breaking news
Vikarabad District Latest News
-
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
● మీర్‌పేట పీఎస్ పరిధిలో ఘటన ● మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మీర్‌పేట: భర్తతో గొడవపడిన భార్య ఇద్దరు కుమార్తెలతో ఇంటి నుంచి బయటకు వెళ్లి, కనిపించకుండాపోయిన ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణరెడ్డి కథనం ప్రకారం. బిహార్ రాష్ట్రానికి చెందిన మహబూబ్‌పాషా, ప్రీతికుమారి(23) భార్యాభర్తలు. బతుదుదెరువు కోసం నగరానికి వచ్చి మూడేళ్లుగా బడంగ్‌పేట న్యూబృందావన్ నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఇద్దరు కుమార్తెలు నబా (3), సూఫీ (2)లు ఉన్నారు. నవంబరు 26న భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ప్రీతి తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. స్థానికంగా ఉండే బంధువులకు, బిహార్‌లోని స్వగ్రామానికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో మహబూబ్‌పాషా సోమవారం మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
బుజ్జగించి.. తప్పించి
పంచాయతీ ఎన్నికల్లో మొదటి ఘట్టమైన తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడత ప్రారంభమైంది. ఇక మిగిలింది తిరస్కరణ. బుజ్జగింపుల పర్వంతో పోరు రసవత్తరంగా..తీరు ఆకస్తికరంగా మారింది. కొడంగల్/బషీరాబాద్: పల్లెపోరుకు రసవత్తర పోటీ నెలకొంది. పథమ పౌరుడి కుర్చీ కోసం అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. బషీరాబాద్ మండలంలోని 39 పంచాయతీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బలపర్చిన వారితో పాటు, ఆశావహులు 208 మంది సర్పంచులకు, 312 వార్డులకు 616 నామినేషన్లు వేశారు. అయితే స్క్రూట్నిలో సరైన పత్రాలు లేని సర్పంచుకు 13, వార్డుల 10 పత్రాలను క్లస్టర్ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించగా.. 195 సర్పంచ్, 606 వార్డు నామినేషన్లు మిగిలాయి. కాగా.. సోమవారం 10 మంది అభ్యర్థులు సబ్ కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోగా.. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురయింది. కాగా మంతన్గౌడ్లోని 6వ వార్డులో అభ్యర్థి వయసు 21 ఏళ్లలోపు ఉండటంతో నామినేషన్‌ను తిరస్కరించారు. కొర్విచెడ్ 4వ వార్డులో ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. ఈ రెండు వార్డులకు మరోసారి నోటిపికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. చెక్‘పవర్’ కోసం.. రిజర్వేషన్లు అనుకూలంగా రాని ఆశావహులు.. వార్డు సభ్యులుగా బరిలోకి దిగుతున్నారు. ఉపసర్పంచ్‌కి హామీ ఇస్తేనే తమ మద్దతు ఉంటుందని ముందస్తుగా ఒప్పందం చేసుకుంటున్నారు. బషీరాబాద్ మండలంలో ఏకగ్రీవం అయిన మూడు జీపీల్లో.. ఉప సర్పంచులను సైతం ముందే తేల్చేశారు. ఉప సర్పంచ్‌కు ఉండే చెక్‘పవర్’తో చక్రం తిప్పొచ్చని లీడర్లు పోటీ పడుతున్నారు. ఏకగ్రీవం.. బేరసారాలు నామినేషన్ల స్క్రూట్ని సోమవారం ముగియడంతో పోటీగా నిలిచిన అభ్యర్థులతో నాయకులు రాయబారాలు, బేరసారాలు నడుపుతున్నారు. ముఖ్యంగా చిన్న గ్రామాల్లో ఏకగ్రీవం కోసం. అధికార పార్టీలో మండల స్థాయి నాయకులు.. పత్రాల ఉపసంహరణ కోసం వారికి నామినేటెడ్ డైరెక్టర్ల పదవులు ఆశచూపుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులు తెరవెనుక కొనుగోళ్లు ముమ్మరం చేస్తున్నారు. రేపు నామినేషన్ల ఉపసంహరణఉండడంతో.. పోటీదారులను మచ్చిక చేసుకొని బరినుంచి తప్పించడానికి బలమైన అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలోని పలు పంచాయతీలు ఏకగ్రీవం బాటలో చర్చలు సాగుతున్నాయి. మాట వింటేసరి.. సర్పంచు అభ్యర్థులకు తల నొప్పి మొదలైంది. బరిలోనుంచి తప్పుకోవాలని, గ్రామాన్ని ఏకగ్రీవం చేయాలన్న బుజ్జగింపులు ఊరూరా కొనసాగుతున్నాయి. మాట వినని వారికి బెదిరింపులు తప్పడం లేదు. ఆర్థికంగా.. అంగబలం ఉన్నవారు.. సర్పంచు పోటీదారులపై ఒత్తిడి తెస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని, తాము చెప్పిన వారికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మాట వినకపోతే హుకుం జారీ చేస్తున్నారు. దీంతో పోటీదారులు సతమతం అవుతున్నారు. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఈ అంశంలో అధికార కాంగ్రెస్‌తో పాటు.. బీఆర్ఎస్ నాయకులు పోటీపడుతున్నారు. కాగా.. కొడంగల్ మండలంలో సర్పంచు స్థానాలకు 123, వార్డు మెంబర్ స్థానాలకు 448 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఆశావహులతో పాటు.. పలు రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు ఉన్నారు. ఇందులో రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు బరిలోనుంచి ఎంత మంది తప్పుకుంటారో.. మిగిలేది ఎందరో తేలనుంది. రసవత్తరంగా పల్లెపోరు చెక్‘పవర్’ కోసం బరిలోకి బడానేతలు ఏకగ్రీవం కోసం బేరసారాలు సర్పంచులకు 195,వార్డులకు 606 నామినేషన్లు 23 పత్రాల తిరస్కరణ,పది అప్పీళ్లు కొట్టివేత -
షార్ట్ సర్క్యూట్‌తో పత్తి దగ్ధం
కొందుర్గు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పత్తి దగ్ధమైన ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి ఇదే ఊరికి చెందిన బుగ్గేశ్వర్, నారాయణలకు సంబంధించిన 12 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. సుమారు70 క్వింటాళ్ల పత్తిని తీయించి, పొలం సమీపంలో ఉన్న అజ్జు ఫామ్‌హౌస్‌లో నిల్వచేశాడు. సోమవారం ఉదయం ఫామ్‌హౌస్ నుంచి దట్టమైన పొగలు రావడంతో వెళ్లి చూడగా పత్తికి మంటలు అంటుకున్నాయి. చుట్టు పక్కల వారి సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ సంఘటనలో దాదాపు 20 క్వింటాళ్ల పత్తి కాలిబూడిదైంది. దీంతో తనకు రూ.1.60 లక్షల నష్టం వచ్చిందని బాధితుడు వాపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. -
పెళ్లికి ఒప్పుకోవడం లేదని..
● ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు ● మృతులిద్దరూ బిహార్ రాష్ట్రానికి చెందిన వారే కొత్తూరు: తమ ప్రేమను అంగీకరించని పెద్దలు, పెళ్లికి సైతం నిరాకరిస్తారనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన నవనీత్‌దత్త తన ఇద్దరు కూతుళ్లు అనామిక(21), అనీషదత్తతో కలిసి నాలుగేళ్ల క్రితం కొత్తూరుకు వలస వచ్చాడు. నవనీత్‌దత్త ఐఓసీఎల్ ప్లాంట్‌లో డ్రైవర్‌గా, ఇద్దరు కూతుళ్లు పట్టణ సమీపంలోని ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కాగా, అనామికకు ఇదే పరిశ్రమలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన ధనుంజయ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడు రోజులుగా అనామిక పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో నవనీత్ సోమవారం మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి చేరుకోగా, లోపలి నుంచి తలుపులు పెట్టి ఉండడంతో కిటికీలో నుంచి వెళ్లి చూడగా, అనామిక కింద పడి మృతిచెంది ఉండగా, ధనుంజయ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనామిక పనికి వెళ్లకపోవడంతో ధనుంజయ్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. అప్పటికే అనామిక ఫ్యాన్‌కు ఉరేసుకోవడంతో, ఆమెను కిందికి దింపి, అదే ఫ్యాన్‌కు తాను ఉరేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతురాలి ఇంట్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. -
గొడవలు చేస్తే కేసులు పెడతాం
సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి ● 71 మంది పాత నేరస్తుల బైండోవర్ తాండూరు రూరల్: స్థానిక ఎన్నికల సమయంలో గొడవలు చేస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం కరన్‌కోట్ ఠాణా సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎక్కడైనా గొడవలు జరిగితే 100కు కాల్ చేయాలని చెప్పారు. రూరల్ పోలీస్ సర్కిల్లో నాలుగు మండలాలు పెద్దేముల్, యాలాల, తాండూరు, బషీరాబాద్ ఠాణాలు కలిపి 71 మంది పాత నేరస్తులు, హత్య కేసుల్లో నిందితులను తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేశామని తెలిపారు. 26 సమస్యాత్మకమైన గ్రామాలు తాండూరు మండలంలో సంగెంకలాన్, కరన్‌కోట్, మల్కాపూర్, చెంగోల్, సిరిగిరిపేట్, అల్లాపూర్, జినుగుర్తి గ్రామాలు. యాలాలలో అగ్గనూర్, జుంటుపల్లి, దెవనూర్, రాస్నం, కోకట్ గ్రామాలు. పెద్దేముల్లో మంబాపూర్, హన్మపూర్, ఇందూర్, జనగాం, తట్టెపల్లి, పెద్దేముల్, నాగులపల్లి. బషీరాబాద్‌లో దామర్‌చెడ్, నవల్గా, ఎక్మాయి, మైల్వార్, పర్వత్‌పల్లి సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తించామని సీఐ పేర్కొన్నారు. కఠిన చర్యలు యాలాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ విఠల్‌రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని చెప్పారు. అనవసర పోస్టులు చేస్తే.. గ్రూపు అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి అదృశ్యం
పహాడీషరీఫ్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి ప్రాంతానికి చెందిన దుర్గా భవానికి, ఏడాదిన్నర క్రితం పినిశెట్టి రాజేశ్‌కుమార్(35)తో వివాహం జరిగింది. వీరు జల్పల్లిలోని శ్రీరాం కాలనీలో నివాసం ఉంటున్నారు. చిట్‌ఫండ్ వ్యాపారం చేసే రాజేశ్‌కుమార్‌కు డబ్బులు ఇచ్చే వారు సకాలంలో ఇవ్వకపోవడంతో, చిట్టీ ఎత్తిన వారికి సమయానికి నగదు ఇవ్వలేక ఒత్తిడికి గురవుతున్నాడు. ఇతని భార్య పురుడు పోసుకునేందుకు పుట్టింటికి వెళ్లగా, బావమరిది దూసనపూడి వెంకటేశ్ కొంతకాలంగా బావతో కలిసి ఉంటున్నాడు. ఇదిలా ఉండగా నవంబర్ 29న శ్రీశైలం వెళ్లి వస్తానని బావమరిదికి చెప్పి వెళ్లిన అతడు ఎంతకీ తిరిగి రాలేదు. ఒత్తిడి భరించలేకే ఎక్కడికో వెళ్లిపోయి ఉంటాడని భావించిన వెంకటేశ్ సోమవారం పహాడీషరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్లో లేదా, 87126 62367 నంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. సిమెంట్ ట్యాంకర్ బోల్తా శంకర్పల్లి: సిమెంటు లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్(లారీ) బోల్తా పడిన సంఘటన శంక్‌పల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు నుంచి సిమెంటు లోడుతో వస్తున్న ట్యాంకర్ శంకర్పల్లి మీదుగా బాచుపల్లి వెళ్తోంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఎల్వర్తి మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడటంతో, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం పోలీసులు క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్య కొందుర్గు: కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ముట్పూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పార్వతమ్మ(55)కు శోభారాణి, మంజుల ఇద్దరు కూతుళ్లు. పిల్లల చిన్నతనంలోనే పార్వతమ్మ భర్త కిష్టయ్య మృతిచెందాడు. దీంతో అన్నీ తానై కష్టపడి ఇద్దరినీ పెంపి, పోషించి వివాహాలు చేసింది. ఇదిలా ఉండగా చిన్న కూతురు మంజుల తన భర్తతో ఏర్పడిన విభేదాలతో ఇటీవలే విడాకులు తీసుకుంది. దీంతో పార్వతమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ఈనెల 28న చిన్న కూతురు మంజుల చెక్కలోనిగూడలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఒంటరిగా ఉన్న పార్వతమ్మ పెద్ద కూతురు శోభారాణికి ఫోన్ చేసి, మంజుల గురించి బాధపడింది. అనంతరం మూడు రోజుల తర్వాత పార్వతమ్మ ఇంట్లో నుంచి దుర్వాసన రావడం, ఆమె ఫోన్ స్విచాఫ్ ఉండటంతో స్థానికులు శోభారాణికి ఫోన్ చేసి సమాచారం అందించారు. కూతుళ్లు వచ్చి చూడగాఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. పెద్దకూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
రెండు జీపీలు ఏకగ్రీవం
● పేర్కంపల్లి సర్పంచ్‌గా శాంతిబాయి ● రాంపూర్మీదితండాలోవెంకట్రెడ్డికి పదవి ● యునానిమస్ దిశగా మరిన్ని జీపీలుయాలాల: మండలంలోని పేర్కంపల్లితండా సర్పంచ్‌గా శాంతిబాయి ఏకగ్రీవమయ్యారు. ఇటీవల వేసిన నామినేషన్లలో భాగంగా తండా నుంచి ఒకే దరఖాస్తు అందడంతో ఆమె ఎన్నిక లాంఛనమే కానుంది. స్క్రూటినీ అనంతరం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించనున్నారు. మరో మూడు పంచాయతీలు.. మండలంలోని మరో మూడు జీపీలు యునానిమస్ దిశగా సాగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 3న ఉండటంతో ఆయా గ్రామాల్లోని నాయకులు, యువకులు ఏకగ్రీవం వైపు చర్చలు సాగిస్తున్నారు. జక్కేపల్లి, ముకుందాపూర్, బండమీదిపల్లి ఈజాబితాలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో నామినేషన్లు వేసిన వారు ఉపసంహరణ చేసుకునేలా గ్రామపెద్దల సమక్షంలో ఒప్పందాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. యునానిమస్కు మొగ్గు చూపుతున్న జీపీలు తాండూరు రూరల్: తాండూరు మండలంలో మరో గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. రాంపూర్‌మీదితండా పంచాయతీకి జనరల్ రిజర్వేషన్ వచ్చింది. సర్పంచ్ పదవి కోసం పి.వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్, పట్లోళ్ల సావిత్రమ్మ, మోహన్‌నాయక్, రాంచందర్ నామినేషన్లు వేశారు. ఇదిలా ఉండగా సోమవారం పంచాయతీ పరిధిలోని ప్రజలు, నాయకులు ఏకగ్రీవానికి చర్చలు జరిపారు. అభ్యర్థులు, స్థానికులు పట్లోళ్ల వెంకట్‌రెడ్డిని బలపర్చడంతో, మిగిలిన నలుగురు నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలోని ఎనిమిది వార్డులను సైతం ఏకగ్రీవం చేసుకున్నట్లు ఎంపీడీఓ విశ్వప్రసాద్ తెలిపారు. -
ఇండస్ స్కూల్ వద్ద ఎమ్మెల్యేల ఆందోళన
శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆరోపించారు. అనుమతులు లేకుండా సీజ్ చేసిన ప్రైవేటు బస్సుల్లో విద్యార్థులను తిప్పుతున్నారని, అదే విధంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమీప బంధువు బస్సులకు సంబంధించి రూ.3 కోట్ల మేర బకాయిలు చెల్లించాలని కోరుతూ సోమవారం స్కూల్ వద్ద తమ అనుచరులతో ఆందోళన చేపట్టారు. అనంతరం స్కూల్ డైరెక్టర్ కిరణ్ కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించి, వారితో మాట్లాడారు. ఈ సంభాషణ అంతా వాడివేడిగా జరుగుతున్నా క్రమంలో.. స్కూల్ యాజమాన్యం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఫోన్లో సంప్రదించి, ఎమ్మెల్యేలతో మాట్లాడించారు. నగరానికి వచ్చిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందామని కేటీఆర్ సూచించడంతో ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. బయటకు వచ్చిన అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఇండస్ స్కూల్ యాజమాన్యం ఫిట్నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తోందని ఆరోపించారు. స్కూల్ యాజమాన్యం ఎమ్మెల్యేలతోనే ఈ విధంగా ప్రవర్తిస్తే, సామాన్య ప్రజలకు ఇంకేలా ఉంటుందని అందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ సూచనతో వెనుదిరిగిన నేతలు -
‘లగచర్ల’ ముద్దాయి సురేశ్ బైండోవర్
దుద్యాల్: మండల పరిధిలోని లగచర్ల గ్రామానికి చెందిన బోగమోని సురేశ్‌ను సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేశారు. లగచర్ల ఘటనలో ఏ–2 ముద్దాయిగా ఉన్న సురేశ్‌ను పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని తహసీల్దార్ కిషన్, పోలీసులు హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో గొడవలు సృష్టించినా, అల్లర్లకు పాల్పడినా అరెస్టు చేయడంతో పాటు రూ.లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కళాశాల రికార్డుల పరిశీలన అనంతగిరి: వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం అకాడమిక్ ఆడిట్ కమిటీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. కళాశాల అభివృద్ధికోసం సిబ్బందికి సూచనలు చేశారు. కమిటీలో డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ ఇంతియాజుద్దీన్లు ఉన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. పీవీ గీతాలక్ష్మి పట్నాయక్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. లారీ కింద పడి యువకుడి దుర్మరణం శంకర్పల్లి: లారీ కింద పడిన ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన సోమవారం రాత్రి మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శుభం హల్సే(22) ప్రైవేటు ఉద్యోగి. తన తల్లిదండ్రులతో కలిసి నగరంలోని దూల్పేట్లో నివాసం ఉంటున్నాడు. సోమవారం విధులు ముగించుకొని బైక్‌పై కొల్లూర్ వైపు వెళ్తుండగా.. ఇంద్రారెడ్డినగర్ వద్ద పక్కపక్కనే వెళ్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. శుభం హల్సే అక్కడే కింద పడిపోగా.. వెనక నుంచి వచ్చిన లారీ అతని పైనుంచి వెళ్లింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఫిలింనగర్ సెక్షన్ లైన్మెన్పై వేటు సాక్షి, సిటీబ్యూరో: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను బంజారాహిల్స్ డివిజన్ ఫిలింనగర్ సెక్షన్ లైన్మెన్ కె.భాస్కర్‌పై డిస్కం వేటు వేసింది. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా నవంబర్ 28న డైరెక్టర్ సహా సీజీఎం ఇతర అధికారులు దుర్గభవానీ నగర్లో పర్యటించారు. అంతకు ఒక రోజు ముందే ఆయనకు ఈమేరకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను భేఖాతార్ చేయడంతో పాటు పైఅధికారికి కనీస సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ డీఈ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిపై కేసు నమోదు.. నాగోలు: ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన శ్రావణ్‌కుమార్ నగరానికి వలస వచ్చి ఎన్టీఆర్నగర్లో నివాసం ఉంటూ కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్నాడు.అతడి ఇంటి సమీపంలో అదే రాష్ట్రానికి చెందిన కుటుంబం నివాసం ఉంటోంది. వారి కుమార్తె (14)కు మాయమాటలు చెప్పి శ్రావణ్‌కుమార్ అమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు నిందితుడు అదుపులోకి తీసుకున్నారు. -
అశోక్‌కే నా మద్దతు..
● స్పష్టం చేసిన మాజీ సర్పంచ్ ● కొలిక్కి వచ్చిన కరన్‌కోట్ ‘పంచాయితి’ తాండూరు రూరల్: రెండు రోజులుగా ఉత్కంఠ నెలకొన్న కరన్‌కోట్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి బోయ అశోక్‌కుమార్‌కు తన మద్దతు ఉంటుందని మాజీ ఉప సర్పంచ్ హేమంత్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయలేదని చెప్పారు. అశోక్ గెలుపు కోసం గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తానన్నారు. మా హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. 600 ఉన్న రేషన్ కార్డులను 2 వేలు చేశామమని, 300 ఏళ్లక్రితం నాటి సంగమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. గ్రామంలో ప్రతి వార్డుల్లో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, స్మశాన వాటికలకు ప్రహరీలు నిర్మించామని వివరించారు. ఇందులో సుధాకర్‌గౌడ్ స్వామి, రవిందర్‌రెడ్డి, అఫ్రోజ్‌లు ఉన్నారు. -
హత్య కేసులో నిందితులపై పీడీ యాక్టు నమోదు
మలక్‌పేట: పట్టపగలు దారుణహత్యకు పాల్పడిన కేసులో ఆరుగురు నిందితులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు ప్రయోగించినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిందితులపై పీడీ యాక్టు నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. గత జులై 25న మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని, శాలివాహననగర్ పార్కు వెస్ట్‌సైడ్ గేట్ వద్ద సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, గిరిజన నాయకుడు కేతావత్ చందు రాథోడ్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో నిందితులైన ఉప్పల్ భగాయత్‌కు చెందిన దొంతి రాజేష్ అలియాస్ రాజన్న, సరూర్‌నగర్‌కు చెందిన కుంబ ఏడుకొండలు, జగ్గయ్యపేటకు నివాసి ఆత్మకూరి శ్రీను, అడ్డగూడూరుకు చెందిన కందుకూరి ప్రశాంత్, నెల్లూరు జిల్లాకు చెందిన అర్జున్ జ్ఞానప్రకాశ్, రాంబాబులపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. -
పీహెచ్‌సీని పరిశీలించిన డీఎంహెచ్ఓ
ధారూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి సందర్శించారు. ఆస్పత్రిలో నిల్వ ఉన్న మందులు, ట్యాబెట్లు, ఇతర వస్తువులను పరిశీలించారు. సిబ్బందిని పిలిపి సమస్యలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో రోగులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించే సౌకర్యం లేదని, దానికి ప్రతిపాదనలు సైతం పెట్టలేదని ఆమె తెలిపారు. ఆవరణ మొత్తం పిచ్చిమొక్కలు, గడ్డితో నిండిపోయి పాములకు ఆవాసంగా మారిందని డీఎంహెచ్ఓ దృష్టికి తీసుకురాగా పరిశీలించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగితే తాండూరు, వికారాబాద్ ఆస్పత్రులకు వెళుతున్నామని, స్థానికంగా వైద్య సౌకర్యం కల్పించాలని రోగులు విన్నవించారు. ఆసుపత్రికి సంబంధించిన విషయాలను ఎంపీహెచ్ఈఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగుల రిజిస్టర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ శాంతి, ఎంపీహెచ్ఈఓ విజయేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘రేడియల్’ రహదారి పనులు షురూ
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 330 అడుగుల రేడియల్ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఓఆర్ఆర్ 13 ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాంతం పరిధిలోని మీర్ఖాన్పేట మీదుగా ఆమన్‌గల్లు మండలం ఆకుతోటపల్లి వరకు దాదాపు 42 కిలోమీటర్ల మేర 330 అడుగుల విస్తీర్ణంతో రహదారిని నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట రెవెన్యూ స్కిల్స్ యూనివర్సిటీ మీదుగా గతంలో నిర్మించిన 200 అడుగుల రహదారి వరకు సుమారు 19.2 కిలోమీటర్ల మేర ఏపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. అక్కడి నుంచి ఆకుతోటపల్లి వరకు 22 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన రహదారి కాంట్రాక్టును ఎల్అండ్టీ సంస్థ దక్కించుకుంది. రెండు రోజుల క్రితం నుంచి మీర్ఖాన్పేట 200 అడుగుల రహదారి నుంచి ఉత్తరం వైపు స్కిల్స్ యూనివర్సిటీ మీదుగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ వైపు రహదారి నిర్మాణ పనులను రిత్విక్ సంస్థ ప్రారంభించింది. సోమవారం దక్షిణం వైపు కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎల్అండ్టీ సంస్థ పనులు మొదలు పెట్టింది. జేసీబీ యంత్రాలతో ప్రస్తుతం రెండు వైపులా భూమి చదును చేసే పనులు చేపట్టారు. టీజీఐఐసీ గతంలో సేకరించిన భూముల నుంచే ప్రస్తుతం పనులు ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీలో ఓవైపు గ్లోబల్ సమ్మిట్ పనులు, స్కిల్స్ యూనివర్సిటీ, ఎఫ్‌సీడీఏ కార్యాలయం నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ప్రస్తుతం రేడియల్ రహదారి నిర్మాణం పనులు షురూ కావడంతో అన్ని వైపుల నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన పనులు వేగాన్ని పుంజుకున్నట్లయింది. -
ట్యాంకును కూల్చివేయండి
కుల్కచర్ల: మండల పరిధిలోని ముజాహిద్‌పూర్‌లో ప్రమాదకరంగా ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును వెంటనే కూల్చివేయాలని మిషన్ భగీరథ ఇంట్రా చీఫ్ ఇంజనీర్ లలిత, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ రవికుమార్ సూచించారు. సోమవారం గ్రామంలో పర్యటించిన అధికారులు ట్యాంకుతో ఎలాంటి ప్రమాదం జరగకముందే, తగిన జాగ్రత్తలు తీసుకుని కూల్చివేయాలన్నారు. నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రమాదకరంగా మారిన ట్యాంకులు ఎక్కడ ఉన్నా ఇంజనీర్ల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: శేరిగూడ గ్రామంలోని ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీజీఎం డా. అజయ్ కే సూద్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ నిర్వహణ, లావాదేవీలు, పనితీరు ఎలా ఉందో పరిశీలించారు. పీఏసీఎస్ చైర్మన్ పాడురంగారెడ్డి, సీఈవో గణేశ్ ఆయనకు ఆయా విషయాలను వివరించారు. కార్యక్రమంలో టీఎస్సీఏబీ ఎండీ వైకే రావు, జీఎం ప్రభాకర్‌రెడ్డి, డీజీఎం కిరణ్‌కుమార్, సంబంధిత అధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
లెక్క..కీలకం
పంచాయతీ ఎన్నికల వ్యయ పరిమితి ఖరారుపల్లె పోరులో నోట్ల కట్టల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఇందుకు వ్యయ పరిమితిని విధించడంతో పాటు గ్రామాల్లో ప్రత్యేక యంత్రాంగంతో కూడిన నిఘా ఏర్పాటు చేసింది.వికారాబాద్: రోజురోజుకూ పెరుగుతున్న ఎన్నికల వ్యయాన్ని నియంత్రించడానికి ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. అభ్యర్థులు ఎంత ఖర్చు చేయాలనే విషయంలోనూ స్పష్టమైన పరిమితులు రూపొందించింది. అయితే ఎన్నికల కమిషన్ పేర్కొన్న నిబంధనలకు ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చుకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. ఈసీ పరిమితికి మించి అభ్యర్థులు పది నుంచి ఇరవై రెట్లు ఎక్కువ వెచ్చిస్తున్నారు. ధన ప్రవాహ కట్టడికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని యంత్రాంగం ప్రత్యేక నిఘా పెడుతోంది. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన నిబంధనలు నవంబర్ 27 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే జిల్లాలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు పకడ్బందీగా వాహనాల తనిఖీ చేస్తున్నారు. రోజువారీగా లెక్కలు పోటీ చేసే ప్రతి అభ్యర్థి నామినేషన్ల నుంచి ఎన్నికలయ్యే వరకు ప్రచార కార్యక్రమాల నిమిత్తం ఎంత ఖర్చు చేయాలనే విషయంలో స్పష్టమైన నిబంధనలున్నాయి. ఏయే అవసరాలకు ఎంత ఖర్చు చేయాలనే విషయాలను కూడా స్పష్టీకరించింది. గతంలో ఎన్నికల ఖర్చును మూడు రోజులకు లేదా పోలింగ్ పూర్తయిన తరువాత కౌంటింగ్ వరకు చూపించే వీలు ఉండేది. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం అభ్యర్థి తాను చేస్తున్న ఖర్చును రోజువారీగా అధికారులకు చూపించాలి. అంతే కాకుండా వివరాలను ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వెబ్సైట్లో సైతం నమోదు చేయాలని షరతు ఉంది. అదే విధంగా నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తే వాటికి సంబంధించిన వివరాలను కూడా నమోదు చేయాలని అధికారులు పేర్కొంటున్నారు. నిత్యం దావత్‌లు ఎన్నికల కమిషన్ నిబంధనలతో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని ఆయా పార్టీలు ముందుగానే తమ మద్దతుదారులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఎన్నికల్లో ధన వ్యయాన్ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో కమిషన్ నిబంధనలు విధిస్తున్నప్పటికీ అభ్యర్థులు మాత్రం లోలోపల ఖర్చుకు వెనుకాడడం లేదు. జిల్లాలో మొత్తం 594 జీపీలు, 5,058 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తొలి విడతలో 262, రెండో విడతలో 175, మూడో విడతలో 157 జీపీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో నామినేషన్ల పర్వం ముగిసి ప్రచార పర్వానికి తెరలేసింది. ప్రతి నిత్యం వాహనాల ఏర్పాటు, భోజనాలు, మందు, విందు ఖర్చుల పేరిట భారీగానే వెచ్చిస్తున్నారు. ఎంతలేదన్నా ఆయా జీపీల్లో నిత్యం రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన ప్రచారానికి ఖర్చు క్షుణ్ణంగా పరిశీలించనున్న అధికారులు మేజర్ జీపీలో సర్పంచ్‌కి రూ.2.5 లక్షలు చిన్న గ్రామంలో రూ.1.5 లక్షలు పరిమితి దాటితే వేటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థి నేరచరిత్రకు సంబంధించిన వివరాలను నామినేషన్‌తో పాటు పొందుపరచాలి. ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో(మేజర్ పంచాయతీ) పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు రూ.2.5 లక్షల వరకు ఖర్చు చేసుకునే వీలుంది. మేజర్ పంచాయతీలలో వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు రూ.50 వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఇక ఐదు వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో(మైనర్ పంచాయతీలు) పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేసే వెసులుబాటు ఈసీ కల్పించింది. చిన్న పంచాయతీలలో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తే రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఉప సర్పంచ్ అభ్యర్థులకు సైతం వార్డు సభ్యుడికి ఉండే నిబంధనలే వర్తిస్తాయి. ఖర్చులు పరిమితి దాటితే వేటు తప్పదు. -
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
అనంతగిరి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సోమవారం హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించామని, పరిశీలన కూడా చేస్తున్నామన్నారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు జిల్లాస్థాయి మండల స్థాయిల్లో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ స్నేహమెహ్ర, ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరి, వ్యయ పరిశీలకుడు రమేశ్‌కుమార్, అదనపు కలెక్టర్ సుధీర్, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్‌పై అప్రమత్తత ముఖ్యం
తాండూరు టౌన్: హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సూచించారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, దిశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు చికిత్సే లేదని, నివారణ ఒక్కటే మార్గమన్నారు. హెచ్ఐవీ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ స్వర్ణకుమారి, హెచ్ఐవీ, ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. అలాగే ఐదు ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయని, రెండు హెచ్ఐవీ, ఎయిడ్స్ చికిత్స కేంద్రాలు కూడా ఉన్నాయన్నారు. హెచ్ఐవీ సోకిన ఇద్దరు మహిళలకు సురక్షితంగా ప్రసవం చేశామన్నారు. జిల్లాలో 3,800 మంది హెచ్ఐవీకి చికిత్స పొందుతున్నారని, గతేడాదితో పోలిస్తే ఈఏడాది కేసుల సంఖ్య తగ్గిందన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ పట్టణాధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్ కుమార్, ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సమీవుల్లా, శ్రీనివాసులు, దిశా స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ డానియల్, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ -
అంబులెన్స్ సేవలు ప్రారంభం
అనంతగిరి: వికారాబాద్ పట్టణానికి చెందిన సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద, మధ్య తరగతి ప్రజల సౌకర్యార్థం(ఇంధనం ఖర్చు మాత్రమే చెల్లించి) ఏర్పాటు చేసిన అంబులెన్స్ వాహనాన్ని సోమవారం అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో రిబ్బన్ కట్ చేసి వాహన సేవలు షురూ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సతీష్‌రెడ్డి, సంతోష్‌గౌడ్, ట్రస్ట్ నిర్వాహకులు సందీప్ తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అనంతగిరి: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో సత్వరమే పరిష్కరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 16 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ మంగ్లీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తాండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలుగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కుమారుడు అవినాష్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్‌లను ఎమ్మెల్యే సోమవారం నియమించారు. వీరు గ్రామాల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతగిరి: రుణాలు పొందిన వీధి విక్రయదారులు తమ ఈఎంఐలను విధిగా చెల్లించేలా అవగాహన కల్పించాలని వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ అన్నారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో టౌన్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో వీధి విక్రయదారుల నిమిత్తం తొలి, ద్వితీయ, తృతీయ విడత రుణాలు, బ్యాంకులచే రిటర్న్ అయిన అప్లికేషన్స్, మహిళ సంఘాల రుణాలు, ఎన్పీఏ సంబంధిత అంశాలు తదితర వాటిపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మహిళ సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు కూడా నిర్ణయించిన విధంగా చెల్లించాలన్నారు. సమావేశంలో డీఎంసీ వెంకటేశ్, సంబంధిత బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. తుర్కయంజాల్: మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్‌గా ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన కె. అమరేందర్ రెడ్డి నవంబర్ 30న ఉద్యోగ విరమణ చేసిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి
కుల్కచర్ల: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని ముజాహిద్పూర్కు చెందిన బీఆర్ఎస్, బీజేపీల నుంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. నిబద్ధతతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు చంద్రభూపాల్, బాలకృష్ణ, అంబు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి -
నామినేషన్లో తప్పులు దొర్లొద్దు
మోమిన్‌పేట: నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకూడదని జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని వెల్చాల్ క్లస్టరులో పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌లు తప్పనిసరిగా ఉండాలన్నారు. అవసరమైన వారికి సహకారాలు అందించాలన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు బలపరిచే వ్యక్తిని మాత్రమే లోనికి అనుమతించాలన్నారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో సొంత నిర్ణయాలను అమలు చేయకూడదన్నారు. విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పకుండా అమలయ్యేలా చూడాలని, నిర్ణీత గడువు లో పల నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు కొత్త బ్యాంకు అకౌంట్ తెరిచి ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టరు హర్ష్ చౌదరి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ సృజన సాహిత్య, ఎంపీఓ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తనిఖీ నవాబుపేట: నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్ణీత గడువు లోపు నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలని చెప్పారు. నోటిఫికేషన్ పరిశీలన అనంతగిరి: వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం తనిఖీ చేశారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ వినయ్‌కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
వైభవంగా గీతా జయంతి
వికారాబాద్‌లో సామూహిక గీతా పారాయణం చేస్తున్న గీతా వాహిని బృందంఅనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శివాజీనగర్ కాలనీలో గణేశ్ కట్ట వద్ద గీతా వాహిని ఆధ్వర్యంలో సోమవారం గీతా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా గీతాయజ్ఞం, సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా వాహిని అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. ఎనిమిది ఏళ్లుగా గీతా పారాయణంతోపాటు గీతా ప్రచారం చేస్తున్నామన్నారు. భగవద్గీతను పట్టణంలోని ఆయావాడలు, పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి నవీన్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేశ్‌కుమార్, నాయకులు రమేశ్‌గౌడ్, స్వాతి, పావని, లక్ష్మి, దమయంతి, దేవీనాయక్, రాజ్యలక్ష్మి, గీతా వాహిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత పుస్తకాలు పంపిణీ కొడంగల్: పట్టణంలోని నేతాజీ పాఠశాలలో సోమవారం ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు లోకుర్తి జయతీర్థాచారీ ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. గీతా జయంతి సందర్భంగా తెలుగులో ఉన్న 100 భగవద్గీత పుస్తకాలను అందజేశారు. విద్యార్థులు ప్రతి రోజు గీతా పారాయణం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరికలు
మర్పల్లి: మండల పరిధిలోని కోట్‌మర్పల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో కలిసి ఆదివారం గులాబీ గూటికి చేరారు. ఈ మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్‌లోని ఆయన స్వగృహంలో శ్రీనివాస్‌రెడ్డి, అనుచరులకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు రఘుపతి రెడ్డి, రమేశ్‌గౌడ్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. పనితీరు నచ్చకే ... కుల్కచర్ల: ప్రభుత్వ పనితీరు నచ్చక బీఆర్ఎస్లోకి స్వచ్ఛందంగా చేరికలు ప్రారంభమయ్యామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం చౌడాపూర్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు గులాబీ గూటికి చేరారు. వారికి ఆయన పార్టీ కండువా వేసి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. హామీల అమలులో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కుల్కచర్ల మండల అధ్యక్షుడు శేరిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి వలసలు -
ఒప్పించి.. పత్రాలు రాయించి
● ఫలించిన గ్రామ పెద్దల మంతనాలు ● ఏకగ్రీవం దిశగావాల్యా నాయక్ తండా! దుద్యాల్: పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో పూర్తయింది. ఏకగ్రీవం చేసుకుంటే పంచాయతీకి ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.10 లక్షల నజరాన ప్రకటించడంతో.. అందరి దృష్టి దానిపైనే పడింది. దీంతో సాధ్యమయ్యే గ్రామాల్లో.. అక్కడి పెద్దలు.. పోటీలో ఉన్న అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా మండల పరిధి వాల్యానాయక్ తండాలో ఆదివారం అదే పంచాయితీ జరిగింది. బరిలో ఉన్న నలుగురితో గ్రామ పెద్దలు మాట్లాడారు. అధికార పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసి, మిగతా వారు నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా ఒప్పంద పత్రాలు రాయించుకున్నారు. మాట నిలబెట్టుకుంటారా? నూతనంగా ఏర్పడిన గ్రామం వాల్యానాయక్ తండా. అభివృద్ధి చెందాలంటే అధికంగా నిధులు అవసరం ఉంటుందని భావించిన తండా పెద్ద మనుషులు.. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్న దేవిబాయి, బుజ్జిబాయి, లలితబాయి, జ్యోతిబాయిలతో ఏకగ్రీవం అంశంపై చర్చించారు. కాంగ్రెస్ అభ్యర్థి దేవిబాయిని ఏకగ్రీవం చేసుకుందామని మిగతా ముగ్గురిని ఒప్పించారు. బుజ్జిబాయి, లలితబాయి, జ్యోతిబాయిలు ఈ నెల 3న నామినేషన్లను విరమించుకోవాలని సూచించారు. దీంతో వారు అంగీకారం తెలిపారు. ఇందుకు సంబంధిత ఒప్పంద పత్రాలను ముగ్గురు నుంచి తీసుకున్నారు. కాగా.. పెద్దల మాట ప్రకారం ఏకగ్రీవం చేస్తారో? లేదో రెండు రోజులు వేచి చూడాలి. ఈ తండాకు అనుబంధంగా సోమ్ల నాయక్ తండా, కస్ననాయక్ తండా, రక్త మైసమ్మ తండా, రెడ్యా నాయక్ తండాలు ఉన్నాయి. సుమారు 700 వరకు జనాభ ఉండగా.. 450 ఓట్లు ఉన్నాయి. -
ప్రతి‘నోటా’మాట!
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నోటా గుర్తును తొలిసారిగా ప్రవేశపెడుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పైన ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే.. నోటాకు ఓటు వేసే అవకాశం కల్పించింది. దీంతో ఆ గుర్తుపై ప్రజల్లో చర్చ, అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. దుద్యాల్: శాసనసభ, పార్లమెంటు ఎన్నికలకే పరిమితమైన నోటాను తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ప్రవేశ పెట్టింది. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం ఓటర్లకు కల్పించింది. అయితే తొలి సారిగా అమలు చేస్తున్న దీనిపై గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే.. స్థానిక పోరు గ్రామాల అభివృద్ధికి కీలకం. బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థికి ప్రతి ఓటు ముఖ్యమే. ఒకటి, రెండు ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓటమిని చవిచూసిన సందర్భాలు అనేకం. అయితే ఈ సారి బ్యాలెట్ పేపర్లో ఎన్నికల కమిషన్ నోటాకు అవకాశం ఇవ్వడంతో అభ్యర్థుల్లో ఇప్పటి నుంచే వణుకు మొదలైంది. అవగాహన అవసరం స్థానిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సామగ్రి రెడీగా ఉంచారు. జిల్లాలోని మండల కేంద్రాలకుతరలించారు. కాగా.. బ్యాలెట్ పత్రంపై నోటా గుర్తును సైతం ముద్రించడంతో.. దీనిపై పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇటీవలే సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలలో నోటా గుర్తుపై ప్రజలకు వివరించారు. గ్రామాల్లో ఎక్కువగా నిరక్షరాశ్యులు ఉండే అవకాశం ఉండటంతో వారికి దీనిపై అవగాహన ఉండదు. కావున నోటా గుర్తుపై అవగాహన అనివార్యం. తారుమారు నోటా గుర్తు వలన ఓటర్లు ఇబ్బందిపడే అవకాశాలున్నాయి. అది ఒక అభ్యర్థి గుర్తుగానే భావించి, అవగాహన లేమితో కొందరు దానికి ఓటేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. ఆది నోటా లెక్కలోకి వెళ్తుంది. ప్రస్తుత ఎన్నికల్లో గ్రామాలను బట్టి 300 నుంచి 10 వేల వరకు ఓటర్లు ఉన్న పంచాయతీలు ఉంటాయి. వెయ్యి మంది ఓటర్లు గల జీపీలు 60 శాతానికి పైగా ఉన్నాయి. వార్డుల్లో 50 నుంచి 200లకు పైగా ఓటర్లు ఉంటారు.సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ఒకటి, రెండెంకెల ఓట్ల తేడాతో ఎన్నికయ్యే సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నోటా గురించి.. ఓటర్లకు అవగాహన కల్పించక పోతే.. ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉంటుందని పోటీదారులు భయాందోళన చెందుతున్నారు. స్థానిక పోరులో నోటాకు చోటు బ్యాలెట్ పేపర్‌పై గుర్తింపు గ్రామాల్లో విస్తృతంగా చర్చ ఓటర్లకు అవగాహన కల్పిస్తే మేలు -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● బీఆర్ఎస్ పాలన కోరుకుంటున్న ప్రజలు ● మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరిగి: హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, దీంతో అధికార పార్టీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పాలనే ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో పూడూరు మండలం నుంచి 160 మంది, చౌడాపూర్, గండీడ్ మండలాలకు చెందిన కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి, ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా సర్పంచ్‌లను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. -
ఆదివారం అంతంతే..
