న్యూఢిల్లీ: గడిచిన గత పదేళ్ల కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ న్యాయవాదులపై సుమారు 8,360 చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. 2024లో అత్యధికంగా 1,170 ఫిర్యాదులు, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయి
అవినీతి, లైం**పరమైన, ఇతర తీవ్రమైన అంశాల్లో సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులు,హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులు ఏమైనా వచ్చాయా? గత పదేళ్ల కాలంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి.సంబంధిత ఫిర్యాదుల విషయంలో ఎలాంటి మెకానిజం పనిచేస్తుంది?’ అంటూ లోక్‌సభలో ద్రవిడ మున్నేట్ర కజగం ఎంపీ మాథేశ్వరన్ వీఎస్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కోరారు. అందుకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వివరణ ఇచ్చారు.
గడిచిన పదేళ్ల కాలంలో సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులపై 8,630 ఫిర్యాదులు అందాయని తెలిపారు.ఈ సందర్భంగా ఏ సంవత్సరంలో ఎన్ని ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల కాలంలో వచ్చిన ఫిర్యాదుల వివరాల్ని వెల్లడించారు.
అనంతరం, న్యాయమూర్తులపై ఫిర్యాదులను సేకరించడానికి కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పర్యవేక్షణ వ్యవస్థ (CPGRAMS) కాకుండా ప్రభుత్వానికి మరేదైనా యంత్రాంగం ఉందా? జవాబుదారీతనం నిర్ధారించడానికి అటువంటి ఫిర్యాదులను క్రమపద్ధతిలో నమోదు చేసి పర్యవేక్షించేలా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రతిపాదిస్తుందా? అని కూడా అడిగారు.
ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదును కోర్టు 'ఇన్-హౌస్ ప్రొసీజర్' ద్వారా స్వీకరిస్తారని మేఘ్వాల్ అన్నారు. అదేవిధంగా, సంబంధిత హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వీకరిస్తారని తెలిపారు. అయితే, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారా? లేదా? వంటి వివరాల్ని వెల్లడించలేదు.



