
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వల్ప అనారోగ్యంతో సోమవారం(జూలై 21) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. మార్నింగ్ వాక్ సమ యంలో తల తిరిగినట్లుగా అనిపించిందని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీఎం స్టాలిన కు అవసరమైన పరీక్షలు చేశామని మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ బీజీ వెల్లడించారు.
సీఎం కోలుకుంటున్నారని ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి మీడియాకు ఆస్పత్రి వద్ద తెలిపారు. గత రెండు మూడు నెలలుగా బిజీ షెడ్యూల్ ఉన్నందునే, ఆ ప్రభావం ఆయనపై పడిందన్నారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారన్నారు.