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ నియోజకవర్గంలో రెండో విడతనామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు పత్రాల సమర్పననెమ్మదించింది. ఆయా మండలాలు,పరిధి గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థుల నుంచి నామపత్రాలను ఎన్నికల అధికారులు స్వీకరించారు. ధారూర్: మండల పరిధిలో 34 గ్రామ పంచాయతీలు, వార్డులు 286 ఉండగా.. సర్పంచు 35, వార్డులకు 17 దరఖాస్తులు అందాయని ఎంపీడీఓ నర్సింహులు తెలిపారు. సర్పంచ్ నామినేషన్లు ఇలా ఉన్నాయి. నాగసమందర్ 4, గురుచోట్ల 1, పీసీఎంతండా1, నాగారం 1, దోర్నాల 1, మోమిన్‌కలాన్ 1, అంతారం 5, మోమిన్‌కుర్దు 1, రాజాపూర్ 2, తరిగోపుల 1, ధారూరు 3, ధారూరు స్టేషన్ 2, రాంపూర్‌తండా 1, కేరెల్లి 3, ఎబ్బనూర్ 1, మున్నూరుసోమారం 4, కుక్కింద 1, నర్సాపూర్ 1, రుద్రారం 1 నామినేషన్లు దాఖలయ్యాయి. 33 జీపీలకు 38 పత్రాలు నవాబుపేట: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని 33 గ్రామాలకు 38 సర్పంచ్, 276 వార్డులకు 50 నామినేషన్లు వచ్చాయని ఎంపీడీఓ అనురాధ తెలిపారు. మర్పల్లిలో.. మర్పల్లి: మండలంలోని 29 గ్రామ పంచాయతీలు ఉండగా.. సర్పంచులకు 26, 264 వార్డులకు 37 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీటీ జయరాంమ్ తెలిపారు. బంట్వారంలో.. బంట్వారం: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదటి రోజు ఆదివారం అంతంత మాత్రంగానే కనిపించింది. మండలంలోని 12 పంచాయతీలకు 8, 106 వార్డులకు 12 నామినేషన్లు, అదే విధ ంగా కోట్‌పల్లి మండలంలోని 18 పంచాయతీలకు 21, 150 వార్డులకు 8 నామపత్రాలు అందాయని ఎంపీడీఓలు రాములు, హేమంత్ తెలిపారు. మోమిన్‌పేటలో.. మోమిన్‌పేట: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారంమందకొడిగా సాగింది. మండలంలో 29 గ్రామ పంచాయతీలు, 263 వార్డులు ఉన్నాయి. 29సర్పంచ్, 49 వార్డు సభ్యులకు నామపత్రాలు దాఖలయ్యాయి. మండలంలో 8 క్లస్టర్లలో అభ్యర్థుల నుంచి పత్రాలు స్వీకరిస్తున్నారు. మందకొడిగా రెండో దశ నామినేషన్లు -
వంతెన కిందకు దూసుకెళ్లిన కారు
అనంతగిరి: అదుపు తప్పిన ఓ కారు వికారాబాద్ బ్రిడ్జి పై నుంచి కింద పడింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో ఎన్నెపల్లి నుంచి వికారాబాద్ వైపు వస్తుండగా.. వంతెన మూల మలుపు వద్ద వారు పయనిస్తున్న కారు.. అదుపు తప్పి కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయా లు కాలేదు. కారు పూర్తిగా ధ్వంసం అయింది. కాగా.. పొగమంచుతో మలుపు దగ్గరకు వచ్చే వరకు కనబడలేదని బాధితులు తెలిపారు. భార్యను చంపిన భర్త పోలీసుల అదుపులో నిందితుడు తాండూరు రూరల్: కోపోద్రిక్తుడైన భర్త.. భా ర్యను హత్య చేశాడు. ఈ సంఘటన పెద్దేముల్ తండాలో చోటు చేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మూడవత్ రవి, అనిత(35) దంపతులు. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కొంత కాలంగా రవి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో సదరు వ్యక్తి ఆవేశంతో ఆమైపె దాడి చేశాడు. తల, ముఖంపై పారతో కొట్టి హతమార్చాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఎస్ఐ శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వికారాబాద్ క్లూస్‌టీం ద్వారా వివరాలు సేకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మృతురాలి సోదరుడు కేతావత్ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనితకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. దౌల్తాబాద్‌లో రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం దౌల్తాబాద్: మండల పరిధిలో రెండు గ్రామ పంచాయతీలు దాదాపు ఏకగ్రీవం అయినట్లే. మండలంలోని తిమ్మాయిపల్లి, బండివాడ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకుగాను ఒక్కో నామినేషన్ దాఖలైనట్లు అధికారులు తెలిపారు. బండివాడలో నూర్యనాయక్, తిమ్మాయిపల్లి పంచాయతీకి శాణమ్మ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం వెంగళరావునగర్: ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జె.సందీప్ అనే యువకుడు గత కొంతకాలంగా ఎల్లారెడ్డిగూడలో ఉంటూ ఉద్యో గ ప్రయత్నాలు చేస్తున్నాడు. గత మార్చి నెలలో తన స్నేహితుడి ద్వారా ఓంకార్ రూపేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు ఐటీ కంపెనీల్లో పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పా డు. అతడి మాటలు నమ్మిన సందీప్ రూ.1.60 లక్షలు ఇచ్చాడు. నెలలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చిన సందీప్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో ఓం కార్ రూపేష్ తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుడి సందీప్ ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు వ్యక్తులు అదృశ్యం
మరో ఘటనలో.. కోడిపందేల స్థావరంపై దాడి మేడిపల్లి: కోడిపందేల స్థావరాలపై మేడిపల్లి పోలీసులు దాడిచేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెంగిచెర్ల మేకల మండి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు దాడిచేసి 15మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారినుంచి రెండు పందెం కోళ్లు, రెండు కోడి కత్తులు, రూ.18వేల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నేతలకు ఉపసంహరణ పరీక్ష
దౌల్తాబాద్: తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు ఇద్దరికి మించి నామినేషన్లు దాఖలు చేసిన చోట్ల వారిని ఉపసంహరించుకునేలా చేయడం నేతలకు పరీక్షగా మారింది. ఆయా స్థానాల్లో పార్టీ బలపరిచన అభ్యర్థుల నుంచి ముఖ్యనేతలపై ఒత్తిడి తీవ్రమైంది. అధికారపార్టీలో ఈ పోటీ తీవ్రంగా ఉంది. దీంతో పార్టీ ముఖ్యనేతలకు తలనొప్పిగా మారింది. ఎవరిని ఎంపిక చేయాలో ఎవరిని బుజ్జగించాలో తెలియని పరిస్థితి నెలకొంది. అత్యధిక పంచాయతీ స్థానాలు దక్కించుకోవాలనే వ్యూహరచనలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు సమర్థులు, అంగబలం, అర్ధబలం ఉన్న అభ్యర్థుల అన్వేషణలో పడ్డాయి. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలకు సైతం వార్డు స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క పరేషాన్లో పడ్డారు. -
కరన్‌కోట్ ఫైట్.. వెరీ హాట్
తాండూరు రూరల్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేజర్ పంచాయతీ కరన్‌కోట్ గ్రామం. పది వేల మంది జనాభా, 7 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. గ్రామ శివారులో సీసీఐ ఫ్యాక్టరీతో పాటు పదుల సంఖ్యలో నాపరాతి గనులున్నాయి. పంచాయతీకి పుష్కలంగా నిధులు వస్తాయి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా మాజీ సర్పంచ్ వీణ భర్త, మాజీ ఉపసర్పంచ్ హేమంత్‌కుమార్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా రాజ్‌కుమార్ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. హేమంత్ కుమార్ 14 వార్డులకు సంబంధించి వార్డు సభ్యులు, ప్రతిపాదకులు అంతా సిద్ధం చేసుకుని చివరి నిమిషంలో అస్త్ర సన్యానం చేశాడు. ఆయన పోటీ నుంచి తప్పుకోవడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కరన్‌కోట్ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. తప్పించింది ఎవరు..? హేమంత్ కుమార్‌ను తప్పించిన నేత ఎవరనేది అంతుచిక్కడం లేదు. ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వెళ్లినా నోరు విప్పలేదు. ఏకగ్రీవం కాకుండా ఉందేందుకు బీఆర్ఎస్ యువ నాయకులు బోయ అశోక్, ప్రభాకర్‌గౌడ్ నామినేషన్ వేశారు. వారిని సైతం పోటీ నుంచి తప్పించేందుకు అధికార పార్టీ నాయకులు యత్నిస్తున్నట్లు సమాచారం. వీరు విత్‌డ్రా చేస్తే రాజ్‌కుమార్ సర్పంచ్‌గా ఏకగ్రీవం లాంఛనమే కానుంది. అయితే రాజ్‌కుమార్ గతంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోవడంతో ఆయనకు ప్రజల్లో సానుభూతి ఉందనే చర్చ వినిపిస్తోంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిచివరి నిమిషంలో పోటీకి విముఖత బరి నుంచి తప్పించింది ఎవరని చర్చలు పార్టీ శ్రేణులు ఇంటికి వెళ్లినానోరు విప్పని మాజీ ఉపసర్పంచ్హేమంత్కుమార్ మరో ఇద్దరు యువకులతోనామినేషన్ వేయించిన గులాబీ నేతలు వారిని సైతం విత్‌డ్రా చేయించేందుకు అధికార పార్టీ నేతల యత్నం -
పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి కొడంగల్: గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఒకే పార్టీ నుంచి ఇద్దరు అంతకు మించి ఎక్కువ మంది పోటీ చేస్తే ఇతర పార్టీల మద్దతుదారులు గెలిచే అవకాశం ఉందన్నారు. ఇలా జరగకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. పర్సాపూర్ సర్పంచ్ అభ్యర్థి కన్నం రాధ తన మద్దతుదారులతో వెళ్లి తిరుపతిరెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, పర్సాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, తట్టెపల్లి రాములు, శ్రీశైలం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి
● సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలవాలి ● గజ్జల రవీంద్రనర్సింహారెడ్డి దుద్యాల్: కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి, ప్రజలు ప్రభుత్వం వెంట నడుస్తున్నారని ఆ పార్టీ జిల్లా నాయకుడు గజ్జల నర్సింహారెడ్డి అన్నారు. మండలంలోని హకీంపేట్ సర్పంచ్ అభ్యర్థిగా తన భార్య రవీంద్రతో శనివారం నామినేషన్ వేయించారు. మద్దతుదారులు, గ్రామస్తులతో కలిసి ర్యాలీగా నామినేషన్ సెంటర్‌కు వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ల కాలంలోనే గ్రామానికి రూ.6 కోట్ల నిధులు ఇచ్చారన్నారు. హకీంపేట్‌లో వందల కోట్లతో పారిశ్రామిక వాడ, ఎడ్యుకేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి ఈప్రాంత సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నారన్నారు. తన సొంత డబ్బులతో గ్రామంలో ఆలయం నిర్మిస్తున్నానని స్పష్టంచేశారు. గ్రామాభివృద్ధికి అవసరమైనన్ని నిధులు తీసుకువస్తానని ధీమా వ్యక్తంచేశారు. అన్ని గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. హకీంపేట్ పంచాయతీ త్వరలోనే రాష్ట్రానికి రోల్ మోడల్‌గా రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. పారిశ్రామిక వాడకు భూములు ఇచ్చిన రైతులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో విద్యాలయాలు, రోడ్లు, కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. త్వరలోనే హకీంపేట్ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడుతుందని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఓటర్లందరూ రేవంత్‌రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నరెందర్‌రెడ్డి, బిచ్చిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్, సాయిలు, అశోక్, వెంకటేశ్, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
పెద్దేముల్లో కాంగ్రెస్‌కు షాక్
తాండూరు రూరల్: పెద్దేముల్ మండల కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు డీవై నర్సింలు శనివారం తన మద్దతుదారులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా వేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, పెద్దేముల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొహిర్ శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.గులాబీ గూటికి డీవై నర్సింలు -
ఆడిట్‌తో నాణ్యతా ప్రమాణాలు అంచనా
చేవెళ్ల: ఉన్నత విద్యా సంస్థల నాణ్య, ప్రమాణాలను అంచనా వేయడంలో అకడమిక్ ఆడిట్లు కీలకపాత్ర పోసిస్తాయని అకడమిక్ నిపుణులు శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.కవిత, హయత్‌నగర్ డిగ్రీ కళాశాల సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ వి.ఇందిర అన్నారు. శనివారం చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కాంచనలత ఆధ్వర్యంలో 2022–23, 2023–24కు సంబంధించి అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యా వ్యవస్థను సమీక్షించి పలు నాణ్యతా ప్రమాణాలపై పరిశీలించిన అధికారులు మాట్లాడుతూ.. కళాశాలలోని వసతులు, సంస్థ సాధిస్తున్న పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆడిట్‌తో భోధనా విధానాలు, సహపాఠ్య కార్యకలాపాలపై సమగ్ర విశ్లేషణ చేసే అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. వీటి నుంచి లభించే సూచనలు సంస్థ అభివృద్ధి, విద్యార్థుల విజయానికి నిర్మాణాత్మక, మార్గదర్శకత్వంగా నిలుస్తాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంచనలత మాట్లాడుతూ.. అకడమిక్ ఆడిట్‌తో లోటుపాట్లను గుర్తించి కళాశాల విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఆడిట్ అధికారులు సూచించిన ప్రతీ సిపార్సును వ్యవస్తీకృతంగా అమలు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రమేశ్‌బాబు, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.విజయలక్ష్మి, పాల్గొన్నారు. డాక్టర్ కవిత, డాక్టర్ ఇందిర -
‘లక్ష’ణంగా.. ఏకగ్రీవం దిశగా!
ధారూరు: పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రజలు, నాయకులు మొగ్గు చూపుతున్నారు. శనివారం మండల పరిధిలోని అవుసుపల్లిలో గ్రామస్తులు నిర్వహించుకున్న సమావేశంలో సర్పంచ్ రూ.35 లక్షలు, వార్డు మెంబర్లు రూ.50 వేల చొప్పున హనుమాన్ ఆలయ నిర్మాణానికి అందజేయాలని తీర్మానించుకున్నట్లు సమాచారం. గత లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఈ గ్రామం ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని నియమించుకున్నారు. కొండాపూర్ ఖుర్దు పంచాయతీలో సర్పంచ్‌కు రూ.6.50 లక్షలకు ఏకగ్రీమైనట్లు తెలుస్తోంది. నర్సాపూర్ పంచాయతీ సర్పంచ్ రూ.4లక్షలకు ఏకగ్రీవం అవ్వగా రూ.2.50 లక్షలు ఆలయానికి, రూ.1.50 లక్షలు ఇతర ఖర్చులకు వినియోగించనున్నట్లు తెలిసింది. గడ్డమీది గంగారంలోనూ ఏకగ్రీవమైనట్లు తెలిసింది. వీటితో పాటు రాజాపూర్, హరిదాస్‌పల్లి, మోమిన్‌ఖుర్దు, పీసీఎం తండా, గురుదోట్ల, అంపల్లి పంచాతీలు ఏకగ్రీవం వైపు యత్నిస్తున్నాయి. ధారూరుతో పాటు నాగారం, మోమిన్‌కలాన్, నాగసమందర్, కుక్కింద, మున్నూరుసోమారం, కొండాపూర్‌కలాన్, గట్టెపల్లి, రాంపూర్‌తండా, దోర్నాల్, స్టేషన్‌ధారూరు గ్రామ పంచాయతీల్లో పోటీ తీవ్రంగా మారనుంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు నామినేషన్ల ఘట్టం ముగియగానే ఎంతమంది బరిలో ఉంటారు, ఎంతమంది తప్పుకుంటారు, ఎంతమంది ఏకగ్రీవం వైపు మొగ్గుచూపుతారనేది తేలనుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆలయ పునఃనిర్మాణానికి ముందుకు.. తాండూరు రూరల్: తాండూరు మండలంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనరల్ రిజర్వేషన్ వచ్చిన వీరారెడ్డిపల్లిలో పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్లు వేశారు. గ్రామంలో చేపట్టిన ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి పురుషోత్తంరెడ్డి రూ.11 లక్షలు అందజేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయనను ఏకవగ్రీవంగా ఎన్నుకునేందుకు స్థానికులు నిర్ణయించినట్లు సమాచారం. చంద్రవంచలో రూ.15 లక్షలు.. చంద్రవంచలో ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన వారిని సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసేందుకు ప్రజలు నిర్ణయించారు. ఈజీపీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో సుదర్శన్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఆలయ నిర్మాణానికి రూ.15 లక్షలు అందజేసేందుకు సుదర్శన్‌రెడ్డి ముందుకు వచ్చిన నేపథ్యంలో విజయ్‌కుమార్‌రెడ్డిని విత్ డ్రా చేయించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ట్రాక్టర్, బైక్ ఎదురెదురుగా ఢీ
కానిస్టేబుల్‌కు గాయాలు దుద్యాల్: ఎదురెదురుగా ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఈ ఘటన దుద్యాల్ గేట్ వద్ద శనివారం చోటు చేసుకుంది. నారాయణపేట్ జిల్లా సర్జాఖాన్పేట్కు చెందిన శ్రీరామకృష్ణ నగరంలోని యూసుఫ్‌గూడ పోలీస్ స్పెషల్ బెటాలియన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తన స్వగ్రామానికి బైక్ వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో దుద్యాల్ గేట్ దగ్గర ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌కు దవడ భాగంలో గాయాలయ్యాయి. కొడంగల్ ప్రభుత్వాస్పత్రిలో ప్రథ మ చికిత్స చేసి కోస్గిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్, బైక్‌ను స్టేషన్‌కు తరలించారు. సవాల్‌గా సర్పంచ్ ఎన్నికలు పోటాపోటీగా పార్టీలు మారుతున్న నాయకులు చేవెళ్ల: సర్పంచ్ ఎన్నికలు నేతలకు సవాల్‌గా మారుతున్నాయి. పార్టీలకు అతీతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నా పార్టీలే తెరవెనుక ఉండి నడిపిస్తాయి. దీంతో ఇన్నాళ్లుగా పార్టీ నమ్ముకుని ఉన్నవారు కొందరికి అవకాశాలు రాక.. మరికొందరు తమ వ్యతిరేక వర్గం వారిని బలపరుస్తున్నారనే తదితర కారణాలతో పార్టీలు మారుతున్నారు. అభ్యర్థుల గెలుపును ప్రధాన పార్టీల నాయకులు భుజానెత్తుకుని పోటాపోటీగా ప్రచారాలు చేయిస్తున్నారు. మండల పరిధిలోని ముడిమ్యాలలో ఈ పరంపర ఎక్కువగా కొనసాగుతోంది. తాజాగా ఎంపీటీసీ మాజీ సభ్యుడు బూర్ల సాయినాథ్ కాంగ్రెస్‌ను వీడి మాజీ మంత్రి సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. దీంతో శనివారం మాజీ ఉపసర్పంచ్ షేక్ ఆరీఫ్ కారు దిగి ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, పి.ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, కుమార్ తదితరులు ఉన్నారు. నాగిరెడ్డిగూడలో ఫ్లాగ్ మార్చ్ మొయినాబాద్‌రూరల్: ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేయకుండా అభ్యర్థులు, నాయకులు పోలింగ్‌ను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేయాలని మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని నాగిరెడ్డిగూడలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నాయకుల భయబ్రాంతులకు గురికాకుండా ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసేందుకు శాంతియుతంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజాప్రతినిధులే దేశానికి ఆదర్శం అని అందుకు నిజమైన నాయకుడిని ఎన్నుకునేందుకు తమకు ఇష్టానుసారంగా ఓటు వేయాలని తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకావొద్దని సూచించారు. పట్టుబడిన మద్యం కొందుర్గు: స్థానిక ఎన్నికల్లో భాగంగా వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ కారులో మద్యం బాటిళ్లు తరలిస్తుండగా పట్టుకున్నట్లు జిల్లేడ్ చౌదరిగూడ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. లాల్‌పహాడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా స్విఫ్ట్ కారులో రూ.5,525 విలువైన 34 కింగ్ ఫిషర్ బీర్లు లభ్యమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మద్యం బాటిళ్లు సీజ్ చేసి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
‘త్రియుండ్’ శిఖరాన.. సాహస విద్యార్థులు
కొడంగల్ రూరల్: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇనిస్టిట్యూట్‌లో ఈ నెల 18 నుంచి 27 వరకు నిర్వహించిన జాతీయ సాహస శిక్షణ శిబిరంలో కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ విద్యార్థి వి.సికిందర్ పాల్గొన్నారని ప్రిన్స్‌పాల్ బి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన.. విద్యార్థి సాహస, విన్యాసాల చిత్రాలను ప్రదర్శిస్తూ.. మాట్లాడారు. ఈ శిబిరంలో పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి 10 మంది పాల్గొన్నారని, ఇందులో ఇక్కడి నుంచి సికిందర్ ఒక్కడే ఉన్నారని తెలిపారు. వీరందరూ ఎత్తయిన కొండలపై ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, జుమార్ క్లైంబింగ్, రాపెల్లింగ్, వాటర్ స్ప్రోర్ట్స్, యోగా, శారీరక పోటీల్లో పాల్గొన్నారని, వీటిల్లో సికిందర్ ప్రతిభ చాటారని హర్షం వ్యక్తం చేశారు. సముద్ర మట్టానికి 2,875 మీటర్ల ఎత్తులో గల త్రియుండ్ పర్వ శిఖరాన్ని అధిరోహించారన్నారు. కాగా.. వివిధ ప్రాంతాల వారితో కలిసి పనిచేయడంతో భాష, సంస్కృతి, కట్టుబాట్లు తదితర విషయాలు తెలుసుకున్నానని విద్యార్థి పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. -
ఏకగ్రీవం.. ఏం లాభం!
● యునానిమస్ చేస్తే ప్రోత్సాహకాలు అంటూ గత ప్రభుత్వం ప్రకటనలు ● ప్రస్తుతం ఊసెత్తని కాంగ్రెస్ ప్రభుత్వంకాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనలో పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధికి రూ.7లక్షల నజరానా అందించగా.. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10లక్షలు, ఎమ్మెల్యే నిధుల నుంచి మరో రూ.5లక్షలు అందజేస్తామని ప్రకటించింది. ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఏకగ్రీవాలపై ఎలాంటి ప్రకటన రాలేదు. దౌల్తాబాద్/షాబాద్: పంచాయతీ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. డిసెంబర్ 11న జరిగే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు ప్రక్రియ శనివారం పూర్తయింది. గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ పాలనలో అవినీతికి తావుండదు. సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం నగదు ప్రోత్సహాకాలు అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. గత ప్రభుత్వాలు ఏకగ్రీవమైన పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఏకగ్రీవాలపై స్థానిక నాయకులు అసక్తి చూపడంలేదు. రూ.15 లక్షలకు పెంచినా అందించలేదు గ్రామాల్లో రాజకీయ కక్షలు పెరగకుండా ఉండాలంటే గ్రామస్తులు కూర్చుని ఏకగ్రీవ పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపసర్పంచ్‌ను ఎన్నుకునే ఆనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతం చేశారు. ఏకగ్రీవంగా ప్రజాప్రతినిధులను ఎంపిక చేసిన పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తే గ్రామాల అభివృద్ధి చెందుతాయని చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. 2019లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ ప్రోత్సహక పథకాన్ని రూ.15లక్షలకు పెంచింది. అప్పట్లో చాలా పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. కానీ నిధుల కొరతతో ఏ ఒక్క పంచాయతీకి నజరానా అందించలేదు. ఈ సారి మూడు విడతల్లో ఎన్నికలను జరపనుండగా తొలివిడత సంగ్రామం మొదలైనా ప్రభుత్వం నుంచి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సహక విషయంపై స్పష్టత లేదు. స్పష్టత రాలేదు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అందించే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేస్తే ఈ అంశాన్ని అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేస్తాం. – అపర్ణ, ఎంపీడీఓ, షాబాద్ -
పార్టీకి నష్టం కలిగిస్తే కఠిన నిర్ణయాలు
● విధేయులకు భవిష్యత్‌లో పదవులు ● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తాండూరు రూరల్: కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తే కఠిన నిర్ణయాలు తప్పవని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పార్టీ శ్రేణులను హెచ్చరించారు. శనివారం ఆయన మండల పరిధిలోని మల్కాపూర్‌లో కాంగ్రెస్ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల పరిధిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపనకు పనిచేయాలన్నారు. కాంగ్రెస్ నుంచి ఒక్కో గ్రామంలో ఇద్దరు నుంచి ముగ్గురు నామినేషన్ వేస్తే ఎలా.. విత్‌డ్రా చేసుకునేందుకు సమయం ఉందని కూర్చుని మాట్లాడుదాం అన్నారు. పార్టీకి విధేయులుగా ఉన్నవారికి భవిష్యత్‌లో పదవులు ఉంటాయని చెప్పారు. భవిష్యత్‌లో ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పా రు. ఈ కార్యక్రమంలో నాయకులు డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, పటేల్ జనార్ధన్‌రెడ్డి, రవిసింథే, పండరి, విజయలక్ష్మి, గోపాల్‌రెడ్డి పటేల్, రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
కరన్‌కోట్‌లో కంగుతిన్న కారు
తాండూరు రూరల్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే పెద్ద పంచాయతీ అయిన కరన్‌కోట్‌లో బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈగ్రామం ప్రస్తుత ఎన్నికల్లో జనరల్‌కు రిజర్వ్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి రాజ్‌కుమార్ శనివారం తన ప్యానెల్‌కు చెందిన 14 మంది వార్డు సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి హేమంత్‌కుమార్ శనివారం నామినేషన్ వేయాల్సి ఉంది. గతంలో తన సతీమణిని సర్పంచ్‌గా గెలిపించుకోవడంతో పాటు మాజీ ఉప సర్పంచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న, బలమైన నాయకుడు కావడంతో పోటీ రసవత్తరంగా ఉంటుందని అంతా భావించారు. ఏం జరిగిందో ఏమో కానీ చివరి నిమిషంలో నామివేషన్ వేసేందుకు హేమంత్‌కుమార్ ససేమిరా అన్నారు. ఊహించని ఈ పరిణామంతో బీఆర్ఎస్ శ్రేణులు, మద్దతుదారులు కంగుతిన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నచ్చజెప్పినా వినకపోవడంతో హడావుడిగా అశోక్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరితో నామినేషన్ వేయించారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు బెదిరించడంతోనే హేమంత్ వెనక్కి తగ్గాడని బీఆర్ఎస్ నాయకులు బోయ అశోక్‌కుమార్, సుధకర్గౌడ్, స్వామి తదితరులు ఆరోపించారు. ఇదిలా ఉండగా కరన్‌కోట్‌లో సీసీఐ ఫ్యాక్టరీతో పాటు పదుల సంఖ్యలో నాపరాతి గనులు ఉన్నాయి. దీంతో పంచాయతీకి మంచి ఆదాయం ఉంటుంది. ఇక్కడ 10 వేల మందికిపైగా జనాభా, 7,354 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్‌కు నిరాకరించినహేమంత్కుమార్ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నచ్చజెప్పినా వినని వైనం కాంగ్రెస్ నేతలు బెదిరించారని గులాబీ శ్రేణుల ఆరోపణ -
కేసీఆర్ దీక్ష ఫలితమే ప్రత్యేక తెలంగాణ
వికారాబాద్: కేసీఆర్ దీక్ష ఫలితమే ప్రత్యేక తెలంగాణ అని.. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ తల్లి, కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ అమరులకు నివాళి అర్పించారు. అనంతరం ఉద్యమకారులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలనలో అణచివేతకు, వివక్షకు గురైన తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ ఉద్యమ సారథి అయ్యారని గుర్తుచేశారు. ఆయన నడుం బిగించి సకల జనులను కదిలించారన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించి పెట్టారని పేర్కొన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా పాలన అందించారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. ఇందుకు లగచర్ల ఘటనే నిదర్శనమన్నారు. రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని అన్నారు. బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణ సాధ్యమైందన్నారు. పాలనలో ఆయనకు ఎవరూ సాటిరారన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి ఎన్నో అద్భుత పథకాలు తెచ్చి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. కేసీఆర్ దీక్షకు పునుకోకపోతే తెలంగాణ వచ్చేదా..? అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. నాడు ఆంధ్రా పాలకులకు తొత్తులుగా ఉన్న వ్యక్తులకు కేసీఆర్ గురించి మాట్లాడే హక్కే లేదన్నారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్ రైతు బాంధవుడిగా మారారని అన్నారు. రైతు బీమా, రైతుబంధు లాంటి ఎన్నో పథకాలు తెచ్చి అండగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, విద్యా మౌలిక వనరుల కల్పన సంస్థ రాష్ట్ర మాజీ చైర్మన్ నగేందర్గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడిందన్నారు. తెలంగాణ అమరులకు ప్రతిఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చిండు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన ఘనత ఆయనదే గెలిచిన ఏడాదిలోపే రేవంత్ రాష్ట్రాన్ని ఆగం చేసిండు దీక్షా దివస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ -
రేపు సామూహిక భగవద్గీత పారాయణం
అనంతగిరి: గీతా జయంతిని పురస్కరించుకొని సోమవారం వికారాబాద్ పట్టణం శివాజీ నగర్ గణేశ్ కట్ట వద్ద సంపూర్ణ భగవద్గీత పారాయణం, గీతాయజ్ఞం నిర్వహించనున్నట్లు గీతావాహిణి అధ్యక్షురాలు టీ శ్రీదేవి సదానందరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్న 12.30గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తాండూరు రూరల్: సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థులు వేసే నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి, తిరస్కరణకు గురికాకుండా చూడాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆర్ఓలకు సూచించారు. శనివారం మండలంలోని గౌతాపూర్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అన్ని పత్రాలు సమర్పించాలన్నారు. ఏదైనా తిరస్కరణకు గురైతే ఆర్టీఓకు అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత శాఖలకు చెందిన అధికారులు వేగంగా చేపట్టారు. గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే మార్గంలో శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై పెద్దమ్మ దేవాలయం నుంచి కొత్తూర్ గేట్ ఫ్యూచర్‌సిటీ రహదారి వరకు నేషనల్ హైవే అధికారులు తారు వేసే పనులు చేపట్టారు. ఫ్యూచర్‌సిటీ మార్గంలో ఇప్పటికే గ్రీనరీ ఉండగా అదనంగా మొక్కలు నాటే పనులను హెచ్ఎండీఏ అధికారులు చేపట్టారు. మున్సిపల్ అధికారులు తుక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి వచ్చే మార్గంలో ఇరువైపులా కుండీల్లో నాటిన మొక్కలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు తమ పనుల్లో బిజీబిజీ అయ్యారు. మరోవైపు నిత్యం ఎవరో ఒక అధికారి గ్లోబల్ సమ్మిట్ ప్రాంతాన్ని సందర్శిస్తుండటంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇబ్రహీంపట్నం: తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నంకు చెందిన చెనమోని శంకర్ ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సంఘం 4వ రాష్ట్ర మహాసభల్లో ఈ మేరకు శంకర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శనివారం శంకర్ మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవి అప్పగించిన వారి ఆశలను వమ్ము చేయకుండా, మత్స్యకారుల, కార్మికుల సమస్యల పరిష్కరానికి అహర్నిశలు కృషిచేస్తానని తెలిపారు. మొయినాబాద్: ఇందిరమ్మ కాలంలో దళితులకు ఇచ్చిన భూములను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకోవడానికి కుట్రలు చేస్తోందని దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో సర్వేనంబర్ 218/1లో 6 ఎకరాల భూమిని కోళ్ల ఫారాల నిర్మించుకోవడానికి యాబై ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ హయాంలో గ్రామానికి చెందిన 36 మంది దళిత కుటుంబాలకు కేటాయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సదరు సర్వేనంబర్‌లోని మొత్తం ప్రభుత్వ భూమిని హెచ్ఎండీఏకు అప్పగించింది. దళితులకు కేటాయించిన భూములు సైతం అందులోనే కలిపి చదును చేస్తుండడంతో శనివారం దళితులు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. తమకు కేటాయించిన భూమిని తమకే ఇవ్వాలని.. ఇతరులకు కేటాయించొద్దని పట్టు బట్టారు. దీనిపై కలెక్టర్‌ను కలిసి తమ ఆవేదన చెప్పుకొంటామన్నారు. ఎట్టి పరిస్థితుత్లో భూములు వదులుకోమని తేల్చి చెప్పారు. భూములు గుంజుకోవాలని చూస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. -
● యాలాల మండలంలో..
యాలాల: మండలంలోని మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఆయా జీపీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు వేశారు. దీంతో వారు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. సంగెంకుర్దు పంచాయతీ జనరల్‌కు రిజర్వేషన్ ఖరారు కాగా, ఆ గ్రామానికి చెందిన సంగం సుధాలక్ష్మి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. లక్ష్మీనారాయణపూర్ జీపీ జనరల్ మహిళకు కేటాయించడంతో గుర్రాల నాగమణి ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కిష్టాపూర్ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆ గ్రామానికి చెందిన స్వప్న ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గంగాసాగర్‌లో జనరల్‌కు రిజర్వ్ కావడంతో గ్రామానికి చెందిన మల్లేశం, సంగాయగుట్టతండా ఎస్టీ జనరల్‌కి రిజర్వ్ కావడంతో కిషన్ నాయక్ ఒక్కరే నామినేషన్ వేయడంతో వారి ఎన్నిక లాంఛనప్రాయమే. సుధాలక్ష్మి (సంగెంకుర్దు) నాగమణి (లక్ష్మీనారాయణపూర్) -
సర్పంచ్ లాంఛనమే!
బషీరాబాద్: మండలంలోని మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మంతన్‌గౌడ్, హంక్యానాయక్ తండా, బాబునాయక్ తండాల్లో సర్పంచ్ స్థానానికి, అన్ని వార్డులకు ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆ స్థానాలు యునానిమస్ అయ్యాయి. స్క్రూట్నీ అనంతరం అధికారికంగా ప్రకటిస్తారు. భీమప్ప కుటుంబంలో ముగ్గురికి పదవులు మంతన్‌గౌడ్ గ్రామం ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో ఎరుకలి సామాజిక వర్గానికి చెందిన ఒకే కుటుంబం ఉంది. భీమప్ప ఒక్కరే సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. రెండు వార్డు స్థానాలు కూడా ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో భీమప్ప కొడుకు ఎరుకలి మహేష్, కోడలు ఎరుకలి సుజాతకు నామినేషన్ వేశారు. వారు గెలుపు లాంఛనమైంది. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురికి పదవులు వరించాయి. నజరానాతో.. ఏకగ్రీవ పంచాయతీల అభివృద్ధికి రూ.10లక్షలు, పెద్ద జీపీలకు రూ.20లక్షలు కేటాయిస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో హంక్యానాయక్ తండా, బాబు నాయక్‌తండా ప్రజలు గ్రామసభలు ఏర్పాటు చేసుకొని యునానిమస్ చేసుకోవాలని నిర్ణయించారు. హంక్యానాయక్ తండా నుంచి సర్పంచ్ స్థానాలకు అనిత రాథోడ్ తోపాటు 6 వార్డు స్థానాలకు ఒక్కరు చొప్పున మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. బాబునాయక్ తండా నుంచి సర్పంచ్ స్థానానికి జెర్పుల అనిత తోపాటు 8 మంది వార్డు స్థానాలకు ఒక్కరు చొప్పున మాత్రమే నామినేషన్లు వేయించారు. దీంతో అన్ని స్థానాలు ఏకగ్రావమయ్యాయి. జెర్పుల అనిత (బాబునాయక్‌తండా)అనిత రాథోడ్ (హంక్యానాయక్తండా)ఎరుకలి భీమప్ప, మహేష్, సుజాత(మంతన్‌గౌడ్) జిల్లాలో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం స్క్రూట్నీ అనంతరం అధికారిక ప్రకటన నామినేషన్ల ఉప సంహరణ నాటికి మరికొన్ని పెరిగే అవకాశంజిల్లాలో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా జీపీల్లో ఒక్కరు చొప్పున సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయడంతో గెలుపు లాంఛనమైంది. స్క్రూట్నీ అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. బషీరాబాద్ మండలంలో 3, యాలాల మండలంలో 5, దుద్యాల్, తాండూరు మండలాల్లో ఒకటి చొప్పన, పెద్దేముల్ మండలంలో 2, బొంరాస్ పేట మండలం నుంచి ఆరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉప సంహరణ నాటికి మరికొన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దుద్యాల్: మండలంలోని సంగాయిపల్లి పంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు రెండు రోజులుగా చర్చలు జరిపారు. వెంకట్‌రెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎనిమిది వార్డు స్థానాలకు కూడా ఒక్కరు చొప్పన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో వారి ఎన్నిక లాంఛనమైంది. -
విద్యార్థులు మానసిక
● మారుతున్న కాలానికి అనుగుణంగా సంసిద్ధం కావాలి ● వ్యక్తిత్వ వికాస నిపుణుడు రవిపాల్రెడ్డిఒత్తిడికి లోనుకావొద్దు తాండూరు: పదో తరగతి విద్యార్థులు పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడికి లోనుకారాదని వ్యక్తిత్వ వికాస నిపుణుడు, సిగ్మా ఐఏఎస్ అకాడమీ డైరక్టర్ బండ రవిపాల్‌రెడ్డి సూచించారు. శనివారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్లో సేవా భారతి, నిష్ట ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు భవిషత్ కార్యాచరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెన్త్ పాసైన తర్వాత ఏ కోర్సులో చేరాలనే దానిపై విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి కాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా ప్రమాణాలలో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు సంసిద్ధం కావాలని సూచించారు. రోజూ దిన పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. పరీక్షల సమయంలో చదవడంతోపాటు రాయడం కూడా చేయాలన్నారు. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. వ్యక్తిత్వ వికాసం వల్ల విజ్ఞానం పెరుగుతోందని చెప్పారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవాలన్నారు. అనంతరం సింగ్రీ అకాడమీ డైరక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. జీవితంలో విజయం సాధించాలంటూ ధైర్యం, పట్టుదల, నిరంతర సాధన అవసరం అన్నారు. నీట్, ఐఏఎస్ లాంటి పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రికే విజయలక్ష్మి, నాయకులు బాలకృష్ణ, గాజుల బస్వరాజ్, అనురాధ, రమేష్, కేవీఎం వెంకట్, వెంకట్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సుబ్బారావు, ప్రభు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే
హుడాకాంప్లెక్స్: వైకల్యమనేది శరీరానికే గానీ మనసుకు కాదని, సాధించాలనే తపన ఉండాలే గానీ ఏదైనా సాధ్యమే అని జిల్లా సంక్షేమాధికారి శ్రీలత అన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలత జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులు తమ ప్రతిభాపాటవాలు చూపడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. సుమారు 600 మంది దివ్యాంగులు ఈ పోటీల్లో పాల్గొనడం వారి మానసిక స్థైర్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. పరుగు పందెం, షాట్‌పుట్, జావెలిన్‌త్రో, క్యారమ్స్, చెస్ తదితర అంశాల్లో చిన్నారులు, పెద్దల కేటగిరీలుగా పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చినవారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన దివ్యాంగులు, వసతి గృహాల విద్యార్థులు, ఐసీడీఎస్ శాఖలోని సీడీపీఓలు, సూపర్వైజర్లు, డీఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎంత మందికి మద్దతు ఇస్తున్నారో చెప్పండి!
