మోదీపై రాహుల్‌ ఘాటు విమర్శలు.. జైశంకర్‌కు కొత్త పేరు | Rahul Gandhi Slams Jaishankar And PM Modi Over Operation Sindoor, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

మోదీపై రాహుల్‌ ఘాటు విమర్శలు.. జైశంకర్‌కు కొత్త పేరు

May 23 2025 4:13 PM | Updated on May 23 2025 4:32 PM

Rahul Gandhi Slams Jaishankar Over Operation Sindoor

సాక్షి,ఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ విదేశాంగ విధానం కుప్పకూలిందని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు గురువారం రాహుల్ గాంధీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ప్రధాని మోదీపై ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ ప్రకటనను ఎందుకు నమ్మారు?.కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం ఎందుకు మరుగుతోంది. భారత దేశ గౌరవం విషయంలో మీరు ఎందుకు రాజీ పడ్డారు. పహల్గాం ఉగ్రదాడిపై భారత్‌కు మద్దతిస్తూ.. పాకిస్తాన్‌ను ఏ ఒక్క దేశం ఎందుకు ప్రశ్నించలేదు. భారత్‌-పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించమని ట్రంప్‌ను ఎవరు అడిగారు?’ అని నొక్కాణించారు.

 

ఈ సందర్భంగా దేశ విదేశాంగ విధానం కుప్పకూలిందని ఆరోపిస్తూ ఆ శాఖను నిర్వర్తిస్తున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జై శంకర్‌కు రాహుల్‌ కొత్త పేరు పెట్టారు. జైశంకర్‌ కాదని..జైచంద్ జైశంకర్ అని విమర్శించారు. జై శంకర్‌ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన వీడియోను ట్యాగ్‌ చేస్తూ.. తాను పైన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పరిణామలపై కాంగ్రెస్‌ నేతలు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ను జైచంద్‌ జైశంకర్‌ అని సంబోధిస్తూ విమర్శిస్తున్నారు.దీంతో జైచంద్‌ జైశంకర్‌ పేరు ఎందుకు పెట్టారా అని పలువురు నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ప్రముఖ కవి పృథ్వీరాజ్ రాసో రాసిన ఓ కవిత నుంచి ఈ పేరును తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కవితలో రాజ్‌పుత్ పాలకుడు జైచంద్, మరొక రాజ్‌పుత్ పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్‌కు వ్యతిరేకంగా ముహమ్మద్ ఘోరీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పబడింది.  

రాహుల్‌పై బీజేపీ విమర్శలు
అయితే, రాహుల్‌ కామెంట్స్‌పై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శలు గుప్పించారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయన నిర్లక్ష్య ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనతో రాహుల్‌ గాంధీ స్వభావం ఎలాంటిదో చెబుతోంది. రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ అంటే పడకపోవచ్చు. కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిపై ఉపయోగించిన భాష దురదృష్టకరం’ అని మండిపడ్డారు.

ఆపరేషన్ సిందూర్ ఎంత విజయవంతమైందో మనందరికీ తెలుసు. ప్రతి భారతీయుడు దాని గురించి గర్వపడుతున్నాడు.ప్రపంచం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అభినందిస్తోంది. మన ధైర్య సాయుధ దళాలను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాదులను మాత్రమే కాకుండా ఉగ్రవాదాన్ని నిర్మూలించేలా ఆపరేషన్‌ సిందూర్‌తో సంకేతం పంపించామని’ భాటియా సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement