సాక్షి, హైదరాబాద్: నగరంలోని పబ్‌లలో ఈగల్ టీమ్ సోదాలు నిర్వహించింది. నాలుగు పబ్‌లలో ఐదుగురు డీజేలను ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. డ్రగ్స్ తీసుకొని డీజే ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించింది. బఫెలో వైల్డ్ వింగ్స్, షెర్లాక్, ఇల్యూషన్, వేవ్ పబ్‌లలో డీజేలను అరెస్ట్ చేశారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈగిల్ ఫోర్స్ ప్రత్యేక యాంటీ డ్రగ్ ఆపరేషన్ చేపట్టింది. ట్రై కమిషనరేట్ల పరిధిలో పబ్‌లు, రిసార్ట్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. 15 ఈగిల్ ఫోర్స్ టీమ్‌లు, ఎక్సైజ్, లోకల్ పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించింది. మొత్తం 51 మందికి డ్రగ్ టెస్టులు చేయగా.. 5 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఈగిల్ టీమ్ గుర్తించింది.
వాహనాల తనిఖీల్లో మరో వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. టీహెచ్‌సీ డ్రగ్ వినియోగం నిర్థారణ అయ్యింది. నిందితులను కౌన్సెలింగ్, డీఅడిక్షన్ సెంటర్లకు పంపిస్తున్నారు. 500కు పైగా పబ్‌లు, రిసార్ట్స్, ఈవెంట్ ఆర్గనైజర్లకు ఈగిల్ ఫోర్స్ మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రగ్ ఫ్రీ న్యూ ఇయర్ లక్ష్యంగా ఈగిల్ ఫోర్స్ చర్యలు చేపట్టింది. డ్రగ్ ఫ్రీ తెలంగాణ దిశగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.


