సోనమ్ వాంగ్‌చుక్‌ గృహ నిర్భందం | Sonam Wangchuk Under House Arrest | Sakshi
Sakshi News home page

సోనమ్ వాంగ్‌చుక్‌ గృహ నిర్భందం

Nov 13 2026 4:40 AM | Updated on Nov 13 2026 4:40 AM

Sonam Wangchuk Under House Arrest

లేహ్: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. శీతాకాలంలో హిల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి. ఈ నిరసనల నేపథ్యంలో ప్రముఖ పర్యావరణ వేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను  పోలీసులు గృహ నిర్భందం చేశారు.

లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికలను శీతాకాలంలో నిర్వహించాలని అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే లడఖ్‌లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి (గడ్డకట్టే చలి) పడిపోతాయని, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ప్రజలకు, ఓటర్లకు తీవ్ర ఇబ్బందికరమని స్థానికులు వాదిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లెహ్‌లో భారీ నిరసన రాలీలు నిర్వహించారు.

ఈ ఆందోళనలకు సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలిపారు. లడఖ్ ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య బద్ధమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీయకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆయనను స్వగృహంలోనే నిర్బంధించినట్లు సమాచారం.

పెరుగుతున్న వ్యతిరేకత 
లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరుతూ గత కొంతకాలంగా లడఖ్‌లో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శీతాకాల ఎన్నికల అంశం మళ్లీ నిరసనలకు తావిచ్చింది. సోనమ్ వాంగ్‌చుక్‌ను గృహనిబంధనలో ఉంచడంపై స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అణచివేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేతలు హెచ్చరిస్తున్నారు. హిమాలయ ప్రాంతంలో నెలకొన్న ఈ తాజా పరిణామాలు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement