న్యూయార్క్: భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. న్యూయార్క్ 107వ వార్షిక వెటరన్స్ డే పరేడ్‌కు ’గ్రాండ్ మార్షల్’గా వ్యవహరించారు. మాజీ సైనికులు, సైనిక కుటుంబాలు, ప్రస్తుత సైనిక సిబ్బంది, బ్యాండ్ బృందాలు 20వేల మందికి పైగా పాల్గొన్నీ పరేడ్‌ను సునీతా విలియమ్స్ ముందుండి నడిపించారు. ఈ గౌరవం తనకెంతో ప్రత్యేకమైనదని సునీతా విలియమ్స్ అన్నారు.
‘అతి చిన్నవయసులో సైన్యంలో చేరినప్పుడు ఈ జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచించేదాన్ని. కానీ, సైన్యలో గడిపిన సమయం, నేర్చుకున్న పాఠాలకు నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. సైన్యంలో మొదటి అడుగులే నా జీవితానికి పునాదిని వేశాయి. ఆ పాఠాలను తర్వాతి తరానికి అందించాలని, వారు మనం ఊహించిన దానికంటే ఎంతో గొప్పగా రాణించాలని కోరుకుంటున్నా.
న్యూయార్క్ నగర వెటరన్స్ డే పరేడ్‌లో గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించడం, నా తోటి వెటరన్స్‌తో కలిసి నడవడం నాకు దక్కిన గొప్ప గౌరవం’అని ఆమె పేర్కొన్నారు. పరేడ్ ప్రారంభానికి ముందు మాడి సన్ స్క్వేర్ పార్క్ వద్ద మేయర్ జోహ్రాన్ మమ్దానీతో కలిసి ఆమె అమరవీరులకు నివాళులరి్పంచారు. అమెరికా సైనిక వీరుల ధైర్యం, సేవ, త్యాగానికి గుర్తుగా యునైటెడ్ వార్ వెటరన్స్ కౌన్సిల్ ప్రతి ఏటా ‘వెటరన్స్ డే’నిర్వహిస్తుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మాన్‌హట్టన్‌లోని ఫిఫ్త్ అవెన్యూ వీధుల గుండా పరేడ్ జరిగింది. ఈ పరేడ్‌లో 280కి పైగా మార్చింగ్ యూనిట్లు, 25కు పైగా శకటాలు, పురాతన సైనిక వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