తాండూరు టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ స్థానాల్లో పోటీ చేసే బీసీ అభ్యర్థులకు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వనున్నారో లెక్క తేల్చాలని ఆ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అలాగే ఎంత శాతం బీసీ అభ్యర్థులను జనరల్ స్థానాల్లో నిలుపుతున్నారో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్సిస్తామని చెప్పిన కాంగ్రెస్.. వైఖరిని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ప్రస్తుతం కోర్టు తీర్పుతో అది సాధ్యం కాకపోవడం వలన పార్టీ పరంగా అయినా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉన్నందున, బీసీలు పెద్ద సంఖ్యలో జనరల్ స్థానాల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. వారి తరఫున విస్తృత ప్రచారం చేస్తామన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు కుల్కచర్ల: స్థానిక ఎన్నికల నేపథ్యంలో వాహనదారులు, ప్రజలు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎస్ఐ రమేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.50 వేలకు పైగా నగదు, బంగారం లేదా ఇతర వస్తువులు వెంట తీసుకెళ్లరాదని, తప్పనిసరిగా తీసుకెళ్లవలసి వస్తే.. వాటికి సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఎలాంటి ర్యాలీలు చేపట్టరాదని పేర్కొన్నారు. చెకుముకి పోటీల్లో విద్యార్థుల సత్తా పరిగి: చెకుముకి జిల్లా స్థాయి సైన్స్ పోటీల్లో పరిగి నంబర్ 1 ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కొడంగల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో శివ, రహమాన్, విశాల్‌లు ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు ఉపాధ్యాయుడు వెంకటయ్య అభినందించారు. విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ అనంతగిరి: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జి ల్లా పరిధిలోని 27 పీఎంశ్రీ స్కూళ్ల ద్వారా స్పో ర్ట్స్ మీట్‌ను శుక్రవారం వికారాబాద్‌లోని సె యింట్ జూడ్స్ హై స్కూల్లో ప్రారంభమైంది. ఇందులో 27 పాఠశాలల నుంచి 867 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఫుట్ బా ల్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ నిర్వ హించారు. డీఈఓ రేణుకాదేవి, పీడీలు, ఉపా ధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొనసాగుతున్న పూజలు తాండూరు రూరల్: మండల పరిధిలోని అంతారం గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో నూతనంగా ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ సందర్భంగా హోమం, దేవతమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. -
ఆరబెట్టిన ధాన్యానికి సూచిక ఏర్పాటు
దుద్యాల్: మండలంలోని చిలుముల్ మైల్వార్ నుంచి గౌరారం వెళ్లే ప్రధాన రోడ్డుపై రైతులు ఆరబెట్టిన ధాన్యం రాశులకు పోలీసులు సూచికలు ఏర్పాటు చేశారు. రాత్రివేళలో కవర్లు కప్పడంతో వాహనదారులకు రోడ్డుపైన ఉన్న ధాన్యం కుప్పలు కనబడడం లేదు. దీంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఇటీవల సాక్షి దినపత్రికలో ‘రోడ్డుపై ధాన్యం.. ప్రమాదాలకు ఆహ్వానం’ అనే శీర్షికతో కథనం ప్రచూరితమైంది. దీంతో స్పందించిన పోలీసులు శుక్రవారం రాత్రి అటుగా వెళ్తున్న వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు చోటు చేసుకుండా రేడియం నియంత్రికలు ఏర్పాటు చేశారు. ఎస్ఐ శ్రీశైలం మాట్లాడుతూ రోడ్లపై ధాన్యాన్ని త్వరగా తొలగించాలని రైతులకు సూచించారు. ఆయన వెంటన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య ఉన్నారు. -
గ్రామ పోరు.. జ్ఞాపకాలు అదురు
పల్లెల్లో ప్రస్తుతం ఎన్నికల హడావుడి మొదలైంది. స్వాతంత్య్రం తొలినాళ్లలో ఏర్పాటు చేసిన పంచాయతీ సమితి వ్యవస్థను ప్రధాని హాదాలో జవహర్లాల్ నెహ్రూ షాద్‌నగర్ ప్రాంతంలో ప్రారంభించారు. అనంతరం 61 ఏళ్ల కిందట పంచాయతీ వ్యవస్థ రూపుదాల్చుకోవడంతో గ్రామాల్లో సమర్థ పాలనకు అంకురార్పణ ఏర్పడింది. తాజాగా స్థానిక సంస్థల పోరు నేపథ్యంలో ఆ ప్రస్తానాన్ని ఓసారి నెమరేసుకుందాం. షాద్‌నగర్: భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు షాద్‌నగర్ ప్రాంతానికి వీడదీయలేని బంధం ఉంది. తొలి పంచాయతీ సమితిని ఇక్కడే ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం అనంతరం పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు కోసం 1957లో ప్రభుత్వం బల్వంత్రాయ్ మెహతా కమిటీని నియమించింది. పరిపాలన వికేంద్రీకరణతోనే దేశంలో పాలన సమర్థవంతంగా సాగుతుందని కమిటీ భావించింది. అందుకు మూడంచెల విధానాన్ని (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) సిఫారసు చేసింది. 1958లో ఈ విధానాన్ని జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించింది. మూడంచెల విధానాన్ని దేశంలో తొలిసారిగా రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో 1959 అక్టోబర్ 2న అమలు చేశారు. అదే ఏడాది నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ వ్యవస్థను అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్న షాద్‌నగర్‌లో తొలిసారిగా ప్రధాని నెహ్రూ లాంఛనంగా ప్రారంభించారు. తెలుగులోకి పీవీ అనువాదం పంచాయతీ సమితిని నెహ్రూ ప్రారంభించేందుకు ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావులతో కలిసి వచ్చారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వారికి స్వాగతం పలికారు. నెహ్రూ హిందీలో చేసిన ప్రసంగాన్ని పీవీ తెలుగులో అనువాదం చేశారు. అంబేడ్కర్ కాలనీలో అప్పట్లో ఏర్పాటు చేసిన వేదికపై ఆయన ప్రసంగించారు. బ్లాక్ ఆఫీస్‌గా ఏర్పాటు చేసిన ఇప్పటి మండల పరిషత్‌లో పార్కు మధ్యలో నీటిని చిమ్మే తారమ కొలను, ఎదురుగా సాంస్కృతిక ప్రదర్శనల నిమిత్తం కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత మండల పరిషత్ కార్యాలయమే అప్పటి పంచాయతీ సమితి కార్యాలయం. తొలి పంచాయతీ సమితి అధ్యక్షుడిగా కొత్తూరు మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన రాందేవ్‌రెడ్డి ఎన్నికయ్యారు. నాటి నుండి 1984 వరకు పంచాయతీ సమితి ఆదర్శవంతంగా కొనసాగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ మండలాల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పంచాయతీ సమితులు రద్దయ్యాయి. తాలూకాగా ఉన్న షాద్‌నగర్‌ను నాలుగు మండలాలుగా విభజించారు. ఫరూఖ్‌నగర్, కొత్తూరు, కేశంపేట, కొందుర్గు ఏర్పాటయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం నందిగామ, చౌదరిగూడ మండలాలను కొత్తగా ఏర్పాటు చేసింది. నెహ్రూ ప్రారంభించిన మూడంచెల విధానం షాద్‌నగర్‌లో మొదటి పంచాయతీ సమితి ఏర్పాటు 1978 నుంచి సర్పంచులకు ప్రత్యక్ష ఎన్నిక మొదట్లో పరోక్ష పద్ధతి ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్‌లో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీ చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం 500 జనాభా ఉన్న గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభాను బట్టి 5 నుంచి 17 వరకు వార్డు సభ్యులుండవచ్చని పేర్కొన్నారు. 1964లో సర్పంచ్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటే, వారు సర్పంచులను ఎన్నుకునే వారు, ఎన్నికై న సర్పంచులు కలిసి పంచాయతీ సమితి ప్రెసిడెంట్‌ను ఎన్నుకునేవారు. సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. 1978లో నర్సింహ కమిటీ సర్పంచులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్‌లకు నేరుగా ఎన్నుకుంటున్నారు. -
ప్రారంభించి.. పాతరేసి!
బషీరాబాద్: పత్రి గింజను కొంటామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మీద రాతలుగా మారాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పట్టించుకోకపోవడంతో అన్నదాతలు కలవరపాటు గురవుతున్నారు. మండలంలోని కాశీంపూర్ వరి కొనుగోలు కేంద్రంలో ధాన్యం భారీగా చేరుతుంది. ఈ సెంటర్ ప్రారంభించి 12 రోజులు గడిచినా ఐకేపీ సిబ్బంది తూకాలు ప్రారంభించక పోవడంతో వడ్ల రాశులు పేరుకుపోయాయి. దీంతో రైతులు చలికి వణుకుతూ రాత్రింబవళ్లు కాపల కాస్తున్నారు. మండలంలోని మంతట్టి, రెడ్డిఘణాపూర్, కాశీంపూర్, బాద్లాపూర్, కుప్పన్‌కోట్, గొట్టిగ తదితర గ్రామాల్లో గత 15 రోజులుగా వరి కోతలు ప్రారంభించారు. విక్రయం కోసం రైతులు ధాన్యం బస్తాలు కేంద్రం దగ్గర నిల్వ చేశారు. చలికి వడ్లు మరింత తేమ పెరగడంతో పగటి పూట ఎండకు ఆరబెట్టి రాత్రికి టార్పలిన్లు కప్పుతున్నారు. తూకాలు వేయమని ఐకేపీ సిబ్బందికి అడిగితే రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. కన్నెత్తి చూడని అధికారులు గ్రామ శివారులోని ఓ పొలంలో ఈ నెల 16న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని కాశీంపూర్ ఐకేపీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఐకేపీ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని రైతులు చెబుతున్నారు. గ్రామ సంఘం నాయకులు లారీలు లేవు, అధికారులు ఏం చెప్పలేదని సాకులు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారు. దీంతో కేంద్రంలో 500 బస్తాల ధాన్యం పేరుకుపోయింది. 12 రోజులైనా తూకాలు వేయని ఐకేపీ కాశీంపూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు చలిలో సెంటర్ల వద్ద రైతుల పడిగాపులు పట్టించుకోని అధికారులు లేబర్ లేక ఇబ్బంది ధాన్యం తూకాలు వేసిన వెంటనే మిల్లులకు రవాణా చేయడానికి ఇంకా లారీలు రాలేవు. పనిచేసే లేబర్ కూడా లేరు. రైతులు నాలుగైదు రోజుల నుంచే ధాన్యం తీసుకువస్తున్నారు. రెండు రోజుల్లో తూకాలు ప్రారంభిస్తాం. రైతులకు ఇబ్బంది రానివ్వకుండా కృషి చేస్తాం. – పద్మరావు, ఏపీఎం, బషీరాబాద్ అమ్ముకోవడం కష్టమైంది ఐదు రోజుల కిందట 140 బస్తాల ధాన్యం అమ్మడానికి తీసుకు వచ్చాను. తూకాలు వేయాలని అధికారులకు అడిగితే రేపు మాపు అంటున్నారు. చాలా మంది రైతులం రాత్రికి చలిలో ధాన్యం దగ్గర పడుకుంటున్నాం. పంట పండించడం కంటే అమ్ముకోవడం కష్టమైంది. – ఈరప్ప, రైతు, మంతట్టి -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
పరిగి: సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు అన్నారు. శుక్రవారం మండలంలోని ఆయా పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు ఏళ్లు గడుస్తున్నా బకాయిలు ఇవ్వడం లేదన్నారు. దీంతో వారు దిగులు చెందుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులను విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల డబ్బులు సకాలంలో అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూటీఎఫ్ నిత్యం ఉపాధ్యాయులు, విద్యా సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు దశరథ్, నాయకులు మోయిజ్‌ఖాన్, వెంకటయ్య, బుచ్చయ్య, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు -
నామినేషన్ సజావుగా నిర్వహించాలి
తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ట్రైనీ కలెక్టర్(ఎన్నికల పరిశీలకుడు) చంద్రకిరణ్ అన్నారు. శుక్రవారం మండలంలోని గౌతపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి క్లస్టర్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. సర్పంచు, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ పత్రాల్లో ఏమైన ప్రశ్నలు ఉంటే నివృత్తి చేయాలని ఆదేశించారు. శనివారంతో నామినేషన్ ముగుస్తుండటంతో ఆర్ఓ, అసిస్టెంట్ ఆర్ఓలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ విశ్వప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు వీరప్ప, ఫక్రోజీ తదితరులు ఉన్నారు. ట్రైనీ కలెక్టర్ చంద్ర కిరణ్ -
కుల ధ్రువీకరణ పత్రాల కోసం నిరీక్షణ
కొందుర్గు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం అనేక అవస్థలు పడుతున్నారు. శుక్రవారం పత్రాల కోసం దరఖాస్తు చేయడానికి మీ సేవల్లో క్యూ కడుతున్నారు. కాగా మీ సేవల్లో సర్వర్ పనిచేయకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ అజాం అలీని వివరణ కోరగా సర్వర్ పనిచేయకపోవడమనే సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నారు. రాత్రివేళల్లో పనిచేయవచ్చని తెలిపారు. ఇంకా ఒకరోజు సమయం ఉందని, ఒకవేళ పనిచేయకపోతే మాన్యువల్ సర్టిఫికెట్ ఇస్తామని పేర్కొన్నారు. -
దివ్యాంగుల ప్రేరణకు క్రీడాపోటీలు
అనంతగిరి: మహిళాశిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్‌లోని బ్లాక్ గ్రౌండ్లో జిల్లాలోని దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి మాట్లాడుతూ.. సమాజంలో దివ్యాంగులు సాధారణ పౌరులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారన్నారు. దివ్యాంగుల తల్లిదండ్రుల కన్నా టీచర్లు, గార్డియన్లు తోడుగా నిలిచి వారికి సకాలంలో సరైన ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. ఇలాంటి వేడుకలు నిర్వహించడం ద్వారా దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా మనోస్థైర్యం పెరుగుతుందన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న వారందరూ రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైన విజయాలను సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ కాంతారావు, సంబంధిత శాఖల సిబ్బంది పీఈటీలు, జిల్లాకు చెందిన దివ్యాంగుల సంఘాల నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
తాండూరు రూరల్: అఽధికార కాంగ్రెస్ పార్టీపై పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కరన్‌కోట్, మల్కాపూర్, సంగెంకలాన్, గౌతాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా తిరిగారు. కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాండూరు మండలం బీఆర్ఎస్కు కంచుకోట అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మోసం చేసిందన్నారు. పింఛను మొత్తం రూ.4 వేలకు పెంచుతామని మాయమాటలు చెప్పిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారు. సంగెంకలాన్ గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి కామిని మీనాక్షిని గెలిపించాలని గ్రామస్తులకు కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, నాయకులు రత్నాకర్, రాజేందర్‌రెడ్డి, సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్‌చారి, సునీల్, రాజప్పగౌడ్, శకుంతల తదితరులు పాల్గొన్నారు. -
గుర్తులు వచ్చేశాయ్!
సర్పంచ్ అభ్యర్థుల గుర్తులుబషీరాబాద్: పార్టీ రహితంగా జరిగే పంచాయ తీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గుర్తులు కేటాయించింది. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థుల కు అనుబంధం ఒకటిలో 30 గుర్తులు కేటాయించారు. అనుబంధం 2లో వార్డు సభ్యులకు 20 రకాల గుర్తులు పొందుపరిచారు. అయితే బ్యాలెట్ పేపర్లో చివరి గుర్తుగా నోటా(పై వేవి కావు) అనే సింబల్‌ను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా డిసెంబర్ 3న విడదల చేయడంతో పాటు పోటీదారులకు గుర్తులు కేటాయిస్తారు. డిసెంబర్ 11న మొద టి విడతలో 262 పంచాయతీలకు, 2,198 వార్డుల కు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చకచకా చేస్తున్నారు. వార్డుసభ్యుల గుర్తులు వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు బ్యాలెట్ పత్రంలో గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటీ నా, గరాటా, మూకుడు, ఐస్ క్రీం,గాజు గ్లాసు, పోస్టుడబ్బా, కవ ర్, హాకీ కర్ర బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కేటిల్ గుర్తులను కేటాయించారు. ఈ గుర్తుల బ్యాలెట్ పత్రాల ముద్రణకు జిల్లా ఎన్నికల అధికారి టెండర్లు పిలువనున్నారు. సర్పంచ్ అభ్యర్థి గుర్తులివే.. ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్ బాల్, లేడీ పర్సు, టీవీ, రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, నల్ల బోర్డు, బెండకాయ, కొబ్బ రి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మాన్, మనిషి మరియు తెరచాపతో కూడిన పడవ, బిస్కట్, వేణువు, చెయిన్, చెప్పులు, గాలి బుడగ, స్టంప్స్ గుర్తులు ఉన్నాయి. -
వ్యూహాలకు పదును!
