
హైదరాబాద్: నగరంతో పాటు పాతబస్తీలో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పట్టు వ్రస్తాలు సమర్పించారు.













