.

సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కోసం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.350 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న శ్రీమాతా వైష్ణో దేవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రాజెక్ట్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

చీనాబ్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

Advertisement
 
Advertisement
Advertisement