ఇప్పడు మన భారత సైన్యం లోకి వేట పక్షులు రాబోతున్నాయి. వాటి వేగం తో ఎవర్నైనా ఆశ్ఛర్యపర్చగల .. వీటికి చాలా బాద్యతలను కూడా అప్పగిచింది మన సైన్యం ..శత్రు దేశాల డ్రోన్లని నేలకూల్చే బాద్యత వీరిదే.. రీసెంట్ గణతంత్ర దినోత్సవం లో కర్తవ్య పథ్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాయి. అందరినీ ముక్కున వేలేయించిన ఈ సైనిక పక్షుల సంగతేంటో చూద్దామా..
చొరబాట్లు మన దేశానికి కొత్తేమీ కాదు. మన సైనికులు కళ్లల్లో వత్తులు వేసుకొని మరీ సరిహద్దుల్ని కాపలాకాస్తున్నాసరే .. ఇవి ఆగట్లేదు . పైగా శత్రువుల డ్రోన్లూ వచ్చాయి. వాటిని అడ్డుకట్ట వేసేందుకు మన దేశం ఆథునిక పరికరాలను తయారుచేస్తూనే ఉంది .. అలాగే యుథ్థ వీరుల్ని సన్నథ్తం చేస్తుంది. అవే ఈగల్స్ . ఈ ఈగల్స ని , ఫాల్కన్లను, గరుడపక్షులను 6 ఏళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు. రీసెంట్ గా వీటిని ఉత్తరాఖండ్ లో జరిగిన యుథ్త విన్యాసాల్లో ఈ వెల్ ట్రైన్డ్డ్ ఈగల్స్ ని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. శత్రు డ్రోన్లు కనిపించగానే రివ్వున ఎగురుతూ వెళ్లి వాటిని కూల్చివేసిన ఆ పక్షుల తెగువా, వేగం చూపరుల్ని విస్మయానికి లోనుచేశాయి! వాటిల్లోనూ కరణ్, అర్జున్ అనే రెండు నల్లగద్దలు ఇప్పటికే వందలాది డ్రోన్లని కూల్చి సత్తా చాటాయి.
ఇక ఇలా పక్షుల్ని యుధ్దాలలో వాడటం కొత్తేమీ కాదు .రెండో ప్రపంచ యుధ్దంలో బ్రిటన్ , అమెరికా లాంటి దేశాలు పావురాల్ని వాడారు. అదే సమయంలో శత్రు దేశాల కు చెందిన పావురాలను వేటాడేందుకు జర్మనీ ఈగల్స్ ను ను ఉపయోగించింది. ఆ తర్వాత వీటిని ఎవరూ పట్టించుకోలేదు కానీ .. ఇప్పుడు కొత్తగా డ్రోన్లు వల్ల చాలా తలనొప్పిగా మారాక . కొన్ని దేశాలు మళ్లీ ఈ ఈగల్స్ ని తమ సైన్యం లోకి చేర్చుతున్నాయి. ఇంతకీ ఈ పక్షుల్నే ఎందుకు ఎంచుకోవాలీ అంటారా... ఇవి వేటాడే తీరు చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది కాబట్టి! ఏ పక్షినీ ఇవి నేరుగా వెళ్లి ఢీకొట్టవు...అందుకే, పక్కగా వెళుతూ ముందు వాటి రెక్కల్ని తమ బలమైన గోళ్లతో తెగ్గొట్టి కిందపడేస్తాయి. పైగా వీటిది అచ్చమైన 'డేగకన్ను'... 'ఏ అత్యాధునిక కెమెరాకీ తీసిపోనంత నిశితంగా చూడగలవు. ఈ లక్షణాలన్నీ డ్రోన్లని కూలగొట్టడానికి చక్కగా ఉపయోగపడతాయి.
వీటికి ఏ ప్రమాదమూ జరగకుండా కాళ్లకి లెదర్ కవచాలూ తొడుగుతున్నారు. రెండు కేజీలకన్నా తక్కువ బరువున్న డ్రోన్ల కూల్చివేతకే వీటిని పంపిస్తున్నారు. వందలాది డ్రోన్లని కూల్చివేసిన ఈ పక్షులకి ఇప్పటిదాకా ఏ ప్రమాదమూ జరగకపోవడం విశేషం. అందుకే ప్రతి పక్షిపైనా శిక్షణ, ఇతర అవసరాల కోసం ఏటా రూ.5 లక్షలదాకా ఖర్చుచేస్తున్నారు. అంత ఖర్చా... అనుకోకండి! కోట్ల రూపాయల యాంటీ-డ్రోన్ వ్యవస్థలతో పోలిస్తే ఇది చాలా తక్కువే!



