ఆటో విడిభాగాల రంగానికి ప్రభుత్వం అండ  | Govt committed for stable policy environment to enable auto sector growth | Sakshi
Sakshi News home page

ఆటో విడిభాగాల రంగానికి ప్రభుత్వం అండ 

Feb 12 2026 6:35 AM | Updated on Feb 12 2026 8:06 AM

Govt committed for stable policy environment to enable auto sector growth

విధానపరమైన స్థిరత్వం ఉంటుంది 

కేంద్ర మంత్రి కుమారస్వామి

న్యూఢిల్లీ: దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో కీలక పాత్ర పోషించేందుకు వీలుగా స్థిరమైన విధానాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. ఆటో విడిభాగాల తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించే క్రమంలో తదుపరి తరం సరఫరా వ్యవస్థలో ఆటో విడిభాగాల పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 

‘‘ఎల్రక్టానిక్స్, పవర్‌ ఎల్రక్టానిక్స్, తేలిక రకం మెటీరియల్స్‌ అన్నవి అంతర్జాతీయ పోటీతత్వానికి కీలకం. స్థిరమైన విధానపర వాతావరణం ఉండేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. టెక్నాలజీ స్వీకరణను ప్రోత్సహించడం, ఎగుమతుల విస్తరణ, నాణ్యత పెంపు దిశగా పరిశ్రమ భాగస్వాములతో కలసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’అని మంత్రి తెలిపారు. భారత ఆటో విడిభాగాల పరిశ్రమ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్ల తయారీ నుంచి కారిడార్ల ఏర్పాటు వరకు ప్రభుత్వం ఆటో పరిశ్రమకు ఎన్నో రకాలుగా చేయూతనిస్తున్నట్టు పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement