విద్యార్థులపైకి తూటాలా.. మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్‌ | Rahul Gandhi Targets Centre Over Crackdown On Students, Questions Police Over Action In Delhi And Bihar, Check Post Inside | Sakshi
Sakshi News home page

విద్యార్థులపైకి తూటాలా.. మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్‌

Jul 27 2026 11:37 AM | Updated on Jul 27 2026 12:08 PM

Rahul Gandhi Serious Comments On PM Modi

ఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కార్‌ విపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్, బీహార్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారని రాహుల్‌ మండిపడ్డారు. విద్యార్థుల పట్ల మొత్తం వ్యవస్థ అత్యంత కఠినంగా, అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు.

విద్యార్థులపై పోలీసుల చర్యలను ఉద్దేశించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్‌.. ‘బీహార్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారనే వార్తలు వస్తున్నాయి. వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, బీహార్‌లో ఏకే-47లు ప్రయోగించారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ.. ఎక్కడ చూసినా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించడం లేదని, సంస్కరణలు చేపట్టే సామర్థ్యం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. దేశంలోని విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి కానీ విద్యార్థులపైన కాదు అని డిమాండ్ చేశారు.

అయితే, పోలీసుల చర్యలు చట్టపరమైన పరిస్థితుల నేపథ్యంలోనే జరిగాయని, శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. బీహార్‌లో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసులు అధికారి ఏకే-47 పట్టుకుని నిరసనకారులపైకి ఎక్కుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా సదరు పోలీసు అధికారిని సస్పెండ్‌ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement