పరిగిలో ‘కారు’ జోరు
19 స్థానాల్లో బీఆర్‌ఎస్,
12 చోట్ల కాంగ్రెస్, ఒకచోట బీజేపీ
పరిగి: మండలంలో బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ హవా కొనసాగింది. ఈ జీపీలో మొత్తం 32 గ్రామ పంచాయతీలు ఉండగా రెండు ఏకగ్రీవం అయ్యాయి. 30 పంచాయతీలకు పోలింగ్ జరగ్గా 19 స్థానాలను బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. 12 స్థానాలను కాంగ్రెస్, ఒకచోట బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్‌ఎస్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందడంపై ఆ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆ బిల్లును
ఉపసంహరించుకోవాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప
యాలాల: ఉపాధి హా మీ పథకంలో మా ర్పులకు గాను తెస్తున్న 20 25 కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించు కోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప డిమాండ్ చేశారు. 2005 తెచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2025 పేరతో 197 బిల్లును కేంద్ర ప్రభు త్వం తీసుకువస్తోందని, ఈ బిల్లు చట్టమైతే తలలేని మొండెంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బిల్లులో ఉపాధి అవకాశాలు, మెరుగుపరిచే చర్యల గురించి ప్రస్తావన లేదన్నారు.కొత్త బిల్లులో పని దినాలు 125 రోజులకు పెంచుతున్నట్లు చెప్పి, 60 రోజులు పని నిషేధం విధించారన్నారు. ఇప్పటి వరకు 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్రం వాటా ఉండేదని, ప్రస్తుత బిల్లు చట్టమైతే రాష్ట్రాల వాటా 40 శాతం ఉండాలనే నిబంధన పథకాన్ని నిర్వీర్యం చేసే పనికి నిదర్శనమన్నారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సలామ్.. సీమాసుల్తానా
బషీరాబాద్: బాధ్యతలు తీసుకోకముందే బాధ్యతెరిగిన ఓ నూతన సర్పంచ్ యాక్షన్‌లోకి దిగారు. గ్రామ సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. సొంత డబ్బు ఖర్చు చేసి తాగునీటి సమస్యకు చెక్ పెట్టి అందరి మన్ననలు పొందుతున్నారు. బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామ సర్పంచ్‌గా వరుసగా రెండో సారి ఎన్నికై న సీమాసుల్తానా గ్రామ సమస్యలపై ఫోకస్ పెట్టారు. పలు కాలనీల్లో పాడైన బోరుబావులకు, మోటార్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. కొత్త మోటార్లు బిగిస్తున్నారు. మొదటి వార్డు ఉప్పరివాడ, రెండో వార్డు బీసీ కాలనీలో పాడైన రెండు చేతి పంపులను తొలగించి వాటి స్థానంలో కొత్త బోరు మోటార్లు బిగించారు. 4వ వార్డు మద్దూర్ వాడ, 7వ వార్డు టవర్ గల్లీ, 8వ వార్డు జోగు కాలనీల్లో కాలిపోయిన మూడు బోరు మోటార్లకు బుధవారం మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను రెండోసారి సర్పంచ్‌గా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుర్వ తమ్మణ్ణ, మాజీ వైస్ ఎంపీపీ అబ్దుల్ ఖాలీద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సాయిచరణ్
ఆమనగల్లు: జాతీయ స్థాయి అండర్–17 విభాగం కబడ్డీ పోటీలకు మండల పరిధిలో ని దయ్యాలబోడు తండాకు చెందిన ఎన్.సాయిచరణ్ ఎంపిక్యాడు. ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాయి చరణ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపాడు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లో నిర్వహించనున్న జాతీయ పోటీలకు ఆయన్ను ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావు, అధ్యాపకబృందం విద్యార్థిని అభినందించారు.
పరిగిలో ‘కారు’ జోరు
పరిగిలో ‘కారు’ జోరు
పరిగిలో ‘కారు’ జోరు


