
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలో నరమేధంలోనూ ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదానికి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో పురోగతి లభించింది.
కేంద్రం భద్రతా సంస్థల దర్యాప్తులో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్‌ఎఫ్(The Resistance Front)ఉగ్రవాదులు కెమెరాలు అమర్చిన హెల్మెట్లు ధరించి 26మంది అమాయాకుల ప్రాణాల్ని బలి తీసుకున్నారు. ప్రాణాలు తీసే సమయంలో దాడిని వీడియో రికార్డు చేసుకున్నారు.అనంతరం, హింసాత్మక చర్యపై సంతోషం వ్యక్తం చేస్తూ.. టూరిస్టుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు రక్షణగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు తుపాకుల్ని తెచ్చి వారికి ఇచ్చారు. ఆ తుపాకుల్ని గాల్లోకి ఎక్కుపెట్టి కాల్పులు జరిపి రాక్షసానందం పొందినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు ఎన్‌ఐఏకి చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై ముష్కరులు సృష్టించిన నరమేధంలో మరణించిన 26మంది టూరిస్టులు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఉన్నారు. వీరితో పాటు నేపాల్‌కు చెందిన ఓ పర్యాటకుడు, పహల్గాంకు చెందిన స్థానికుడు ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల వివరాలు
సుశీల్ నాథ్యాల్ – ఇండోర్
సయ్యద్ ఆదిల్ హుస్సైన్ షా – హపత్నార్, తహసిల్ పహల్గాం
హేమంత్ సుహాస్ జోషి – ముంబై
వినయ్ నార్వాల్ – హర్యానా
అతుల్ శ్రీకాంత్ మోని –మహారాష్ట్ర
నీరజ్ ఉదావాని – ఉత్తరాఖండ్
బిటన్ అధికారి – కోల్‌కతా
సుదీప్ నియుపానే – నేపాల్
శుభం ద్వివేది – ఉత్తరప్రదేశ్
ప్రశాంత్ కుమార్ సత్పతి – ఒడిశా
మనీష్ రంజన్ – బీహార్
ఎన్. రామచంద్ర – కేరళ
సంజయ్ లక్ష్మణ్ లల్లీ – ముంబై
దినేష్ అగర్వాల్ – చండీగఢ్
సమీర్ గుహార్ – కోల్‌కతా
దిలీప్ దసాలీ – ముంబై
జే. సచంద్ర మోలీ – విశాఖపట్నం
మధుసూదన్ సోమిశెట్టి – బెంగళూరు
సంతోష్ జాఘ్డా – మహారాష్ట్ర
మంజు నాథ్ రావు – కర్ణాటక
కస్తుబ గంటోవత్య – మహారాష్ట్ర
భరత్ భూషణ్ – బెంగళూరు
సుమిత్ పరమార్ – గుజరాత్
యతేష్ పరమార్ – గుజరాత్
టగెహాల్యిగ్ – అరుణాచలప్రదేశ్
శైలేష్‌భాయ్ హెచ్. హిమత్‌భాయ్ కళాథియా – గుజరాత్
ఆపరేషన్ సిందూర్‌తో చావు దెబ్బ కొట్టిన భారత్
పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ పాక్‌ను భారత్ దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మే7న (మంగళవారం) అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. ప్రపంచ దేశాల ముందు పాక్‌ను భారత్‌ను దోషిగా నిలబెట్టింది.