మేలో దేశాన్ని వణికించిన కరోనా

India Covid-19 Cases And Deaths In May Highest In World For Any Month - Sakshi

నెలలో 90.10 లక్షల కేసులు 

1.20 లక్షల మంది కోవిడ్‌తో మృతి

సాక్షి, న్యూఢిల్లీ: సెకండ్‌ వేవ్‌లో ఏప్రిల్‌నాటి కోవిడ్‌ సంక్షోభ రికార్డులను తిరగరాస్తూ కరోనా మే నెలలో ప్రపంచ రికార్డులను నమోదు చేసింది. నెల ప్రారంభంలో విజృంభించిన కరోనా నెలాఖరుకల్లా తగ్గుముఖం పట్టింది. కేవలం మే నెలలో దేశంలో 90,10,075 పాజిటివ్‌ కేసులు, 1,20,042 కోవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య, కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య తగ్గనప్పటికీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువకు దిగిరావడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. మార్చి 1వ తేదీన దేశంలో 12,286 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి కరోనా విస్తృతి విపరీతంగా పెరిగి ఏప్రిల్‌ 6వ తేదీన 1.15 లక్షల కొత్త కేసులొచ్చాయి. తర్వాత కరోనా సంక్రమణ వేగం ఒక్కసారిగా ఊపందుకోవడంతో మేలో రోజువారీ కొత్త కేసులు 4 లక్షల మార్క్‌ను దాటేశాయి. మార్చి 1తో పోలిస్తే 67 రోజుల తర్వాత మే 6 న ఈ సంఖ్య 34 రెట్లు పెరిగి 4.14 లక్షలు దాటింది.  

గత 24 రోజుల్లో 63% తగ్గిన పాజిటివ్‌ కేసులు
మే 6 తర్వాత దేశంలో రోజువారీ కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గత 24 రోజుల్లో రోజు వారీ పాజిటివ్‌ కేసులు 63% తగ్గి నెలాఖరున 1,27,510 కేసులు నమోదయ్యాయి. 

26 రెట్లు పెరిగిన కరోనా మరణాలు
దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మరణాల సంఖ్య భయపెడుతోంది. మార్చి 1న దేశంలో 92 మరణాలు సంభవించగా, మే 18వ తేదీన దేశంలో అత్యధికంగా 4,529 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా దేశంలో సగటున రోజువారీ మరణాల సంఖ్య 3523గా నమోదవుతోంది. మార్చి నెలలో 5,766, ఏప్రిల్‌ నెలలో 48,926, మే నెలలో 1,20,042 కరోనా మరణాలు సంభవించాయి. 

గత 54 రోజుల్లోనే అతి తక్కువ కేసులు..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 1,27,510 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువ కేసులు రావడం గత 54 రోజుల్లో ఇదే తొలిసారి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,81,75,044కు పెరిగింది. గత 24 గంటల్లో 2,795 మంది కోవిడ్‌తో మరణించారు. మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 3,31,895కు పెరిగింది. ఇంత తక్కువ మరణాలు నమోదవడం గత 35 రోజుల్లో ఇదే తొలిసారి. దేశంలో గత 24 గంటల్లో 2,55,287 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,59,47,629కు పెరిగింది. రికవరీ రేటు 92.09 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,95,520కు చేరుకుంది. 43 రోజుల తర్వాత దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 20 లక్షల దిగువన నమోదైంది. కరోనా పాజిటివిటీ రేటు 6.62%గా నమోదైంది. మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

04-06-2021
Jun 04, 2021, 17:56 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్...
04-06-2021
Jun 04, 2021, 17:18 IST
బీజింగ్‌: కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చైనా నుంచే ఈ వైరస్‌...
04-06-2021
Jun 04, 2021, 16:54 IST
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 85,311 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1‌‌0,413 కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
04-06-2021
Jun 04, 2021, 12:03 IST
వ్యాక్సిన్‌ వేయుంచుకున్న వారికి లక్కీ డ్రా రూపంలో విలువైన వస్తువులను అందిస్తోంది.
04-06-2021
Jun 04, 2021, 08:13 IST
సాక్షి, బెంగళూరు: కరోనా రక్కసి మారణహోమం కొనసాగిస్తోంది. కేసులు తగ్గినప్పటికీ మృత్యు బీభత్సం అదుపులోకి రావడం లేదు. గత 24...
04-06-2021
Jun 04, 2021, 05:41 IST
తంగళ్లపల్లి (సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన ముత్తంగి శ్రీనివాస్‌రెడ్డి (45)ది వ్యవసాయ కుటుంబం....
04-06-2021
Jun 04, 2021, 04:55 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారి వల్ల ప్రభావితులైన చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర...
04-06-2021
Jun 04, 2021, 02:27 IST
సాక్షి, హైదరాబాద్‌: అధిక ఫీజుల వసూలు ఆరోపణలకు సంబంధించి ఆస్పత్రులు, రోగులతో చర్చించి బాధితులకు రిఫండ్‌ చేసే విషయంలో చర్యలు...
04-06-2021
Jun 04, 2021, 01:38 IST
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన దేశీ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ గతేడాది(2020–21)లో వేతనాన్ని వొదులుకున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) పేర్కొంది....
03-06-2021
Jun 03, 2021, 19:52 IST
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం చేపట్టారు....
03-06-2021
Jun 03, 2021, 19:33 IST
సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు ఇంకా చల్లారకముందే థర్డ్‌ వేవ్‌ ఆందోళన దేశ ప్రజలను వణికిస్తోంది. ముఖ్యంగా  థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై...
03-06-2021
Jun 03, 2021, 19:23 IST
బెంగళూరు: దేశంలో కరోనా ​ఉధృతి కొనసాగుతూనే ఉంది. మొదటి దశలో కంటె సెకండ్​వేవ్​లో వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. అనేక రాష్ట్రాలు...
03-06-2021
Jun 03, 2021, 19:03 IST
సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,261 కరోనా కేసులు నమోదు కాగా.. 18 మరణాలు చోటుచేసుకున్నాయి. తాజా...
03-06-2021
Jun 03, 2021, 18:19 IST
సాక్షి, ముంబై: కరోనా సెకండ్‌ వేవ్‌తో అల్లాడిపోతున్న దేశాన్ని ఆదుకునేందుకు ఆసియా బిలియనీర్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్‌ అంబానీ ముందుకు...
03-06-2021
Jun 03, 2021, 17:46 IST
ఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ వ్యాక్సిన్ల విషయంలో రాజస్తాన్‌, పంజాబ్‌ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును గురువారం ట్విటర్‌లో...
03-06-2021
Jun 03, 2021, 16:48 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 86,223 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,421 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,25,682...
03-06-2021
Jun 03, 2021, 16:44 IST
ముంబై(బుల్దానా): కరోనా పేషంట్లకు ఉపయోగిస్తున్న మరుగుదొడ్లను 8 ఏ‍ళ్ల చిన్నారితో కడిగించిన అవమానీయ ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి...
03-06-2021
Jun 03, 2021, 14:55 IST
లక్నో: కోవిడ్‌ వ్యాక్సిన్‌ బృందాన్ని చూసిన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ టీకాకు భమపడి డ్రమ్‌ వెనుక దాక్కుంది....
03-06-2021
Jun 03, 2021, 12:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్​ చివరి నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యంలో భాగంగా విదేశీ వ్యాక్సిన్లపై కేంద్రం తీసుకున్న...
03-06-2021
Jun 03, 2021, 11:03 IST
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలందరికీ కరోనా టీకా లక్ష్యంలో భాగాంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top