
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2025.. రెండోరోజు అప్‌డేట్స్
పార్లమెంట్ రేపటికి వాయిదా
మద్యాహ్నాం 2 గం. తర్వాత తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు
ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలు
సభల్లో గందరగోళంతో రేపటికి వాయిదా
ఆపరేషన్ సిందూర్, తదితర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేయడంతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్‌సభ కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు చేయడంతో, దిగువ సభ కార్యకలాపాలలను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అయితే తిరిగి సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించడంతో, స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
ప్రతిపక్ష పార్టీల ఆందోళనల మధ్య రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ సోమవారం రాత్రి ఆకస్మిక రాజీనామా చేయడంపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ఎగువ సభ ఉదయం కార్యకలాపాలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. తరువాత కూడా నిరసనలు కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సమావేశాలకు అధ్యక్షత వహించారు. ధన్‌ఖడ్ రాజీనామా, బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ అంశాలపై చర్చ చేపట్టడానికి ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా నోటీసులను హరివంశ్ తిరస్కరించారు.
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నాం 12గం. వరకు వాయిదా
పప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డ ఉభయ సభలు
వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాల పట్టు
విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా
రాజ్యసభ వాయిదా
విపక్ష సభ్యుల ఆందోళనతో రాజ్యసభలో గందరగోళం
సభ వాయిదా ప్రకటన
లోక్‌సభ వాయిదా
స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ప్రారంభమైన లోక్‌సభ
ప్రారంభమైన నిమిషాల్లోనే విపక్ష సభ్యుల ఆందోళన
వాయిదా తీర్మానాలు చర్చించాలని పట్టు
సభ్యుల ఆందోళన నడుమ సభ వాయిదా వేసిన స్పీకర్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజూ(మంగళవారం) ప్రారంభమయ్యాయి. అయితే ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది.
తొలిరోజున ప్రతిపక్షాలు.. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

తొలిరోజు నిరసనల మధ్యనే రాజ్యసభ.. షిప్పింగ్ డాక్యుమెంటేషన్ చట్టాలను ఆధునీకరించే లాడింగ్ బిల్లును విజయవంతంగా ఆమోదించింది. ఈ బిల్లు లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందింది. ఈరోజు బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అంశాన్ని ఇండియా బ్లాక్ నేతలు లేవనెత్తనున్నారు. వారు ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌లోని మకర్ ద్వార్ వద్ద నిరసన చేపట్టనున్నారు. సమావేశాల మొదటి రోజున.. హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ సిన్హాపై మోపిన అభిశంసనపై రాజ్యసభలో ప్రసంగించిన అనంతరం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ తన పదవికి రాజీనామా చేశారు.
#WATCH | Delhi: On Impeachment Motion against Justice Yashwant Varma, IUML MP ET Mohammed Basheer says, "The impeachment on that issue is very important. Because of the dealings of that judge, the degradation of the Indian judiciary's status occurred... We have also submitted… pic.twitter.com/SG8uavtoau
— ANI (@ANI) July 21, 2025
జూలై 21న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఆగస్టు 12 నుండి ఆగస్టు 17 వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల విరామం ఉంటుంది. ఆగస్టు 18న తిరిగి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా జస్టిస్ యశ్వంత్ వర్మపై మోపిన అభిశంసన తీర్మానంపై ఐయూఎంఎల్ ఎంపీ ఈటీ మహమ్మద్ బషీర్ మాట్లాడుతూ, ఈ అభిశంసన చాలా ముఖ్యమైనది. ఆ న్యాయమూర్తి వ్యవహారాల కారణంగా భారత న్యాయవ్యవస్థ స్థితి మరింత దిగజారింది. అందుకే తాము దీనిపై మెమోరాండంను స్పీకర్‌కు సమర్పించామన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందని ఆశిస్తున్నామని బషీర్ పేర్కొన్నారు.