దివంగత అజిత్‌ పవార్‌ కోసం ఎన్సీపీ కార్యకర్త ఏం చేశాడంటే! | Nagpur man vowed to grow hair until Ajit Pawar became CM he did after his sudden demise | Sakshi
Sakshi News home page

దివంగత అజిత్‌ పవార్‌ కోసం ఎన్సీపీ కార్యకర్త ఏం చేశాడంటే!

Jan 30 2026 4:56 PM | Updated on Jan 30 2026 5:48 PM

Nagpur man vowed to grow hair until Ajit Pawar became CM he did after  his  sudden demise

విమాన ప్రమాదంలో పవార్ ఆకస్మిక మరణం తర్వాత  బారామతికి  వచ్చిన విలాస్ ఝోడపే గురువారం బారామతిలోని నీరా నది ఒడ్డున తన తలనీలాలు సమర్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

పలు నివేదికల ప్రకారం  నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ తాలూకాకు చెందిన పార్టీ కార్యకర్త, అజిత్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకు తన జుట్టు కత్తిరించుకోనని ప్రతిజ్ఞ చేశారు 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఘటన జరిగింది. నాయకుడిపై తనకున్న విశ్వాసానికి ప్రతీకగా ఆయన ఏడాదికి పైగా జుట్టు కత్తిరించుకోలేదు. కానీ దాదా అకాల మరణంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఝోడపే నాగ్‌పూర్‌లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల సమయంలో అజిత్ పవార్‌ను కలిశారు. ఆ సీనియర్ నాయకుడు అతని పొడవాటి జుట్టును గమనించి, నాయకులకు ఇలాంటి రాజకీయ బలం, మద్దతు అవసరమని చెప్పారు. అలాగే ప్రజా సేవ,పార్టీ సంస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పవార్ అతన్ని ప్రోత్సహించేవారు.

 జనవరి 28వ తేదీ ఉదయం పవార్‌ను కలవడానికి ఝోడపే ముంబైకి చేరుకున్నారు, అదే సమయంలో ఘోర విమాన ప్రమాదం వార్త వెలువడింది.  పవార్ అకాల మరణంతో ఆ ప్రతిజ్ఞ నెరవేరలేదు.ఇంతలోనే అజిత్‌ పవార్‌ ఆకస్మికమరణం ఆయనను కలిచి వేసింది తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అతను వెంటనే బారామతికి బయలుదేరాడు.  నాగ్‌పూర్‌లోని తన భార్యకు,  ఇద్దరు పిల్లలకు సమాచారం ఇచ్చి వారిని కూడా రమ్మని చెప్పాడు. అలా ఆ కుటుంబం పవార్‌ అంత్యక్రియలకు హాజరైంది.

తలనీలాలు
అంత్యక్రియల తర్వాత, ఝోడపే నీరా నది వద్ద తలనీలాలు సమర్పించి,  దీన్ని పవార్ స్మృతికి అంకితం చేశారు. స్థానికులతో మాట్లాడుతూ, తాను ఎవరి కోసం ఈ ప్రతిజ్ఞ చేశానో ఆ వ్యక్తి ఇప్పుడు మనతో లేరు. ఇక్కడ నా తలనీలాలు సమర్పించడం ద్వారా, నేను ఈ త్యాగాన్ని అజిత్ దాదా వారసత్వానికి అర్పిస్తున్నాను  అంటూ భవోద్వాగానికి లోనయ్యాడు.

అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదిప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి,   పైలట్‌, సుమిత్కపూర్, కెప్టెన్ సాహిల్ మదన్, కోపైలట్‌, శంభవి పాఠక్‌తో సహా మరో నలుగురు కూడా మరణించారు.

ఇదీ చదవండి: 20 ఏళ్లకే పెళ్లి, 15 రోజులకే వైధవ్యం, 30 ఏళ్లు మగాడిలా

అజిత్‌ పవార్‌ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని ప్రకటించిన  ముఖ్యమంత్రి  మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. అధికార లాంఛనాలతో డిప్యూటీ సీఎం అంత్యక్రియలను నిర్వహించారు.  పవార్‌కు తుది నివాళులర్పిందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సహా పలువురు పార్టీ కార్యకర్తలు, ప్రజలు . సీనియర్ నాయకులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మరోవైపు దివంగత అజిత్ పవార్  అస్థికలను సోన్‌గావ్‌లో కర్హా మరియు నీరా నదుల సంగమంలో నిమజ్జనం చేశారు. కుమారులు పార్థ్ పవార్ ,జయ పవార్ ఈ క్రతువులను నిర్వహించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దివంగత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement