హైదరాబాద్: భార్య మోపిన తప్పుడు గృహహింస కేసు కారణంగా ఇబ్బందుల్లో పడిన ఒక వ్యక్తి న్యాయం చేయాలంటూ సీఎంను వేడుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన పంకజ్‌తో పాటు అతని కుటుంబం తప్పుడు గృహ హింస, వరకట్న కేసులపై కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తోంది. ఈ కేసుల కారణంగా మానసిక వేదన అనుభవిస్తున్నట్లు పంకజ్ ఒక వీడియోలో తెలిపారు.
Pankaj and his family from Hyderabad are fighting false domestic violence and dowry cases and have been facing extreme harassment for the past few years.
In fact, Pankaj's wife walked out of the house taking their daughter along and is mentally torturing Pankaj.
To seek help &… pic.twitter.com/1hI1Qktbgg— ForMenIndia (@ForMenIndia_) November 2, 2025
ఆ వీడియోలో పంకజ్ తన భార్య.. తమ కుమార్తెను తీసుకొని ఇంటి నుండి బయటకు వెళ్లిపోయి, తనను మానసికంగా హింసిస్తోందని ఆరోపించారు. అయితే సహాయం కోసం అటు పోలీసులను, ఇటు వివిధ సంస్థలను, మంత్రులను వేడుకున్నా ప్రయోజనం లేకపోయిందని పంకజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వింగ్స్ మహిళా భద్రతా డీసీపీలు తాము అందించిన ఫిర్యాదు లేఖను స్వీకరించారని, అయితే ఇప్పటివరకూ ఎటువంటి స్పందన రాలేదన్నారు. అధికారులు తన సమస్యకు పరిష్కారం చూపాలని పంకజ్ ఆ వీడియోలో వేడుకుంటున్నారు.


