సిద్దిపేట జిల్లా: గత ఎన్నికల్లో మండలంలోని చల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో అతని భార్య రోజా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో చల్లాపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. అప్పట్లో రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి చెందారు. ప్రస్తుతం ఈ జీపీని బీసీ మహిళకు కేటాయించారు. దీంతో రమేష్ తన భార్య రోజాను కాంగ్రెస్ మద్దతుతో బరిలో దింపారు. ఆమె సమీప ప్రత్యర్థిపై 558 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రామస్తులు రమేష్ దంపతులను ఘనంగా సన్మానించారు.
గోపాల్ ‘తీన్’మార్!
దోమ: మండలంలోని పెద్దతండాచిన్నతండా పంచాయతీలో బుధ వారం నిర్వహించిన సర్పంచ్ ఓట్ల కౌంటింగ్ నువ్వా..నేనా.. అన్నట్లగా సాగింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన నేనావత్ లక్ష్మణ్, బీఆర్‌ఎస్ మద్దతుతో ఆంగోత్ గోపాల్ బరిలో ఉన్నారు. వీరి మధ్య సాగిన ఉత్కంఠ పోరులో ప్రత్యర్థి లక్ష్మణ్‌పై మూడు ఓట్ల స్వల్ప తేడాతో గోపాల్ విజయం సాధించారు.


