‘వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల భవిష్యత్తును గందరగోళంలో పడేశారు’ | YSRCP MP Gurumurthy Speaks in Industrial Relations Code Bill Debate | Sakshi
Sakshi News home page

‘వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల భవిష్యత్తును గందరగోళంలో పడేశారు’

Feb 12 2026 4:00 PM | Updated on Feb 12 2026 4:09 PM

YSRCP MP Gurumurthy Speaks in Industrial Relations Code Bill Debate

ఢిల్లీ:  వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల భవిష్యత్తును గందరగోళంలో పడేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ కార్మికులు.. ఉద్యోగాలు, ఉపాధి కోసం పోరాటం చేస్తున్నారన్నారు. లోక్‌సభలో ఇండస్ట్రియల్‌ రిలేషన్‌ కోడ్‌ బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో పని చేస్తున్న కార్మికుల గురించి ప్రస్తావించారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగాలు, ఉపాధి కోసం పోరాటం చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అకస్మాత్తుగా 5000 మంది కార్మికులను తొలగించారు. పెద్ద ఎత్తున నిరసనలు చేస్తే వెయ్యి మందిని మళ్లీ నియమించుకున్నారు. అక్కడ కార్మికుల భవిష్యత్తు గందరగోళంలో పడేశారు. చట్టాలపై కార్మికులకు తగిన అవగాహన కల్పించాలి. కార్మికుల భవిష్యత్తును గందరగోళ పరిచేలా విధానాలు  ఉండకూడదు. వివాదాల పరిష్కారానికి తగిన చట్టాలు అవసరం’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement