
సాక్షి,న్యూఢ్లిలీ: పార్లమెంట్‌లో ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై పార్లమెంట్‌లో ఇక ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ వేయనున్నారు. తమకు కేటాయించిన సీట్లలో నుంచి ఎలక్ట్రానిక్ అటెండెన్స్ నమోదు కానున్నాయి. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డిజిటల్ అటెండెన్స్ అమలు కానున్నట్లు లోక్‌సభ తెలిపింది.
గతంలో హాజరు నమోదు కోసం ఎంపీలు సంతకాల్లో రిజిస్టర్ చేసే వారు. ఇకపై రాతపూర్వకంగా సంతకం చేసే బదులు డిజిటల్ అటెండెన్స్ పడనుంది. అలాగే 12 భాషల్లో పార్లమెంట్ ఎజెండాను డిజిటల్ సంసద్ పోర్టల్‌లో అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్స్ సహాయంతో స్పీచ్ టు టెక్స్ట్ రికార్డు కానుంది.లోక్‌సభ డిబేట్లను ఇకనుంచి రియల్ టైంలో ఏఐ టూల్స్ అనువదించనున్నట్లు లోక్‌సభ అధికారిక వర్గాల వెల్లడించాయి.