న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 30 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు
న్యాయవాది గుడిమళ్ల సుభాషిణి. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని పేర్కొంది. ఈ నెల 20వ తేదీన బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా, జనవరి 30వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీన కౌంటింగ్ జరుగనుంది.


