పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. తొలిసారి జమ్మూకశ్మీర్‌ పర్యటనకు ప్రధాని మోదీ | Pm Modi Likely Visit Jammu Kashmir After Pahalgam Incident | Sakshi
Sakshi News home page

పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. తొలిసారి జమ్మూకశ్మీర్‌ పర్యటనకు ప్రధాని మోదీ

Jun 3 2025 12:14 PM | Updated on Jun 3 2025 12:29 PM

Pm Modi Likely Visit Jammu Kashmir After Pahalgam Incident

సాక్షి,ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఈ నెల 6న (జూన్‌6) జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా చీనాబ్‌ రైల్వే బ్రిడ్జీని ప్రారంభించనున్నారు. పర్యటనలో భాగంగా ఉగ్రవాదం అణిచివేతపై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మోదీ తన పర్యటనలో సెమీ హై స్పీడ్‌ ట్రైన్‌ వందే భారత్‌ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తద్వారా జమ్మూకశ్మీర్‌ జాతీయ రహదారిపై ప్రయాణికులు ఇబ్బందులు తొలగనున్నాయి.

 దీంతో పాటు ఈ మార్గమధ్యంలో చీనాబ్‌ నది (Chenab River)పై నిర్మించిన బ్రిడ్జ్‌ను ప్రారంభించనున్నారు. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ వంతెనను నిర్మించారు. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు.

Advertisement
 
Advertisement
Advertisement