పోలింగ్ కేంద్రంలో ఇరువర్గాల దాడి
పరిగి: పోలింగ్ కేంద్రంలో జరిగిన ఇరు వర్గాల దాడిలో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన మాధారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మూడో విడత ఎన్నికలో భాగంగా పోలింగ్ కేంద్రంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. ఓ సర్పంచ్ అభ్యర్థిపై ఓ వర్గం వారు దాడి చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ దాడిలో గాయపడిన ఓ వర్గానికి చెందిన రాములును పరిగి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మరో వర్గంపై దాడి చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయించారు.
ఎంపీ నిధులతో అభివృద్ధి
అనంతగిరి: బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచిన గ్రామాల్లో ఎంపీ నిధుల కింద రూ.10 లక్షలు మంజూరు చేసుకుని, అభివృద్ధి చేస్తామని బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు అన్నారు. వికారాబాద్ మండలం మైలార్ దేవరాంపల్లి గ్రామంలో ఉపసర్పంచ్‌గా గెలుపొందిన బసంత బస్వలింగంను బుధవారం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధిలో కేంద్రం ఇచ్చిన నిధులే ఉన్నాయన్నారు. పీఎం నరేంద్రమోదీ గ్రామాలభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న భావనతో అన్ని విధాలా నిధులు కేటాయించనున్నారని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో గ్రామాలను తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బస్వలింగం పాల్గొన్నారు.
పోలింగ్ ప్రశాంతం: కలెక్టర్
అనంతగిరి: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం పరిగి నియోజకవర్గంలోని 5 మండలాల్లో 83.56 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించారని తెలిపారు.
చేవెళ్ల: సర్పంచ్‌లందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని రేగడిఘనాపూర్ గ్రామ సర్పంచ్‌గా గెలిచిన తిప్పని మాధవిరాంరెడ్డి, ఉపసర్పంచ్ మహేశ్వరీరాములు, ఎన్కేపల్లి సర్పంచ్ బి.మహిపాల్‌రెడ్డి, ముడిమ్యాల సర్పంచ్ గౌడిచర్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన సర్పంచ్లు, వార్డుసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడే పోటీ ఉండాలని, గ్రామాల అభివృద్ధికి అంతా కలిసిమెలసి పనిచేసుకోవాలని సూచించారు. అభివృద్ధికి తనవంతు కృషిని అందిస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు పి.ప్రభాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
గ్రామాల అభివృద్ధికి సహకారం
శంకర్‌పల్లి: మండలంలోని సంకేపల్లి గ్రామ సర్పంచ్ దేశ్‌పాండే శ్రీనివాస్ బుధవారం వార్డు సభ్యులు, మద్దతుదారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
పోలింగ్ కేంద్రంలో ఇరువర్గాల దాడి


