ప్రజలందరూ బీఆర్‌ఎస్ వైపే
షాబాద్: పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన మండల సర్పంచ్‌లను జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి అభినందించారు. బుధవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు అవినాశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని, ఎన్నికలు ఏమైనా బీఆర్‌ఎస్ పార్టీ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నూతన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అంతారం, లక్ష్మరావుగూడ తదితర గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు అవినాశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.ఈ మేరకు ఆయన వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి


