సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టులో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ రోజు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బెదిరింపు మెయిల్‌ను పంపారు. నేడు రెండు గంటల సమయంలో కోర్టును పేల్చివేస్తామంటూ దుండగులు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు.
దాంతో కోర్టులో ఉన్న వారిని పోలీసులు బయటకు పంపిస్తున్నారు. కోర్టు హాల్స్ మొత్తం కాళీ చేపిస్తున్నారు. బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు. వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీం రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. కోర్టు ఆవరణలో అణువణువూ గాలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించినట్లు అధికారిక సమాచారం లేదు. కాగా నేడు జరగాల్సిన అన్ని కోర్టు కార్యకలాపాలను ప్రస్తుతానికి పోలీసులు నిలిపివేసినట్టు సమాచారం.


