కాంగ్రెస్ నేత ప్రియాంక స్పషీ్టకరణ
ప్రజాస్వామ్యంలో బాధ్యత ప్రభుత్వానిదే
ఆత్మకథ ద్వారా అమ్మ వాస్తవాలు చెబుతున్నారు
వయనాడ్ (కేరళం): భారత రాజ్యాంగంలో నిరసన తెలపడం పౌరుల హక్కు అని, కాంగ్రెస్ పార్టీ విధానాలపై కూడా ప్రజలు ఆందోళనలు చేపట్టవచ్చునని, కాకపోతే అవి శాంతియుతంగా ఉండాలని వయనాడ్ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ గురువారం స్పష్టం చేశారు. కేరళం సెక్రటేరియట్ బయట నాలుగు నెలలుగా నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులపై పోలీసులు చర్య తీసుకున్న విషయంపై విలేకరులు ప్రశ్నించగా ‘‘దేశం మొత్తమ్మీద, ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉండాలన్నది నా అభిప్రాయం.
రాజ్యాంగం అందుకు అనుమతిస్తూంటే మరీ ముఖ్యమవుతుంది. తమ రాజ్యాంగ హక్కును అనుభవించే అవకాశం ప్రజలకు ఇవ్వాలి అనుకుంటున్నా’’అని ప్రియాంక సమాధానమిచ్చారు. ‘‘మేము అధికారంలో ఉన్న రాష్ట్రంలోనైనా సరే.. శాంతియుతంగా ఉన్నంతసేపు ఆందోళన, నిరసనలకు అవకాశం ఉండాలి’’అని స్పష్టం చేశారు. లోయర్ ప్రైమరీ స్కూల్ టీచర్లు తమ డిమాండ్ల సాధనకు చేపట్టిన నిరాహార దీక్షపై కేరళం పోలీసులు బుధవారం చర్యలు తీసుకున్నారు. ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న వలర్మతి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూండటంతో ఆసుపత్రికి తరలించారు.
కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత..
పెట్రోలులో ఇథనాల్ కలపడంతోపాటు కేంద్రం తీసుకునే ప్రతి చర్యకూ ప్రజలకు బాధ్యత వహించాలని ప్రియాంక స్పష్టం చేశారు. ఇథనాల్ మిశ్రమం కోసం ప్రజలు పెట్రోలుకు అదనంగా డబ్బు చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. కాబట్టి ఈ అంశంలో బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. ‘‘ఇష్టం వచ్చినట్లు చేసినా ప్రజలు ప్రశ్నించరని అనుకుంటున్నారు. కానీ ప్రజలు మరీ ముఖ్యంగా యువత ప్రశ్నించడం మొదలుపెడితే, నిరసనలు దిగితే, సమాధానాలు డిమాండ్ చేస్తే వాళ్లను కొట్టి, జైళ్లలో పెట్టి నిరసనలను అణచివేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు’’అని చెప్పారు. ధరల పెరుగుదలైనా, ఇంకే సమస్య అయినా.. ప్రజాస్వామ్యంలో ఎల్లప్పుడూ ప్రభుత్వానిదే బాధ్యతని చెప్పారు. పెట్రోలులో ఇథనాల్ మిశ్రమంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించడం, ఆ తరువాత కర్ణాటక ప్రభుత్వం పరీక్షల ద్వారా పెట్రోలులో నిర్దేశిత 20% కంటే ఎక్కువ ఇథనాల్ ఉందని ప్రకటించిన నేపథ్యంలో ప్రియాంక వ్యాఖ్యలకు ప్రాధాన్యమేర్పడింది.
‘‘అమ్మ గురించి అబద్ధాలు చెప్పారు...’’
భారతీయ జనతా పార్టీ, (బీజేపీ) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాం«దీపై ఎన్నో అబద్ధాలు, అర్ధ సత్యాలు, కల్పితాలను సృష్టించాయని వయనాడ్ ఎంపీ ప్రియాంక ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ అసత్యమని ఇప్పుడు సోనియా తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ద్వారా స్పష్టం చేస్తున్నార ని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ మాత్రం మళ్లీ అసత్యాలను ప్రచారంలోకి తెస్తోందని విమర్శించారు. ‘‘మా అమ్మ జీవితకాలంలో అత్యధిక సమయం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఇతరులు వాళ్లకు నచ్చినట్టు మాట్లాడారు. లబద్ధాలు చెప్పారు. కొన్ని సృష్టించి మరీ చెప్పారు. కల్పిత కథలూ ప్రచారంలో పెట్టారు. కానీ అమ్మ మాత్రం మౌనంగానే ఉంది. ఇప్పుడు తాను ఏమనుకుంటోందో ఆత్మకథ ద్వారా చెబుతోంది. తనకు ఆ హక్కు ఉంది’’అని వివరించారు.


