మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలడంతో భారీగా పూరి గుడిసెలు దగ్ధమైన ఘటన మామిడికుదురులో సంభవించింది. ఒక ఇంట్లో సిలిండర్ పేలడంతొ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు చెలరేగి పక్కనున్న పూరిగుడిసెలు సైతం దగ్ధమయ్యాయి. సుమారు 10 పూరిగుడిసెలు వరకూ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది.


