ధన్‌ఖడ్‌ ఆరోగ్యం బాగుండాలి: ప్రధాని మోదీ | Jagdeep Dhankhar resignation Accepted PM Modi Tweet This | Sakshi
Sakshi News home page

ధన్‌ఖడ్‌ ఆరోగ్యం బాగుండాలి: ప్రధాని మోదీ

Jul 22 2025 12:38 PM | Updated on Jul 22 2025 1:14 PM

Jagdeep Dhankhar resignation Accepted PM Modi Tweet This

సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించారు. 74 ఏళ్ల ధన్‌ఖడ్‌ అనారోగ్య సమస్యల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యవసానం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు.. ధన్‌ఖడ్‌ రాజీనామాపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. జగదీప్ ధన్‌ఖడ్ మన దేశానికి వివిధ పదవుల్లో సేవలందించే అరుదైన అవకాశాలు పొందారు. ముఖ్యంగా భారత ఉపరాష్ట్రపతి హోదాలో. ఆయన ఆరోగ్యం బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని మోదీ ట్వీట్‌ చేశారు. 

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం(జులై 21)న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభ చైర్మన్‌ హోదాలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ హుషారుగానే హాజరయ్యారు. పలువురు నేతలతో సాయంత్రం దాకా తన అధికారిక కార్యాలయంలో సమావేశం కూడా అయ్యారు. అయితే రాత్రి సమయంలో.. అదీ అనూహ్యంగా రాజీనామా ప్రకటన చేశారు.

ఇదీ చదవండి: ధన్‌ఖడ్‌ రాజీనామా-బీజేపీ రియాక్షన్‌ ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement