ప్రణాళికతో సాగండి
దుద్యాల్: మండలంలోని హకీంపేట్ శివారులో చేపట్టిన పారిశ్రామిక వాడ, ఎడ్యుకేషన్ హబ్ పనుల్లో వేగం పెంచాలని, ప్రణాళికతో ముందుకు సాగాల ని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి పారిశ్రామిక వాడ, ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించారు. ఏఏ విద్యాసంస్థలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారని ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. పారిశ్రామిక వాడ ఏర్పాటుతో అనేక కంపెనీలు వస్తాయని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యత ఉండాలని సూచించారు. ముందుగా రోడ్డు పనులను పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ కవిత, డీఈ శేషగిరి, ఎడ్యుకేషన్ హబ్ చీఫ్ ఇంజనీర్ షఫీ, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్, డీఈఈ రాజయ్య, ఏఈలు విజయ భాస్కర్ రెడ్డి, జనార్దన మూర్తి, తహసీల్దార్ కిషన్, ఆర్‌ఐ నవీన్ కుమార్, సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీశైలం, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


