
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ వ్యూహాలపైనే చర్చ నడుస్తోంది. ఎంత కఠినమైన సమయంలో కూడా తనలోని గాంభీర్యాన్ని ముఖంలో కనిపించనీయకుండా. పైకి తనపని తాను చేసుకుంటూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉండటమే మోదీ శైలి. అవతలి వాడికి అవకాశమివ్వడం, అవతలివాడిని మాట్లాడనీయడం మోదీకి తెలిసిన మరో విద్య.
అది చెడు కానంతవరకే మోదీ భరిస్తారు.. ఒకవేళ అవతలి వాళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న సమయంలో మాత్రం మోదీ వ్యవహరశైలి భిన్నంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా విశేష అభిమానం సందపాదించుకున్న మోదీ యుద్ధ వ్యూహాలను చూసి ప్రపంచ మిలిటరీ వ్యూహకర్తలు, విశ్లేషకులు నివ్వెరపోతున్నారు.
ఎడమవైపు సంజ్ఞ చేస్తారు కుడివైపుకు తిరుగుతారు.. ఇది మనకు మోదీ ప్రసంగంలో తరుచు కనిపిస్తూ ఉంటుంది. మరి మోదీ వ్యూహాలు కూడా ఇలానే ఉంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులే కాకుండా ఆ దేశ కవ్వింపు చర్యలకు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవతమైంది. గత కొన్నేళ్లుగా మోదీ యుద్ధ తంత్రాలను దాయాది దేశం పాకిస్తాన్ పసిగట్టలేకపోతోంది.
బాలాకోట్, "ఆపరేషన్ సింధూర్" రెండింటికీ ముందు, ప్రధాని మోదీ బాడీ లాంగ్వేజ్ బహిరంగ ప్రదర్శనే గాక ఆయన ప్రసంగాలు కూడా ప్రశాంతంగా కనిపించాయి. మోదీ అసలు ఉద్ధేశాన్ని బహిర్గత పరచలేదు. ఈ రెండు సమయాల్లోనూ సూదిమొనంత కచ్చితత్వంతో తాను చేయబోయే అ దాడులను,కాయన అమాయక మొహం వెనక దాచిపెట్టారు.
బాలాకోట్ దాడి వ్యూహం తరహాలోనే, ఈసారి కూడా ప్రధాని మోదీ వ్యూహాలు పాకిస్తాన్‌ను నివ్వెరపరచాయ్. దాడికి ముందు ప్రశాంతమైన బాడీ లాంగ్వేజ్‌తో మాస్టర్‌మైండ్ యుద్ధతంత్రంతో. ఆపరేషన్ సింధూర్ కు ముందు ప్రదర్శించిన వైఖరి.. బాలకోట్‌కు ముందు ఆయన ప్రదర్శించిన వైఖరి పాకిస్తాన్‌ను అయోమయంలో పడేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక వైపు చూపించి.. మరో వైపు నుంచి.. మధ్యందిన మార్తాండుని వలే అనన్యసామాన్యమైన శక్తితో శత్రువుపై పిడుగులు కురిపించే కళలో ప్రావీణ్యం సంపాదించినట్లే ఉంటుంది.. 2019లో బాలకోట్ దాడులకు ముందు ఆయన ప్రయాణ ప్రణాళికతో పాటు ఆయన ప్రసంగం, ప్రస్తుత "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా ఆయన వ్యూహాలు.. యుద్ధతంత్రంలో మాస్టర్‌క్లాస్‌లు.. శత్రువును అచేతనం చేసి.. మూగబోయేలా చేశాయి.
ఒకసారి చేస్తే యాదృచ్ఛికం కానీ మళ్ళీమళ్ళీ పునరావృతం చేయడమంటే.. ప్రపంచమనే వేదికను నివ్వెరపరచడమే. ఇది మోదీకే సాధ్యమైన యుద్ధతాండవం. అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. రెండు దాడులకు మధ్య ఉన్న సారూప్యతలను పరిశీలిస్తే.. అవి కచ్చితంగా ఆశ్చర్యచకితుల్ని చేసే విధంగా ఉంటాయి. బాలకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రదర్శించిన తంత్రం నుండి ఎలాంటి పాఠం నేర్చుకోనందుకు పాకిస్తాన్ తన చెప్పుతో తననే కొట్టుకుంటుంది.
బాలకోట్ కు 48 గంటల ముందు
2019 ఫిబ్రవరి 26న.. తెల్లవారుఝామున భారతదేశం బాలకోట్ పై దాడి చేసింది. కానీ, ఆ దాడికి ముందు 48 గంటలు, మోదీ షెడ్యూల్ అంతా యథావిధిగా జరిగింది.
