
కత్రా: ఆపరేషన్ సిందూర్‌లో మన ఆయుధ సత్తాను ప్రపంచం చూసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పాకిస్థాన్ ఆటలను జమ్మూకశ్మీర్‌లో సాగనివ్వమంటూ హెచ్చరించారు. శుక్రవారం ఆయన పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా జమ్మూ కశ్మీర్‌లో పర్యటించారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐకానిక్ చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పథకాలను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పుడు కనెక్టివిటీ ఉందన్నారు.
కశ్మీర్‌లో ఈ ప్రాజెక్టుతో లక్షల మంది కల సాకారమైంది. మా హయాంలో ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తయింది. కోవిడ్ వల్ల కొన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి చూపించాం. చీనాబ్ బ్రిడ్జ్ వల్ల టూరిజం మరింత అభివృద్ధి అవుతుంది. మన ఇంజనీర్లు అద్భుతం చేసి చూపించారు. కశ్మీర్‌లో మరిన్ని మెడికల్ కాలేజీలు రానున్నాయి. టూరిజం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ పాకిస్థాన్ మానవత్వం మరిచి.. పర్యాటకులపై దాడి చేయించింది. రికార్డు స్థాయిలో పర్యాటకులు సంఖ్య పెరుగుతోందని పాకిస్థాన్ కుట్ర చేసింది. కశ్మీర్‌లో పర్యాటకాన్ని దెబ్బతీయాలని పాక్ కుట్రలు చేసింది. కశ్మీర్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
#WATCH | Katra, J&K | Prime Minister Narendra Modi says, "Remember exactly one month ago, on the night of 6 May, Pakistan saw its doomsday. Now, whenever Pakistan hears the name of Operation Sindoor, it will remember its shameful defeat. The Pakistani Army and terrorists had… pic.twitter.com/Umab57Waat
— ANI (@ANI) June 6, 2025
భారత్ దాడులతో పాక్ వణికిపోయింది. పక్కాగా చేసిన స్ట్రైక్స్‌తో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను క్షమించం అనే సందేశం పంపాం. 22 నిమిషాల్లోనే పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం. భారత్ ఈ స్థాయిలో దాడి చేస్తుందని పాకిస్థాన్ ఊహించలేకపోయింది. మనం ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తే.. పాక్ మన ప్రజలను, ఆలయాలను టార్గెట్ చేసింది. పాకిస్థాన్‌కు గట్టి సమాధానం చెప్పేందుకు జమ్ముకశ్మీరీలు సిద్ధంగా ఉన్నారు’’ అని ప్రధాని మోదీ అన్నారు.
