ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్నారు. దేశ రాజధాని మనీలాలో మూడు రోజులపాటు జరిగే భారత్– ఆసియాన్ 21వ వార్షిక శిఖరాగ్రంలో పాలుపంచుకుంటారు. ఈ సందర్భంగా సమాఖ్య దేశాల అగ్ర నేతలతో ఆయన చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ వెల్లడించింది. పదకొండు దేశాలతో కూడిన ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య(ఆసియాన్) ఈ ప్రాంతంలో ప్రభావశీలమైన గ్రూపుగా అవతరించింది.
నవంబర్ 16 నుంచి 18వ తేదీ వరకు ప్రధాని పర్యటన కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మనీలాలో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నేతలకు విందు ఏర్పాటు చేయనున్నారు. అనంతరం మరుసటి రోజు ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సు, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు జరగనున్నాయి. ఈ సమావేశాల మధ్యలో ఇతర దేశాల నాయకులతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
ఇదీ చదవండి: ఇరాన్‌తో డీల్ అవసరం లేదు.. ట్రంప్ సంచలన ప్రకటన