ఫిబ్రవరి 25న, ఆయన న్యూఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి ఆయన మాట్లాడినప్పటికీ, పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని జిహాదిస్ట్ మౌలిక సదుపాయాలపై రాబోయే దాడి గురించి ఎటువంటి సూచన ఇవ్వలేదు.
నిన్న(మంగళవారం, మే 6వ తేదీ) రాత్రి 9 గంటలకు, భారత విమానాలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రధాని మోదీ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారతదేశం యొక్క ఆకాంక్షలు, అభివృద్ధి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దాని సంకల్పం గురించి మోదీ మాట్లాడారు. ఆందోళన సూచించే ఒక్క ముడత కూడా అతని నుదిటిపై కనిపించలేదు. ప్రసంగంలో సందేహాస్పదమైన అంశాలకు ఏమాత్రం చోటివ్వలేదు.
తుఫాను ఎదురైనప్పుడు ప్రశాంతత, అగ్ని గుండంలోనూ ధైర్యంగా నిలబడగలగడం గొప్ప నాయకుడి లక్షణాలు అని మనస్తత్వవేత్తలు అంటారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వం.. వారు సూచించే నాయకత్వ అంచనాలకు సరిపోవడం చూసి.. వారు నాయకత్వానికి ఇచ్చిన భాష్యం సరైందేనని భావిస్తారు.
మోదీ వ్యూహాలు అర్థం కాలేదు,..
చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోకపోతే, అవే తప్పులను పునరావృతం చేస్తారు. బాలాకోట్‌కు ముందు ప్రధాని మోదీ తీరును పాకిస్తాన్ విశ్లేషించి ఉంటే.. మే 6వ తేదీ రాత్రి నియంత్రణ రేఖ వెంబడి తొమ్మిది లక్ష్యాలపై భారత్ దాడి చేసినప్పుడు ఆ దేశం ఎంతో కొంత ప్రతిఘటించే ఉండేది, కానీ మోదీ వ్యూహాలు అర్ధం కాకపోవడంతో పాకిస్తాన్ చూస్తూ ఉండిపోయింది.
బాలకోట్‌కు ముందు ప్రధాని మోదీ వైఖరికి సంబంధించి కచ్చితత్వానికి ప్రతిరూపంగానే నిలుస్తుంది. దాడులకు కొన్ని గంటల ముందు, ఆయన ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొని 2047 నాటికి భారతదేశం ఆర్థికంగా గొప్ప దేశంగా ఎదగాలనే ఆకాంక్షల గురించి మాట్లాడారు.
30 నిమిషాల పాటు జరిగిన ఆనాటి తన ప్రసంగంలో.. ఏమాత్రం ఆందోళన కానీ ఒత్తిడి లేని వ్యక్తిలా ప్రశాంతంగా ఆయన మాట్లాడారు, జోకులు వేస్తూ, భారతదేశంలో ఉగ్రవాద దాడులకు మద్దతు ఇచ్చినందుకు పొరుగువారిని విమర్శించడం వినడానికి ప్రేక్షకులు ఆసక్తిగా కనిపించినప్పటికీ, పాకిస్తాన్ అనే పదాన్ని మాత్రం ఒక్కసారి కూడా పలకలేదు. ఆ సందర్బంగా మోదీ బాడీ లాంగ్వేజ్‌ను పరిశీలిస్తే ఎలాంటి అంచనాకు రాలేం.
భారతదేశం అంతటా యుద్ధ విన్యాసాలు ప్రకటించడం అతిపెద్ద తంత్రం.. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికీ తన దేశాన్ని సైనిక చర్యకు, దాని పరిణామాలకు సిద్ధం చేస్తున్నారని సూచిస్తుంది. కానీ, ఇది పాకిస్తాన్‌కు విలాసవంతమైన సమయం ఉందనే భ్రమను కలిగించడానికి ఒక వ్యూహం మాత్రమే అని ఉదయాన్నే తేలింది.
యుద్ధ కళలో నిష్ణాతులు ఏమంటారంటే.. మీకు మీ శత్రువు గురించి పూర్తిగా తెలిస్తే, యుద్ధంలో ఓటమికి చాలా తక్కువ అవకాశం ఉంటుందని చెబుతారు. పాకిస్తాన్‌ను మోదీ పూర్తిగా చదివేశారు... కానీ ఆయన్ను అంచనా వేయడంలో పాక్ మళ్లీ ఫెయిల్ అయ్యింది. అందుకే గెలుపు ప్రతీసారి మోదీనే వరిస్తుంది.