
న్యూఢిల్లీ: నగదు కట్టల వివాదంపై జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై తగు సమయంలో విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సోమవారం న్యాయవాది, పిటిషనర్ అయిన మాథ్యూస్ నెడుంపర తీరుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ చంద్రన్‌ల ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
జస్టిస్ యశ్వంత్ వర్మను కేవలం వర్మ అంటూ సంబోధించడమేంటని ప్రశ్నించింది. ఆయనేమైనా మీకు స్నేహితుడా? ఆయన ఇప్పటికీ జస్టిస్ వర్మనే. ఓ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఎంతో సీనియర్ అయిన ఆయన్ను అలా ఎలా సంబోధిస్తారు? కాస్త మర్యాదగా వ్యవహరించండి’అంటూ హితవు పలికింది. ‘ఆయనకు అంత గౌరవం అవసరం లేదు. పిటిషన్‌పై విచారణ చేపట్టండి’అని నెడుంపర పేర్కొనగా మీరు మాకు ఆదేశాలివ్వక్కర్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
జస్టిస్ వర్మకు సంబంధించిన వివాదానికి సంబంధించి ఆయన ఏకంగా మూడు పిటిషన్లు వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ కోసం నెడుంపర పట్టుబట్టగా..పిటిషన్‌ను ఇప్పుడే కొట్టేయమంటారా?అని ప్రశ్నించింది. ‘కొట్టి వేయడం అసాధ్యం. ఎఫ్‌ఐఆర్ నమోద వ్వాల్సిందే. వర్మ కూడా అదొక్కటే కోరుతార నిపిస్తోంది. ఎఫ్‌ఐఆర్, దర్యాప్తు జరగాలి’అని సీజేఐ గవాయ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదికను పక్కనబెట్టాలంటూ జస్టిస్ వర్మ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తెల్సిందే.