ఉనికి కోసం ప్రతిపక్షాల ఆరాటంవికారాబాద్: పంచాయతీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కార్యాచరణ మొదలు పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పల్లె పోరులో సైతం సత్తా చాటాలని అధికార హస్తం పార్టీ పట్టుదలతో ఉంది. మెజార్టీ జీపీలను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకరావాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలకు పరీక్ష లాంటిదని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఎక్కువ మంది సర్పంచులు, వార్డు సభ్యులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో మరింత బలపడేందుకు.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు సెగ్మెంట్లో కేవలం ఆరు వేల ఓట్లతో ఆ పార్టీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వికారాబాద్‌లో 10వేల ఓట్లతో స్పీకర్ ప్రసాద్‌కుమార్ గెలుపొందగా.. పరిగిలో రామ్మోహన్‌రెడ్డి 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి 32 వేల భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయావకాశాలపై ఆ పార్టీ సహజంగానే భారీ అంచనాలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే వ్యూహాలను పదును పెట్టి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. మెజారిటీ సర్పంచ్ స్థానాలను తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఒక్కో పంచాయతీలో ఒక అభ్యర్థే సర్పంచ్ బరిలో ఉండేలా ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించింది. పార్టీ గుర్తులపై కాకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రజల్లో పలుకుబడి, మంచి పేరున్న వ్యక్తులనే బరిలో దింపాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. సర్పంచులుగా పోటీ చేసేందుకు ఒకే పార్టీ నుంచి పలువురు ఆశావహులు ఉంటే వారికి త్వరలో జరగనున్న సహకార, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పించే విధంగా నచ్చజెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. మండల స్థాయిలో ముఖ్య నేతల ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పార్టీ ద్వారా అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించే ప్రయ త్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, రూ.500 గ్యాస్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత కరెంటు, సన్నబి య్యం తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏకగ్రీవాలపై కాంగ్రెస్ ఫోకస్ ఏకగ్రీవ పంచాయతీలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వ తరఫున రూ.10 లక్షలు నజరానా ఇవ్వనుంది. ఈ మొత్తంతోపాటు ఎమ్మెల్యే నిధుల నుంచి మరో రూ.10 లక్షలు కేటాయించేందుకు సిద్ధమైంది. ఈ ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ‘హస్త’గతం కోసం అధికార పక్షం ఆరాటం అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని మూటగట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. జిల్లాలోని నాలుగు స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఎక్కువ మంది సర్పంచులను గెలిపించుకోవడం ద్వా రా మిగతా ఎన్నికల్లో సత్తా చాటవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. ఆ దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదనే చెప్పాలి. భారతీయ జనతా పార్టీ, సీపీఐ, సీపీఎం పార్టీలు సైతం తమ అభ్యర్థులను బరిలో దించాలని భావిస్తున్నాయి. -
నాపరాతి పరిశ్రమకు సహకారం
తాండూరు: నాపరాతి పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు స్టోన్ మర్చంట్, క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. తాండూరు నాపరాతి నిక్షేపాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత జోడించి నాపరాయిని మెరుగు పర్చాలన్నారు. తాండూరు పట్టణంలో లారీల పార్కింగ్‌కు స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకోసం స్థలం కేటాయించడం జరిగిందన్నారు. టీజీ ఐఐసీ ద్వారా ఆటోనగర్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తాండూరు స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడిగా నయిం, ఉపాధ్యక్షులుగా సత్తార్, విజయరామారావు, ప్రధాన కార్యదర్శిగా కుంచం మురళీధర్, సంయుక్త కార్యదర్శులుగా సయ్యద్ హబీబ్‌లాల, బ్రిజ్ మోహన్ బూబ్, ట్రెజరర్‌గా సంజీవ్‌కుమార్ తోపాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడిగా అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షులుగా ఓం ప్రకాష్ సోమాని, మహ్మద్ అన్వర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ జుబేర్ పాష, సంయుక్త కార్యదర్శులుగా శరణుబసప్ప, హర్షవర్దన్‌రెడ్డి, ట్రెజరర్‌గా మహ్మద్ జైనుద్దిన్ తోపాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో గనుల శాఖ ఏడీ సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, అజయ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘లక్నాపూర్’ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
పరిగి: లక్నాపూర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్నాపూర్ ప్రాజెక్టుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తామని తెలిపారు. ప్రాజెక్టులో అదనపు బోట్ల కోసం రూ.96 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. త్వరలో గెస్ట్ హౌస్‌లు కూడా నిర్మిస్తామన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో టాటా సంస్థ ఆధ్వర్యంలో ఇండస్ట్రీయల్ అడ్వన్స్ ట్రైనింగ్ సెంటర్‌ను రూ.60 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. త్వరలో మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.20 కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, పరిగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి పంతులు, నాయకులు శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
అనంతగిరి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. శుక్రవారం వికారాబాద్‌లోని తన కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీస్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నందున పక్కాగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 582 గ్రామాల్లో 4,956 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు రవాణా జరిగే ఆస్కా రం ఉన్నందున తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లను గుర్తించి అదనపు బలగాలను మోహరించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పాత నేరస్తులు, రౌడీ షీటర్లను ముందుగానే బైండోవర్ చేయాలన్నారు.గన్ లైసెన్స్ కలిగిన వ్యక్తుల నుంచి వెంటనే ఆయుధాలను డిపాజిట్ చేసుకోవాలన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్, డీటీసీ డీఎస్పీలు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, ఎన్ యాదయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
అనంతగిరి: పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమవుతుందని ఎంపీడీఓ వినయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం కార్యాలయ ఆవరణలో ఆర్ఓ, ఏఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు నియమావళిపై, దర ఖాస్తుల ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీఓ దయానంద్, ఎంఈఓ బాబు సింగ్, సూపరింటెండెంట్ శాంత పాల్గొన్నారు. -
నిర్వహించాలి
ఎన్నికలు సజావుగా తాండూరు: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా అధికారులు ప్రత్యేకశ్రద్ధ వహించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలం మన్సన్పల్లి,మంబాపూర్ కందనెల్లి గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ పత్రాల్లో తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఎన్నికల ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు. నిబంధనల మేరకు అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రతన్‌సింగ్, అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు యాలాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చేపడుతున్న నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో ఇబ్బందులు లేకుండా ఆర్ఓలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. గురువారం మండలంలోని కోకట్ క్లస్టర్ పరిధిలో ఉన్న నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అభ్యర్థులకు ధ్రువపత్రాలు, ఎన్నికల సమయంలో ఖర్చుపెట్టే వివరాల నమోదు, సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ నిబంధనలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. గ్రామ పంచాయతీకి పోటీ చేసే అభ్యర్థులకు బ్యాంకు ఖాతాలు తప్పక ఉండాలన్నారు. నామినేషన్ ఫారాలు నింపే సమయంలో అభ్యర్థులు తప్పులు లేకుండా నింపేలా సూచనలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి శ్రీనిజ, ఆర్ఓలు ఉన్నారు. -
కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆడిట్
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం 2022 – 23, – 24 విద్యా సంవత్సరాలకు సంబంధించి అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. శ్రీనివాస్‌రెడ్డి, అకడమిక్ అడ్వయిజర్లుగా తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వసంతకుమారి, చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం రమేష్ ఆ ప్రక్రియ చేపట్టారు. కళాశాలలో వసతులపై వసంతకుమారి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అకడమిక్ ఆడిట్ విద్యా సంస్థల్లోని నాణ్యతను, ప్రమాణాలను సమగ్రంగా మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక అమలు, పరిశోధన, పరిపాలనా పనులు, తగు సూచనలు ఇవ్వడానికి ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. అనంతరం కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అకాడమిక్ ఆడిట్‌తో కళాశాలకు ఎంతో మేలు కలుగుతుందని, లోటు పాట్లను తెలుసుకోవడంతోపాటు ప్రమాణాల పెంపునకు దోహదం చేస్తుందన్నారు. అడ్వయిజర్ల సూచనలు పాటిస్తూ కళాశాల అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రఫియా ఖానమ్, అకడమిక్ కో ఆర్డినేటర్ టి.రాంబాబు, అధ్యాపక, అద్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. జ్యోతిబాపూలే మార్గంలో నడుద్దాం తాండూరు టౌన్: రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిబాపూలే ఎంచుకున్న మార్గంలోనే నడుద్దామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. శుక్రవారం పూలే వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కుల వ్యవస్థ నిర్మూలన, బాలి కా విద్య, సమానత్వం కోసం పూలే చేసిన పోరా టం అనిర్వచనీయమన్నారు. అణగారిని బడు గు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లోనూ రాణించాలనే ఆయన బలీయమైన కోరిక ఎందరికో స్ఫూర్తి దాయకమన్నారు. నేటి యువత ఆయన పోరాటాన్ని అనుసరిస్తూ సమసమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, బస్వరాజ్, పరమేష్, రాజు, శ్రీనివాస్, ఆనంద్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆ ఆంక్షలు వెనక్కి తీసుకోవాలి తాండూరు టౌన్: అయ్యప్ప మాల ధరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ, హిందూ సంఘాలు పేర్కొన్నాయి. శుక్రవారం ఈ మేరకు బీజేపీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అయ్యప్ప మాల వేసిన పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. హిందువుల ఆరాధ్య దైవం అయ్యప్ప మాలఽ వేయడం నేరం కాదన్నారు. హిందూ మతంపై కక్ష గట్టి మాల వేసిన పోలీసులపై చర్యలకు పూనుకోవడం సబబు కాదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇట్టి విషయాన్ని పరిశీలించి ఆంక్షలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశం, అయ్యప్ప గుడి కమిటీ స్వాములు మనోజ్, శ్రావణ్, సంతోష్ గౌడ్, వెంకటేష్, వీహెచ్‌పీ, బజరంగ్దళ్, హిందూ వాహిని, విశాల్ హిందూ సంఘాల సభ్యులు శ్రీనివాస్, రామకృష్ణ, వినోద్, భద్రేశ్వర్, చంద్రశేఖర్, శ్రీహరి, కిరణ్, కృష్ణ, ప్రకాష్, ప్రహ్లాద్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
● జిల్లా ఎన్నికల పరిశీలకులు షేక్ హాస్మిన్ బాషా ● నామినేషన్ కేంద్రాల పరిశీలన బొంరాస్‌పేట: గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు షేక్ హాస్మిన్ బాషా, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. గురువారం ఎన్నికల వ్యయ పరిశీలకుడు మనోహార్ రాజుతో కలిసి వారు మండల కేంద్రంతో పాటు తుంకిమెట్ల, దుప్చర్ల, మహాంతిపూర్, జానకంపల్లి, బోట్లవానితండా, నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. నామినేషన్ల దాఖలు చేసే క్రమంలో కావాల్సిన ధ్రువప్రతాలను సమర్పణను అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. నామినేషన్ల ఫారాలను స్పష్టంగా చూసి వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే విధంగా సహకరించాలన్నారు. అభ్యర్థుల ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు. అభ్యర్థుల వ్యయ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సమర్పించాలన్నారు. ఖర్చులను వివరాలను సమర్పించాలని లేనిపోతే గెలుపు రద్దు అవుతుందనే విషయాలను గుర్తు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అఽధికారి జయసుధ, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ వెంకన్న గౌడ్, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పేలిపోయిన వాషింగ్ మిషన్
అమీర్‌పేట: అమీర్‌పేట ధరం కరం రోడ్డులోని ఓ ఇంట్లో ఎల్జీ వాషింగ్ మిషన్ పేలిపోయింది.పెద్ద శబ్దం రావడంతో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళకు గురై బయటకు పరుగులు తీశారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేకే ఎన్క్లేవ్ ఫ్లాట్ నెం.503లో గురువారం మధ్యాహ్నం ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషిన్ నడుస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వాషింగ్ మిషన్ పేలిపోయింది. ఈ సమయంలో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. తేరుకుని బాల్కానీలోనిలోకి వచ్చి చూడగా వాషింగ్ మిషన్ ఎక్కడికక్కడ విరిగి పోయి విడిబాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. లోపలి పేలుడు ధాటికి లోపల అత్యంత బరువుగా ఉన్న బ్యాటరీ సీలింగ్ తగిలి కింద పడిపోయింది.పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డామని మహిళ వాపోయింది. షార్ట్‌సర్క్యూట్ జరిగి కరెంటు వైర్లు కాలిపోతే ఇంట్లో అంతటా మంటలు వ్యాపించి కాలిబూడిదయ్యేదని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియరాలేదని,బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
వీధి కుక్కల వీరంగం
● దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలు ● మున్సిపల్ అధికారులపై స్థానికుల ఆగ్రహం తాండూరు టౌన్: పట్టణం పరిధిలోని మల్‌రెడ్డిపల్లిలో వీధి కుక్కలు గురువారం స్వైర విహారం చేశాయి. ఉదయాన్నే వీఽధిలో వెళ్తున్న వారిపై దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కల నియంత్రణలో మున్సిపల్ అధికారులు విఫలమైనట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్రెడ్డిపల్లికి చెందిన దొడ్ల శ్రీనివాస్ తెల్లవారుజామున పాలు పితికి తీసుకుని వస్తుండగా వీధి శునకాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈదాడిలో ఆయన ఎడమ అరచేయికి తీవ్ర గాయాలమైంది. వీధి గుండా నడుచుకుంటూ వెళ్తున్న భీమప్ప, వెంకటమ్మ, జగదేవిలను సైతం దాడి చేసి గాయ పరిచాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. వీధి శునకాల నియంత్రణలో భాగంగా వందల సంఖ్యలో స్టెరిలైజేషన్ చేశామని మున్సిపల్ అధికారులు గొప్పలు చెప్పుకోవడమే తప్పా క్షేత్ర స్థాయిలో అలాంటిదేమీ లేదని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు వీధి కుక్కల నియంత్రణ చేపట్టకపోతే కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని పలువురు హెచ్చరించారు. -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
యాలాల: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన యాలాల మండల కేంద్రంలో గురువారం వెలుగు చూసింది. ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల గ్రామానికి చెందిన గుదిగే బాలకిష్టయ్య(39) బుధవారం సాయంత్రం ఇంట్లోంచి వరి కల్లం వద్దకు వెళుతున్నట్లు చెప్పి వెళ్లాడు. మరుసటి రోజు ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికారు. ఎక్కడ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో గ్రామ శివారులోని పర్దె కుంట గట్టుపై బాలకిష్టయ్యకు సంబంధించిన బట్టలు, సెల్‌ఫోన్‌ను గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందడంతో పర్దెకుంటలో ఎస్ఐ విఠల్‌రెడ్డి చెరువులోకి దిగి గాలింపు చేపట్టగా మృతదేహాం లభ్యమైంది. మృతుడికి భార్యతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
హే బాలాజీ.. ఏమిటీ దుస్థితి
● చెప్పులతో లోపలికి ప్రవేశిస్తున్న షూటింగ్ సిబ్బంది ● పట్టించుకోని దేవాదాయ అధికారులు పహాడీషరీఫ్: మామిడిపల్లిలోని ప్రాచీనమైన బాలా జీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అపవిత్రంగా మారుతోంది. దాతల సహకారంతో నూతన సొబగులతో తీర్చిదిద్దబడుతున్న ఈ ఆలయాన్ని అధికారులు మాత్రం కేవలం కాసుల కోణంలోనే చూస్తున్నారు. ఆలయ పరిసరాలలో కొన్నాళ్లుగా సినిమా, సీరియల్, పాటలు, వివాహాది ఫొటోషూట్లు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఒక్కో దానికి ఒక్కో ధరను నిర్ణయించి దేవాదాయ శాఖ అకౌంట్లోనే డబ్బులు జమ చేస్తున్నారు. ఆదాయం సమకూరడం వరకు బాగానే ఉంది. కానీ ఆయా షూటింగ్‌లకు వచ్చే నటులు ఆలయం వద్ద కనీస ప్రమాణాలు పాటించడం లేదు. ఆలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా వ్రతాలు చేసే ప్రాంగణం(సాలాహారం)లో దేవతామూర్తుల చిత్రపటాలను ఏర్పాటు చేసినప్పటికీ, అందులోకి షూటింగ్ నటులు ఎంచక్కా బూట్లు, చెప్పులతో కూర్చొంటున్నారు. కొన్ని షూటింగ్‌లైతే ఆలయంలోకి భక్తులు వెళ్లేందుకు వీలు లేకుండా ప్రధాన ద్వారం ముందే చేస్తున్నారు. ఇక ఆలయ ముందు భాగంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర విగ్రహాలు కలిగిన పార్కులో గతంలో బయటే చెప్పులు వదిలి వెళుతుండగా, కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం అందరు చెప్పులతోనే అందులోకి ప్రవేశిస్తున్నారు. ఇక వివాహం కోసం ఫొటోషూట్లకు వచ్చే జంటలు ఆలయ పవిత్రతను మరింత దెబ్బతీస్తున్నాయి. ఆలయ ప్రాకారంపై ఇష్టమైన రీతిలో స్టిల్స్ ఇస్తూ ఫొటోలు దిగుతున్నారు. ఆలయ పార్కు, శ్రీకృష్ణుడి గోశాల వైపు గ్రిల్స్ విరిగిపోతున్నా కూడా అధికారులకు పట్టడం లేదు. మొత్తం మీద మానసిక ప్రశాంతత కోసం భగవంతుడి సన్నిధిలో గడిపేందుకు వస్తే ఏకాగ్రతకు భంగం కలగుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
24 రోజులుగా టోకెన్లు లేవు
● గట్టెపల్లిలో నిలిచిన ధాన్యం విక్రయాలు ● ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ధారూరు: పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో 24 రోజుల నుంచి ఒక్క బస్తా వడ్లు కొనడం లేదని మండలంలోని గట్టెపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తేమశాతం 17 వరకు రావాలని ఎండబెట్టి రాత్రి వేళల్లో పాలిథిన్ కవర్లు కప్పి కాపాడుకుంటున్నామన్నారు. ఇంతవరకు టోకెన్లు ఇవ్వకపోవడంతో కొనుగోలు కేంద్రానికి ధాన్యం సంచులు తీసుకు రాలేకపోయామన్నారు. ఏఈఓకు ఫోన్ చేస్తే స్పందించరని, ఎక్కడైన కనబడి తే ఇస్తాంలే అంటూ వెళుతున్నారని వాపోయారు. ప్రస్తుతం ఏ పొలం వద్ద చూసినా నిల్వ చేసిన వడ్లు దర్శనమిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టోకెన్ల జారీ వరి కొనుగోలు కేంద్రం చేసినప్పటి నుంచి వడ్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హరిదాస్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సీఈఓ రవికుమార్ పేర్కొన్నారు. రైతులకు కావాల్సిన గన్ని బ్యాగులు సైతం సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. టోకెన్ల పుస్తకం రాకపోవడంతో జాప్యం జరిగిందని, ప్రస్తుతం టోకెన్లు జారీ చేస్తున్నామని ఏఈఓ సంతోష్ వివరణ ఇచ్చారు. -
ప్రాణం తీసిన అజాగ్రత్త
నవాబుపేట: మద్యం మత్తులో అజాగ్రత్త, అతి వేగంగా వచ్చిన కారు డ్రైవర్ ఓ బైక్‌ను ఢీ కొట్టిన సంఘటన మండల పరిధిలోని మైతాప్ఖాన్గూడలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైకిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల మహేందర్‌రెడ్డి తన బైక్‌పై గురువారం రాత్రి మైతాప్ఖాన్గూడకు వెళ్తున్నాడు. అదే సమయంలో చక్రంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారులో మైతాప్‌ఖాన్‌గూడ నుంచి దేవరంపల్లి వైపు వెళుతున్నాడు. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ మార్గమధ్యలో అతి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన మహేందర్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్‌ను ఢీకొట్టిన కారు అనంతరం వెనకాల వస్తున్న డీసీఎంను సైతం ఢీకొంది. తోటి ప్రయాణికులు కారు డ్రైవర్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను పారిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపినట్లు ఎస్ఐ పుండ్లిక్ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య భాగ్యమ్మ, మూడేళ్ల కొడుకు ఉన్నారు. ● బైక్‌ను ఢీకొట్టిన కారు ● అక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం -
నగర విస్తరణ.. నేతల అచేతన!
