
బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా వైరస్ సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, అందరూ మాస్క్‌లు ధరించి, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు శిల్పా శిరోద్కర్. కోవిడ్‌పాజిటివ్ నేపథ్యంలో ప్రస్తుతం శిల్పా ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. ఇక బాలీవుడ్‌లో ‘త్రినేత్ర’, ‘హమ్’ (1991), ‘గోపీ కిషన్’ (1994) వంటి సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించారు శిల్పా.
అలాగే 1992లో తెలుగులో ‘బ్రహ్మ’ చిత్రంలో కూడా నటించారామె. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి, బ్రేక్ తీసుకున్న శిల్పా ఇటీవల బిగ్‌బాస్ 18 సీజన్‌లో కంటెస్టెంట్‌గాపాల్గొన్నారు. ఇదిలా ఉంటే... ఆసియా దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో శిల్పా అక్కడికి ట్రావెల్ చేసి, ముంబై వచ్చారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక మహేశ్‌బాబు సతీమణి నమత్ర సోదరి శిల్పా శిరోద్కర్ అనే సంగతి తెలిసిందే.