హైదరాబాద్ మహా నగర ఖ్యాతిని విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని ఉన్న పురపాలక సంఘాలను జీహెచ్ఎంసీలోకి విలీనం చేసింది. నగర పౌరులుగా మారామన్న ఆనందం ఓవైపు అయితే, పన్నుల భారంతో అవస్థలు పడతామని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు స్థానిక నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మారుతామని నిరాశలో కూరుకుపోతున్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీ ఒకప్పుడు కుగ్రామం. కనీసం ఆ ఊరికి బస్సు సౌకర్యం కూడా ఉండేది కాదు. ప్రస్తుతం ఆదిబట్ల అంటే హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనం. మినీ గచ్చిబౌలిగా పేరు గాంచింది. ఐటీ సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలకు నిలయంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ ఆదిబట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఆయన హయాంలోనే ప్రతిష్టాత్మకమైన టాటా సంస్థను ఇక్కడికి తీసుకురావడంతో అభివృద్ధి పరుగులు పెట్టింది. అప్పటి ఆదిత్యనగర్ కాస్త కాలక్రమంలో ఆదిబట్లగా పేరు ప్రఖ్యాతలు పొందింది. 2018లో మున్సిపాలిటీగా ఏర్పాటు ఆదిత్యనగర్ కాస్త స్థానిక నేతల చొరవతో ప్రత్యేక గెజిట్ తీసుకొచ్చి ఆదిబట్లగా పేరు మార్చారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఆదిబట్లను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. అప్పటి వరకు ఇబ్రహీంపట్నం మండలంలో భాగమైన ఆదిబట్ల పురపాలక సంఘంగా రూపాంతరం చెందింది. రాందాస్‌పల్లి, బొంగ్లూర్, కొంగరకలాన్, మంగళ్‌పల్లి, ఎంపీపటేల్‌గూడ, ఆదిబట్లలను కలుపుతూ 15 వార్డులుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 15,453 మంది జనాభా ఉంది. ప్రస్తుతం 20 వేలు దాటింది. 2020 జనవరి నెలలో పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. మొదట చైర్‌పర్సన్‌గా కొత్త ఆర్తిక, వైస్ చైర్‌పర్సన్‌గా కోరె కళమ్మ పని చేశారు. తదనంతరం 2024 ఏప్రిల్ 6న జరిగిన ఉప ఎన్నికల్లో చైర్మన్‌గా మర్రి నిరంజన్‌రెడ్డి, వైస్ చైర్మన్ కమాండ్ల యాదగిరి ఎన్నికయ్యారు. ఇక రాజకీయ నిరుద్యోగమే ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో వీలినం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆదిబట్లలో నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మారనున్నారు. మహా నగరంలో కలిస్తే కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకే అవకాశం ఉంటుంది. అది కూడా ఎక్కువ ఓటర్లకు కలిపి ఒక వార్డును ఏర్పాటు చేస్తారు. దీంతో రాజకీయ ఆశావహులకు భంగపాటు తప్పదు. ఇప్పటివరకు ఆదిబట్ల నుంచే అత్యధికంగా పని చేసిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం మండలానికి ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా పాశం లక్ష్మీపతిగౌడ్, మర్రి నిరంజన్‌రెడ్డి, భూపతిగళ్ల మహిపాల్, డొంకని పద్మ, పొట్టి అయిలయ్య పని చేశారు. 15 వార్డుల నుంచి అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉండేది. కానీ జీహెచ్ఎంసీలో వీలినం కావడంతో ఇబ్బందులు తప్పదు. జీహెచ్ఎంసీలో ఔటర్ పరిధిలోనిమున్సిపాలిటీల విలీనం స్థానికంగా పెరగనున్న రాజకీయ నిరుద్యోగులు పూర్తిగా అభివృద్ధి కాకముందే కలపడంపై మిశ్రమ స్పందన పన్నుల భారం మోపొద్దని ప్రజల విజ్ఞప్తులు మరింత అభివృద్ధి ఆదిబట్ల మున్సిపాలిటీ అస్తిత్వం దెబ్బతీయకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తగిన ప్రాధాన్యం ఇచ్చే విధంగా కృషి చేస్తాం. జీహెచ్ఎంసీలో విలీనంతో మరింత అభివృద్ధి చెందుతుంది. కొంత పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతుంది. – నిరంజన్‌రెడ్డి, మాజీ చైర్మన్, ఆదిబట్ల ప్రజలపై భారం వేయొద్దు ప్రజలపై భారం వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇంటి అద్దెలు, నల్లా బిల్లు లు, వివిధ రకాల పెంచితే సహించేది లేదు. పూర్తిగా అభివృద్ధి కాకముందే విలీనం చేయడం తగదు. ఇంకో దఫా మున్సిపాలిటీ ఉంటేనే బాగుండేది. – జంగయ్య, బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆదిబట్ల -
ఘనంగా శ్రీనివాస కల్యాణం
కొడంగల్: పట్టణంలో శ్రీనివాస కల్యాణాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణ పురోహితులు కిట్టు స్వామి, లక్ష్మీనారాయణ జోషిల ఆధ్వర్యంలో అభిషేకం, కల్యాణోత్సవం, హోమం తదితర పూజా కార్యక్రమాలు చేశారు. పట్టణానికి చెందిన కటుకం వెంకటేశ్, మమత దంపతుల ఆధ్వర్యంలో పూజలు జరిపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు మురహరి వశిష్ట, బాధ్యత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైభవంగా అయ్యప్పస్వామి శోభాయాత్రతాండూరు: అయ్యప్పస్వామి దేవాలయ వార్షికోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథంపై ప్రతిష్ఠించి పట్టణ వీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. వందలాది మంది భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి శోభాయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి పల్లకీ సేవ భావిగి భద్రేశ్వర దేవాలయం వరకు కొనసాగింది. ఆలయంలో అయప్ప స్వాములకు పట్టణానికి చెందిన భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ స్వప్నపరిమళ్, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బెల్టు షాపులపై కొరడా! ● ఒకేరోజు మూడు గ్రామాల్లో దాడులు ● ముగ్గురిపై కేసు నమోదు తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బెల్టు షాపులపై కొరడా ఝుళిపించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం మూడు గ్రామాల్లో బెల్టు షాపులపై కరన్‌కోట్ పోలీసులు దాడులు నిర్వహించారు. చెన్‌గేస్‌పూర్, గోపన్‌పల్లి, ఎల్మకన్నె గ్రామాల్లో కిరాణ దుకాణంలో తనిఖీలు చేశారు. అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తుండగా పట్టుకున్నారు. షాపుల్లో ఉన్న 20 లీటర్ల లిక్కర్ బీర్లను స్వాధీనం చేసుకున్నారు. కుర్వ భాగ్యమ్మ, గౌడి సుజాత, కుర్వ మల్లప్పలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో కేసులు నమోదు అయితే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. సమతుల ఆహారంతోనే ఆరోగ్యం పీహెచ్సీ డాక్టర్ శాంతి ధారూరు: ప్రతిఒక్కరూ సమతుల ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని ధారూరు పీహెచ్సీ వైద్యురాలు శాంతి పేర్కొన్నారు. వ్యాధుల బారిన పడినప్పుడు వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలని సూచించారు. గురువారం టీబీ ముక్త్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధిగ్రస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, మనం తినే ఆహార అలవాట్ల ద్వారా పలు రకాల వ్యాధులు వస్తున్నాయన్నారు. పౌష్టికాహారంతో వాటిని నియంత్రించుకోవచ్చని చెప్పారు. -
చోటా నేతల్లో నైరాశ్యం
పహాడీషరీఫ్: ఓఆర్ఆర్ లోపలి యూఎల్బీలను(అర్బన్ లోకల్ బాడీస్) జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో జల్పల్లి మున్సిపాలిటీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో నైరాశ్యం ఏర్పడింది. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ అయ్యేందుకు ఇదే సరైన అదునుగా భావిస్తున్నారు. వాస్తవానికి జల్పల్లి మున్సిపాలిటీ పాలక మండలి గడువు ఈ ఏడాది జనవరి 25వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి మాజీ కౌన్సిలర్లతో పాటు కొత్తగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇన్నాళ్ల పాటు నాయకులు క్షేత్రస్థాయిలో తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. తగ్గనున్న నాయకత్వం మున్సిపల్లో 1,12 లక్షల జనాభా, 85 వేల ఓటర్లు, 28 వార్డులు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధానమైన మూడు పార్టీలను పరిగణనలోకి తీసుకున్నా దాదాపు 100 మంది వరకు యాక్టివ్ లీడర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. కానీ మున్సిపాలిటీని జీహెచ్ంసీలో విలీనం చేస్తే సగటున 30 వేల ఓటర్లకు ఒక డివిజన్ చొప్పున, మూడు డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వెరసి 10–15 మంది నాయకులే ప్రధానం కానున్నారు. ఈ డివిజన్లలో కార్పొరేటర్‌గా పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు వెచ్చించేంత పోటీ ఉండనున్న నేపథ్యంలో మాజీ కౌన్సిలర్లు సైతం పోటీకి దూరంగా ఉండే పరిస్థితి నెలకొంది. పెరగనున్న పన్నుల భారం పెద్ద ఎత్తున సమస్యలతో కూడిన జల్పల్లి లాంటి మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్యను అధిగమించడానికి కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు అవసరమైన మేరకు యంత్రాలను కూడా సమకూర్చనున్నారు. రోడ్లు, డ్రైనేజీ లాంటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. మరోవైపు ఇక్కడి ప్రజలపై జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు పెద్ద ఎత్తున పన్నుల భారం కూడా పడే అవకాశం లేకపోలేదు. -
ఎంపీని కలిసిన నాయకులు
చేవెళ్ల: ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని పట్టణ బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం నగరంలోని ఎంపీ నివాసానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయకులు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులతో ఆయన కాసేపు మాట్లాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, విశ్రాంతి అనంతరం చేవెళ్ల పార్లమెంట్‌లోని ప్రజలను కలిసేందుకు వస్తానని చెప్పారు. నియోజకవర్గంలో పరిస్థితిలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసిమెలసిపనిచేయాలని ఎంపీ సూచించారు. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని, వార్డుసభ్యుల నుంచి బీజేపీ అభ్యర్థులు ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, జయశంకర్‌గౌడ్, కృష్ణరెడ్డి, వెంకటేశ్, సత్యనారాయణ, క్రిష్ణ, శ్రీనివాస్, అశోక్, గణేశ్, భీమ్‌రెడ్డి, రఘు, జయసింహరెడ్డి, అభిషేక్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రజలతో మర్యాదగా మెలగండి
● దోపిడీలు, దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి ● ఎస్పీ స్నేహమెహ్రపూడూరు: పోలీసులు ప్రజల పట్ల మర్యాదగా మెలగడంతోపాటు బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్పీ స్నేహమెహ్ర సూచించారు. గురువారం మండలంలోని చన్గోముల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు చేసే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. దోపిడీ, దొంగతనాలు ఇతర నేరాలపై నిఘా ఉంచాలన్నారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని తెలిపారు. సిబ్బంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ భరత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. యోగా అలవాటు చేసుకోవాలి అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో గురువారం మల్టీజోన్ –2 పరిధిలోని ఏఆర్ ఎస్ఐలకు ఆర్ఎస్ఐలుగా పదోన్నతి కల్పించేందుకు నిర్వహించిన శారీరక సామార్థ్య కార్యక్రమాన్ని ఎస్పీ స్నేహమెహ్ర పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగా, మెడిటేషన్, వ్యాయమాలు అలవాటు చేసుకుని శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలన్నారు. విధులను సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఏకగ్రీవ పంచాయతీలకు..
కాంగ్రెస్ గూటికి.. బీఆర్ఎస్ నాయకుల చేరిక తాండూరు రూరల్: నాయకులు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోతే పార్టీ పరంగా నష్టపోతామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అంతారం తండాలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా ఉండాలన్నారు. గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు అభ్యర్థులను బరిలో ఉంచరాదని సూచించారు. అనంతరం పెద్దేముల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మీరే సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విడిపోతే నష్టపోతాంరూ.20 లక్షల నజరానా తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధికార పార్టీ సర్పంచులు ఉంటేనే అభివృద్ధి సాధ్యం బషీరాబాద్‌లో పార్టీ ముఖ్యనాయకులతో భేటీ -
‘టీఈ పోల్’తో ఎన్నికల సమాచారం
● ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్ అనంతగిరి: టీఈపోల్ మొబైల్ యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ సమాచారం పొందవచ్చనని కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటరు స్లిప్పులు పొదవచ్చని, పోలింగ్ స్టేషన్ల వివరాలు తెలుసుకోవచ్చని, ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మీడియా పాయింట్ ప్రారంభం కలెక్టరేట్లో గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా తోకలిసి మీడియా పాయింట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మీడియా సెంటర్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అనంతరం షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియా పాయింట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. అనంతరం హెల్ప్ లైన్ సెంటర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు మనోహర రాజు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డీపీఆర్ చెన్నమ్మ, ఉద్యాన వన శాఖ అధికారి సత్తార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోసెస్ తదితరులు పాల్గొన్నారు. -
పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు
● ఎలక్షన్ సజావుగా నిర్వహించాలి ● ఎన్నికల సాధారణ పరిశీలకులుషేక్ యాస్మిన్ బాషా ● పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ అనంతగిరి: గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా సూచించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ స్నేహామెహ్రాతో కలిసి నోడల్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న, రెండో విడత డిసెంబర్ 14న, మూడో విడత 17న జరగనున్నట్లు వివరించారు. ఇందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆర్వోలు, ఏఆర్ఓలు, పీఓ, ఏపీఓలకు జోనల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులకు మరోసారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మెటీరియల్ మేనేజ్ మెంట్, ఎన్నికల సిబ్బంది, జోనల్ అధికారుల నియామకం, కోడ్ అమలుపై నిత్యం నివేదికలు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా ద్వారా నిర్వర్తించే విధులు సంబంధిత అధికారి చూడాలన్నారు. ఎన్నికల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 912 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, 922 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. క్లస్టర్ వారీగా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో వ్యయ పరిశీలకులు మనోహర రాజు, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
పీసీసీ చీఫ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
బీజేపీ జిల్లా కో కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి ధారూర్: జిల్లాలో బాల్య వివాహాల విముక్తి కోసం సాధన సంస్థ ఆధ్వర్యంలో ఽగురువారం ధారూర్, స్టేషన్ ధారూర్, నాగసముందర్, రాంపూర్, గడ్డమీది గంగారం, అవుసుపల్లి, కొండాపూర్ కలాన్, గట్టెపల్లి, దోర్నాల, రుద్రా రం గ్రామాల్లో విద్యార్థులు, యువకులు ర్యాలీ తీశారు. బాల్య వివాహాలు చేయడం నేర మన్నారు. కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ నర్సింలు, సభ్యులు శ్వేత, గౌరీ, అసీమాబేగం, తౌఫిక్, రోజా, శివలక్ష్మి, కన్యాకుమారి, మమ త, రమేష్, పవన్ పాల్గొన్నారు. అనంతగిరి: అనంతగిరిగుట్ట ఆలయం వద్ద టెంకాయల విక్రయానికి, వాహనాల పార్కింగ్ కోసం వేలం నిర్వహించనున్నట్లు ఆయల ఈ వో నరేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.వచ్చే ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు (కార్తీక మాసం నెల రోజులు మినహ) టెంకాయలు విక్రయించుకోవచ్చని తెలిపారు. డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు రూ.2 లక్షలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాలని సూచించారు. దుద్యాల: మండలంలో పారిశ్రామిక వాడ కోసం భూసేకరణ గడువును మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు కలెక్టర్ ప్రతీక్‌జైన్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు గురువారం తహసీల్దార్ కిషన్ తెలిపారు. గత నోటిఫికేషన్ ఈ నెల 29వ తేదీతో ముగుస్తుండటంతో మరో ఏడాది పొడిగించినట్లు తెలిపారు. 1,174 ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 934 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూమికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉండటంతో మరికొంత సమయం పట్టేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది పాటు గడువు పొడిగించినట్లు తహసీల్దార్ తెలిపారు. -
ఇక డిజిటల్ బోధన
పరిగి: రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. డిజిటల్ తరగతులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పనకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండు దశల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు పూర్తి చేసేందుకు ప్రతిపాదనలను విద్యాశాఖ రూపొందించింది. కంప్యూటర్ ఉన్న పాఠశాలలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లను ఆయా పాఠశాలకు ఇవ్వడంపై దృష్టి సారిస్తోంది. దశల వారీగా పాఠశాలలను ఎంపిక చేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. మరోవైపు బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఆలస్యమైతే ప్రైవేట్ ఇంటర్నెట్ సౌకర్యానికి అవకాశం కల్పించింది. పాఠశాలల గ్రాంటు నుంచి కనెక్షన్లు తీసుకోవాలనే ఆదేశాలపై ప్రధానోపాధ్యాయులు ఆసక్తి చూడపం లేదు. దీంతో ఇంటర్నెట్ సౌకర్యం లేక ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డులపై డిజిటల్ బోధనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇంటర్నెట్ సేవలు నిల్ పరిగి నియోజకవర్గంలో పరిగి, దోమ, కుల్కచర్ల, చౌడాపూర్, పూడూర్ మండలాలున్నాయి. నియోజవర్గంలో మొత్తం 291 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో నాలుగు కేజీబీవీ, మూడు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 44, ప్రాథమిక 222, ప్రాథమికోన్నత 23లు ఉన్నాయి. పరిగి మండలంలో మొత్తం 61 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఏ ఒక్క బడికి కూడా ఇంటర్నెట్ సౌకర్యం లేదు. దోమ మండలంలో మొత్తం70 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇంటర్నెట్ సౌకర్యం లేదు. కుల్కచర్లలో 64, చౌడాపూర్‌లో 44, పూడూరులో 50 ప్రభుత్వ పాఠశాలలు సాంకేతిక వెసులుబాటు లేదు. దీంతో డిజిటల్ బోధనకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో విద్యార్థులకు బోధన, ఆన్లైన్ రిపోర్టు తదితర పనులు పాఠశాల నుంచే నిర్వహించేందుకు వీలుంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తీరనున్న ఇబ్బందులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు లేక ఏఐ తరగతులు, యూడైస్ ప్లస్‌లో వివరాల నమోదు, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు, డిజిటల్ బోధనకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యాశాఖ పాఠశాలల్లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులు విషయాల వారీగా టాపిక్, నిపుణుల పాఠాలు వీక్షించే పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేక పోవడంతో పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డులు ఉన్నా ఆన్లైన్ తరగతులు జరగడం లేవు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల మొబైల్ ఫోన్లోని నెట్ ఆధారంగా పాఠాలు చెబుతున్నారు. ఏఐ బోధన జరుగుతున్న ఇంటర్నెట్ సౌకర్యం లేక సక్రమంగా అమలు కావడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుండటంతో పాఠశాలల్లోని సమస్యలు పరిష్కారం అవుతాయని ఉపాధ్యాయులు అంటున్నారు. నివేదిక పంపించాం మండలంలో ఒక్క ప్రభు త్వ పాఠశాలలో సైతం ఇంటర్నెట్ సౌకర్యం లేదు. కొన్నింటిలో డిజిటల్ బోధన ఉపాధ్యాయుల మొబైల్ ఫోన్ నుంచే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి ఇంటర్నెట్ లేని బడుల వివరాలను అందించాం. త్వరితగతిన సాంకేతిక సౌకర్యం కల్పించాలి. – గోపాల్, ఎంఈఓ, పరిగి సర్కార్ బడులకు ఇంటర్నెట్ సౌకర్యం దశలవారీగా అన్ని పాఠశాలలకు ఏర్పాటు కంప్యూటర్లు ఉన్న స్కూళ్లకు మొదటి ప్రాధాన్యం వివరాలను సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం
అనంతగిరి: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, అదనపు డీజీపీ మహేశ్ భగవత్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా నుంచి కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లాలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. మొదటి విడతలో తాండూరు, బషీరాబాద్, యాలాల్, పెద్దేముల్, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల్ మండలాల్లోని 262 సర్పంచ్, 2,198 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. రెండో విడతలో వికారాబాద్, ధారూరు, మోమిన్‌పేట, నవాబుపేట, బంట్వారం, మర్పల్లి, కోట్‌పల్లి మండలాల్లోని 175 సర్పంచ్, 1,520 వార్డు సభ్యుల స్థానాలకు, మూడో విడతలో పరిగి, పూడూరు, కుల్కచర్ల, చౌడాపూర్, దోమ మండలాల్లోని 157 సర్పంచ్, 1,340 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఫ్లయింగ్, స్టాటిస్టిక్, వీడియో సర్వేలెన్స్ బృందాలు, ఎంసీఎంసీ, మీడియా సెల్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్పీ స్నేహామెహ్రా, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, అడిషనల్ ఎస్పీ రామునాయక్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఆర్డీఓ వాసుచంద్ర పాల్గొన్నారు. -
అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు
అనంతగిరి: అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతాయన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా సహజ వనరులను తరలిస్తున్న వారిపై నిఘా పెంచి వివిధ పీఎస్‌ల పరిధిలో ఏక కాలంలో మెరుపుదాడులు నిర్వహించాయన్నారు. జిల్లాలో గత నాలుగు రోజుల్లో 6 ఇసుక ట్రాక్టర్లు, 3 ఎర్రమట్టి టిప్పర్లు, ఒక ఎర్రరాయి లారీ, జేసీబీలను సీజ్ చేసి, బాధ్యులపై కేసులు నమోదు చేశామని ప్రకటించారు. బషీరాబాద్ పీఎస్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లను, వికారాబాద్ పీఎస్ పరిధిలోని అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నామన్నారు. తాండూరు పీఎస్ పరిధిలో ఒక ట్రాక్టర్, యాలాల పీఎస్ పరిధిలో ఎర్రరాయిని తరలిస్తున్న లారీని పట్టుకున్నామని తెలిపారు. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుధాకర్ అనంతగిరి: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్లు, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అలిండియా కమిటీ పిలుపులో భాగంగా వికారాబాద్ నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదాలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మైపాల్, నాయకులు బుగ్గప్ప, రామకృష్ణ, చంద్రయ్య, ఆయా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. -
సంగ్రామం షురూ!
వికారాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మూడు దఫాలుగా జరగనున్న ఈ ఎన్నికలకు మొదటి విడత నోటిఫికేషన్ వెలువడనుంది. రిటర్నింగ్ అధికారుల ప్రకటన అనంతరం గురువారం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే జీపీల వారీగా అధికారులను సైతం నియమించారు. తొలి విడత ఎన్నికలు వచ్చే నెల 11వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, డీపీఓ జయసుధ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా సంబంధిత అధికారులు నామినేషన్ల స్వీకరణ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించేవరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందులకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పరుగులు పెడుతున్నారు. మొదట 262 పంచాయతీలు జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలున్నా యి. వీటిలో తొలిదశలో 262 పంచాయతీలకు ఎన్ని కలు జరుగుతాయి. ఈ గ్రామ పంచాయతీల పరిధిలో 2,198 వార్డులు ఉండగా వీటికి కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. తాండూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తాండూరు మండలంలోని 33, బషీరాబాద్ 39, యాలాల 39, పెద్దేముల్ 38, కొడంగల్ 25, దౌల్తాబాద్ 33, బొంరాస్‌పేట్ 35, దుద్యా ల్ మండల పరిధిలోని 20 పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడత పోలింగ్ జిల్లా పరిధిలోని ఎనిమిది మండలాల్లో జరగనుండగా ఇందులో 2,94,560 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రారంభోత్సవాలకు బ్రేక్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడానికి వీలులేదు. ఓటర్లను ప్రలోభపెట్టే ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు నిర్వహించరాదు. నిధులు మంజూరైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మరో నెల రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఇప్పటికే నిధులు మంజూరై కొనసాగుతున్న పనులకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండదు. సంక్షేమ పథకాల అమలులో కూడా కొత్త లబ్ధిదారుల ఎంపిక మాత్రం జరగదు. అదే విధంగా పాత లబ్ధిదారులకు మాత్రం యథాతథంగా సంక్షేమ ఫలాలు అందనున్నాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో మరో నెలరోజుల పాటు అభివృద్ధి పనులకు ఆటంకం కలగనుంది. తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు డిసెంబర్ 11న పోలింగ్ మండలాల వారీగా బ్యాలెట్ పత్రాలు, బాక్సుల సరఫరా ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు గ్రామాల్లో ఎన్నో రోజులుగా లూగిసలాడుతూ వస్తున్న సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. అందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి విడతలో జరిగే ఎన్నికల నామినేషన్లను నేటి నుంచే స్వీకరించనున్నారు. జిల్లాలో మొదటి విడత వివరాలు గ్రామ పంచాయతీలు 262వార్డుల సంఖ్య 2,198ఓటర్ల సంఖ్య 2,94,560నేటి నుంచి నామినేషన్లు తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్లు గురువారం నుంచి స్వీకరించనున్నారు. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామపత్రాలు స్వీకరిస్తారు. 30న నామినేషన్లను పరిశీలించటంతోపాటు అదే రోజు సాయంత్రం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. వచ్చే నెల 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణలకు అవకాశం ఇస్తారు. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 9వ తేదీ సాయంత్రం వరకు ప్రచారం గడువు ఉండగా 11వ తేదీ పోలింగ్ నిర్వహించి అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ వెంటనే ఉప సర్పంచ్‌ని సైతం ఎన్నుకోనున్నారు. -
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
● తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యబషీరాబాద్: మండలంలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్‌రెడ్డితో కలిసి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. గతంలో ఎక్కడెక్కడ రాజకీయ గొవడలు జరిగాయో ఆ గ్రామాల వివరాల రికార్డులను పరిశీలించారు. సర్పంచ్ ఎన్నికల్లో కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. కర్ణాటక సరిహద్దు మండలం కావడంతో సరిహద్దు గ్రామాల చెక్‌పోస్టుల దగ్గర తనిఖీలు చేయాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వనరులను కొల్లగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటిసారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన డీఎస్పీకి పోలీసులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎస్ఐ నుమాన్‌అలీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని విలువైన భూములు, జిల్లా ఆదాయంపై కాంగ్రెస్ సర్కార్ కన్నేసిందని.. జిల్లా అిస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు నడుం బిగించిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను, మేడ్చల్ జిల్లా మొత్తాన్ని ఏకపక్షంగా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించడం ప్రజా వ్యతిరేక చర్య అని విమర్శించారు. ఆర్థికంగా పరిపుష్టమై ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శివారు ప్రాంతాలకు ప్రభుత్వ నిర్ణయం ఆశనిపాతంలా మారిందన్నారు. ఈ నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికంగా పెను భారం తప్పని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, ఇతర చార్జీలు అడ్డగోలుగా పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం, నల్లా కనెక్షన్, వీధి దీపాలు, డ్రైనేజీలు, రోడ్లు ఇలా ప్రతీ పనికి హైదరాబాద్ వైపు చూడాల్సి వస్తుందని చెప్పారు. నగర అభివృద్ధిని మూలన పడేసిన రేవంత్ సర్కార్ శివారు ప్రాంతాలను సైతం అధోగతిపాలు చేయడానికే ఈ విలీన ప్రక్రియ చేపట్టారని తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయం మీద మక్కువ ఉన్న కేసీఆర్ సాగుకు ఊతమిస్తే.. రియల్ ఎస్టేట్ మీద మక్కువతో రేవంత్ రెడ్డి భూముల అమ్మకం మీద దృష్టి సారించారని ఎద్దేవా చేశారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా ప్రజలంతా ఏకమై జిల్లాను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. దీక్షాదివస్‌కు తరలిరండి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 29న ఉదయం 10 గంటలకు శంషాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించే దీక్షాదివస్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, కేసీఆర్ పాలనలో జిల్లా నంబర్ వన్‌గా ఎదిగితే రేవంత్ సర్కార్ హోల్‌సేల్‌గా అమ్మేందుకు దిగిందని మండిపడ్డారు. షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు పంచుతోందని, బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండగలకు రెండు సార్లు ఎగ్గొటిందన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. జిల్లా అిస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కదిలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు నర్సింహ, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
● కోటబాసుపల్లిలో విషాదం ● కేసు నమోదు చేసిన పోలీసులు తాండూరు రూరల్: రోడ్డు దాటుతుండగా ట్రాక్టర్ ఢీ కొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కరన్‌కోట్ పోలీస్ స్టేష్‌న్ పరిధిలోని కోటబాసుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కోటబాసుపల్లికి చెందిన వడ్డె రాజు, వడ్డె గంగమ్మకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వీరిలో చిన్న కుమారుడు వడ్డె చిన్న యాదగిరి(17) మినహా అందరికీ వివాహాలయ్యాయి. యాదగిరి కుటుంబ సభ్యులతో కలిసి నాపరాతి గనుల్లో కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద రోడ్దు దాటుతుండగా గోడ నిర్మాణానికి వినియోగించే రాయి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. టైర్ల కింద పడిన బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సేవల్లో.. ‘అమ్మ ఒడి’
● గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సదుపాయం ● జిల్లావ్యాప్తంగా ఎనిమిది వాహనాల ద్వారా సేవలు కుల్కచర్ల: ప్రతీ మహిళకు మాతృత్వపు దశ ఎంతో గొప్పది. ఈసమయంలో వారికి అందే వైద్యసేవలు అత్యంత ముఖ్యమైనవి. గర్భిణులు ఇంటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి, పరీక్షలు, చికిత్సల అనంతరం గమ్యస్థానాలకు చేరుకోవడం ఎంతో ప్రధానం. శ్రీఅమ్మ ఒడిశ్రీ పేరుతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆయా ఆస్పత్రులకు అనుసంధానంగా ఎనిమిది 102 వాహనాలను నిర్వహిస్తున్నారు. ఇవి ప్రత్యేకంగా గర్భిణులు, బాలింతలకు సేవలు అందిస్తున్నాయి. వైద్యులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం గ్రామాల్లోకి వెళ్లి రవాణా సదుపాయం కల్పిస్తాయి. అప్ అండ్ డౌన్.. గర్భిణులు, బాలింతలను వారి ఇంటి నుంచి దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లడం, వైద్య పరీక్షలు, చికిత్సలు పూర్తయిన అనంతరం తిరిగి ఇంటి వద్ద దిగబెట్టడం వీరి విధి. మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది. ఈసేవలు పూర్తి ఉచితం. సద్వినియోగం చేసుకోవాలి జిల్లా వ్యాప్తంగా అమ్మఒడి కార్యక్రమం ద్వారా 102 సేవలను అందిస్తున్నాం. గర్భిణులు, బాలింతలను ఇంటినుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి, వైద్యం అనంతరం సురక్షితంగా ఇంటి వద్ద దింపేస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రదీప్‌కుమార్, 102 జిల్లా కోఆర్డినేటర్ మరింత శ్రద్ధ చూపుతున్నాం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. గర్భిణులు, బాలింతల విషయంలో మరింత శ్రద్ధ చూపుతున్నాం. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దు. అమ్మఒడిలో భాగంగా 102 వాహనాలు ఉచిత రవాణా సేవలు కల్పిస్తున్నాయి. – కిరణ్ గౌడ్, కుల్కచర్ల మండల వైద్యాధికారి -
రూ.పది లక్షలు పట్టుబడితే ఇన్కమ్ ట్యాక్స్‌కు..
రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్‌గౌతమ్ షాబాద్: పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్, నాకాబందీ, వాహనాల తనిఖీలు చేపడుతున్నామని రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ అన్నారు. బుధవారం ఆయన షాబాద్ ఠాణా పరిధిలో ఐదు ప్రాంతాల్లో నాకాబందీ చేపట్టారు. ఈ సందర్భంగా డీసీపీ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ.. ఎన్నికలలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్య లు తీసుకుంటున్నామన్నారు. నిబంధలన ప్రకారం రూ.పది లక్షలకు పైగా నగదు పట్టుబడితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తామన్నారు. రూ.50వేల నుంచి రూ.పది లక్షల లోపు నగదు పట్టుబడితే కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కమిటీకి అందజేస్తామన్నారు. ఎన్నికల తర్వాత సరైన ఆధారాలు తీసుకువచ్చి డబ్బు తీసుకువెళ్లొచ్చన్నారు. ఈ తనిఖీల్లో రూ.లక్ష నగదు, నంబర్ ప్లేట్ లేని ఆరు వ ఆహనాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు లేని 26 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ కిషన్, షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్ఐలు రమేశ్, సతీశ్‌కుమార్ తదితరులున్నారు. -
అత్యాచార నిందితుల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన కొత్తూరు సీఐ నర్సయ్య ● కల్లు దుకాణాలు, లేబర్ అడ్డాల వద్ద జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచన కొత్తూరు: ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తూరు సీఐ నర్సయ్య తెలిపిన ప్రకారం.. కర్నూల్ జిల్లా బ్రహ్మణ్కూట్కూర్ మండలం బొల్లారంలో నివాసం ఉంటున్న నల్లబోతుల సలేశ్వరం(47) (నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల స్వగ్రామం), కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణంలోని లక్ష్మీపల్లికి చెందిన ఎరుకలి లోకేష్ బంధువులు. వీరు ఈనెల 22న షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల లేబర్ అడ్డా వద్ద పనికోసం వేచిఉన్న ఓ మహిళతో మాటలు కలిపారు. అనంతరం ఆమెను బైకుపై మున్సిపల్ పరిధిలోని కుమ్మరిగూడ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బుధవారం కొత్తూరులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైకుపై అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్కివానిగూడ వద్ద మహిళపై అత్యాచారం చేసి, ఆభరణాలు ఎత్తుకెళ్లిన విషయాన్ని అంగీకరించారు. సలేశ్వరంపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు. కల్లు దుకాణాలు, లేబర్ అడ్డాల వద్ద కొత్తగా పరిచమయ్యే వ్యక్తుల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని సీఐ సూచించారు. కేసును ఛేదించిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సత్యశీలరెడ్డి, గోపాలకృష్ణ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
జేసీబీని ఢీకొట్టిన పెళ్లి కారు
● బెలూన్లు ఓపెన్ కావడంతో నూతన వధూవరులకు తప్పిన ప్రమాదం ● నలుగురికి స్వల్పగాయాలు చేవెళ్ల: నూతన వధూవరులతో వెళ్తున్న పెళ్లి కారు రోడ్డుపై ఆగి ఉన్న జేసీబీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నూతన దంపతులతో పాటు మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని దేవునిఎర్రల్లి స్టేజీ వద్ద బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని రావుపల్లికి చెందిన జ్యోతి, వెంకటేశ్‌ల కూతురు అనూష(లక్ష్మీప్రియ)కు మొయినాబాద్ మండలపరిధిలోని నాగిరెడ్డిగూడకు చెందిన శివకుమార్‌తో చేవెళ్లలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉదయం వివాహమైంది. సాయంత్రం 6.30 గంటలకు వధువు ఇంటికి కారులో బయలుదేరారు. మార్గమధ్యలోని దేవునిఎర్రవల్లి బస్‌స్టేజీ వద్ద ఓ బొలెరో వాహనం పాడవడంతో దాన్ని బాగు చేసేందుకు జేసీబీని తీసుకువచ్చి పెట్టారు. చీకట్లో వాహనాలు కనిపించకపోవడంతో పెళ్లి కారు వేగంగా జేసీబీని వేగంగా ఢీకొట్టింది. కారులో బెలూన్ల్లు ఓపెన్ కావడంతో స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చేవెళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పల్లెపోరు షురూ
పల్లెల్లో పంచాయతీ పోరు సందడి నెలకొంది. ఆశావహులు.. మద్దతు కూడగట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. రానున్న పరిషత్ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకున్న రాజకీయ పార్టీలు.. బలమున్న వారినే బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బషీరాబాద్: పంచాయతీ పోరుకు నగారా మోగడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ బరిలో నిలిచే ఆశావహులు గ్రామాల్లో చోటా, మోటా లీడర్ల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. తనకు మద్దతు తెలిపితే.. ఎన్నికల్లోఎంతైన ఖర్చు పెట్టడానికి పోటీదారులు సై అంటున్నారు. ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులను మచ్చిక చేసుకునేందుకు తొలిరోజే దావతులు మొదలు పెట్టారు. మొదటి విడత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ దాఖలు మొదలు కానుండడంతో.. చలికాలంలో ఎన్నికల వేడి రాజుకుంది. పెద్దలతో మంతనాలు తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్, కోట్‌పల్లి మండలాలలో 155 గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో సర్పంచి పదవికి పోటీపడుతున్న ఆశావహులు.. నాయకుల ప్రసన్నం కోసం పరుగులు తీస్తున్నారు. సొంతూరులో పోటీ చేయడానికి వచ్చిన రిజర్వేషన్.. మళ్లీ రాదని భావిస్తున్న వారు.. అందరినీ కూడగట్టుకునే ప్రయత్నాలు తీవ్రం చేశారు. పోటీకి తమ సామాజికవర్గం నుంచి ఎవరూ అడ్డు రాకుండా సముదాయిస్తూ.. వారిని అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నారు. బుధవారం ఆయా గ్రామాల్లో గ్రామ పెద్దలతో మంతనాలు జరిపారు. గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్లు రిజర్వేషన్ల ప్రకారం ఆయా సామాజిక వర్గాల్లో ఆర్థికంగా బలమైన గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రస్తుతం సర్పంచులను గెలిపించుకోవాలని భావిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. సీఎం సొంత జిల్లా కావడంతో మెజార్టీ పంచాయతీలను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆయా మండలాల ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో బలమున్న ఉన్న వారిని బరిలోకి దించాలని యోచిస్తున్నారు. ముఖ్యంగా మేజర్ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించారు. బీఆర్ఎస్ కూడా అదే విధంగా వ్యూహరచనలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బుధవారం బషీరాబాద్‌లో ముఖ్య నేతలను కలిశారు. గ్రామాల్లో ఎక్కడ చూసిన ఎన్నికల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. రచ్చకట్టల దగ్గర, హోటళ్లల్లో ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల చర్చే జరుగుతుంది. రిర్వేషన్లు రావడంతో గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు. పదవుల యోగం స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి గిరిజన తండాల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏళ్లతరబడి రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న గిరిజనులకు.. పదవుల యోగం పట్టనుంది. పనుల కోసం హైదరాబాద్, ముంబాయి తదితర ప్రాంతాలకు వెళ్లిన గిరిజనులు, వడ్డెరులు సొంతూర్లకు వస్తున్నారు.తండాల్లో పోటీకి సై అంటున్నారు. ఏకగ్రీవంపై దృష్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మెజార్టీ జీపీలను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రణాళిక చేస్తోంది. కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్కు ఆర్థికంగా బలమైన నాయకులు లేకపోవడంతో, వాటిని ‘హస్త’గతం చేసుకోవాలని చూస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్.. ప్రతి పంచాయతీలో తమ మద్దతుదారులను బరిలో దింపడానికి అభ్యర్థులను అన్వేషిస్తోంది. వారి బాటలోనే బీజేపీ పయనిస్తోంది. నియోజకవర్గంలో జీపీలు, వార్డుల వివరాలు గ్రామాల్లో స్థానిక సందడి చలిలో వేడిపుట్టిస్తున్న సర్పంచ్ ఎన్నికలు మద్దతు కోసం ఆశావహుల హడావుడి బలమైన అభ్యర్థి కోసం పార్టీల అన్వేషణ నేటి నుంచి మొదటి విడత నామినేషన్లు -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
● ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయిన ప్రజలు ● మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగి: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఆ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో.. అధికార పార్టీ గండీడ్ మండలం చెన్నయపల్లితండాకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అధికార పార్టీ పనైపోయిందని, అందుకే ఆ పార్టీ నాయకులు కారు ఎక్కేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని.. అధిష్టానం గుర్తిస్తుందని, విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
జీవనాధారాన్ని లాక్కోవద్దు
షాబాద్: జీవనాధారమైన భూములను గుంజుకుంటే ఎలా బతకాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బుధవారం మండలంలోని రేగడిదోస్వాడ, మక్తగూడ, తాళ్లపల్లి, వెంకమ్మగూడ గ్రామాల్లో పర్యటించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వం మీ భూములు తీసుకుంటుందని చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే షాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేగడిదోస్వాడ సర్వేనంబర్ 102లో ఉన్న సుమారు 400 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని గత 70 ఏళ్లుగా సుమారు 600 మంది రైతులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. జీవనాధారమైన భూములను లాక్కుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితిలోనూ భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. తహసీల్దార్ అన్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డెరెక్టర్ రాజారత్నం, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌లు రాములు, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, నారాయణరెడ్డి, నాలుగు గ్రామాల రైతులు తదితరులు ఉన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత రైతుల నిరసన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు డైబ్బె ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఇవ్వబోమని వెల్లడి -
చదువుతో పాటు ఆటల్లో రాణించాలి
పరిగి: విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడలపై శ్రద్ధ చూపాలని, చదువుతో పాటు ఆటల్లో రాణించాలని టోర్నీ నిర్వాహకులు అన్నారు. స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన అండర్ 17 జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో వికారాబాద్ జట్టు వితేగా నిలిచింది. టోర్నీలో ఆరు జోన్లు పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, పెద్దెముల్, మోమిన్‌పేట్ జట్లు పాల్గొన్నాయి. పరిగి, వికారాబాద్ జట్లు ఫైనల్‌కు చేరుకోగా.. వికారాబాద్‌పై పరిగి ఘనవిజయం సాధించింది. అనంతరం విజేత జట్టుకు బహుమతులు అందజేశారు. -
భవనం పైకెక్కి యువకుడి హల్చల్
● కుటుంబ సభ్యులతో గొడవపడి మనస్తాపం ● పోలీసుల చొరవతో కిందికి దిగిన యువకుడు తుర్కయంజాల్: కుటుంబ సభ్యులతో నెలకొన్న మనస్పర్థల కారణంగా ఓ యువకుడు ఐదంతస్తుల భవనం ఎక్కి హల్చల్ చేశారు. ఈ సంఘటన పురపాలక సంఘం పరిధి స్నేహపురి కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. శుభం అనే యువకుడు అమెజాన్‌లో ఉద్యోగం చేస్తు ఉపాధి పొందుతున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ మనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఓ భవనంపైకి ఎక్కి దూకుతానని బెదిరించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ అనిల్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని, యువకుడికి నచ్చజెప్పి కిందికి దించారు. అనంతరం తన డిమాండ్లను పైపర్‌పై రాసిచ్చాడు. ఇదిలా ఉండగా శుభంకు మాటలు స్పష్టంగా రావని, చెవుడు కూడా ఉందని తెలిసింది. -
విధుల్లో అలసత్వం వద్దు
● పెండింగ్ ఫైళ్లనుసత్వరం పరిష్కరించాలి ● ఎస్పీ స్నేహ మెహ్ర అనంతగిరి: పెండింగ్ ఫైళ్లను సత్వరం పరిష్కరించాలి ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని వివిధ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, శాఖాపరమైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పనులను వేగవంతం చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత
కందుకూరు: మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా ప్రభుత్వం చేయూతనందిస్తోందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని నవారు కిష్టమ్మ ఫంక్షన్హాల్లో మంగళవారం ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కందుకూరు, మహేశ్వరం మండలాల్లో 2,086 గ్రూపులకు రూ.2.41 కోట్ల వడ్డీ లేని రుణాలను ఖాతాల్లో జమ చేశామన్నారు. డీఆర్డీఓ శ్రీలత మాట్లాడుతూ.. మహిళలు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాలన్నారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే ఆడ పిలల్లకు వివాహాలు చేయాలని, అప్పటి వరకు బాగా చదివించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, ఏఎంసీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, వైస్ చైర్మన్ యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్లు చంద్రశేఖర్, పాండుయాదవ్, డీపీఏం యాదయ్య, ఎంపీఓ గీత, ఏపీ ఎం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.రంగారెడ్డి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
కులవృత్తులకు ప్రోత్సాహం
మోమిన్‌పేట: మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని నందివాగు ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను వదిలారు. అనంతరం మోమిన్‌పేట రైతు వేదికలో 48 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. దేవరంపల్లిలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ, గ్రామ పంచాయతీ నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల వృత్తులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని అన్నారు. చేపల పెంపకంతో మత్స్యకారులు ఆర్థిక ఎదుగుదల సాధించాలన్నారు. చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. గత ప్రభుత్వం కుల వృత్తులను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక పంట రుణాలు రూ.2 లక్షల వరకు మాఫీ చేయడం జరిగిందన్నారు. రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ సృజన సాహిత్య, ఎంపీఓ యాదగిరి, పీఆర్ ఎఈఈ ప్రణీత్‌కుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శంకర్, నాయకులు నరోత్తంరెడ్డి, సుభాష్, సురేందర్, మల్లారెడ్డి, సుభాష్‌గౌడ్, మహంత్‌స్వామి, సిరాజొద్దీన్, ఎజాస్, ఎరాజ్, బాల్‌రెడ్డి, బాబు, మత్స్య సహకార సంఘాల సభ్యులు రాజు, అంబదాసు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థిక ప్రగతికే రుణాలు
అనంతగిరి: మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలనే ఉద్దేశంతోనే ప్రభు త్వం వడ్డీలేని రుణాలు ఇస్తోందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. జిల్లాలోని 9,232 స్వయం సహాయక సంఘాలకు విడుదలైన రూ.7.38 కోట్లను మంగళవారం వారి ఖాతాల్లో జ మ చేసినట్లు తెలిపారు. పరిగి నియోజకవర్గంలోని 2,781 సంఘాలకు రూ.2.23 కోట్లు, కొడంగల్ లోని 1,101 సంఘాలకు రూ.84 లక్షలు, తాండూరులోని 2,113 సంఘాలకు రూ.1.77 కోట్లు, వికారాబాద్ పరిధిలోని 2,664 సంఘాలకు రూ. 2.20 కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు. ఈ మొత్తా న్ని ఆయా ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణ భవన, ఇతర నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు(టీబీఓసీడబ్లుడబ్లుబి) తరఫున 10 రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సులు, సామాజిక భద్రత పథకాల కార్యక్ర మానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఓసీడబ్ల్యూ రిజిస్ట్రేషన్, రెన్యూవల్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా కార్మిక శాఖ అధికారి వాల్య, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ యాదయ్య, అంకిత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రాన్ని విస్మరించడం తగదు
అనంతగిరి: సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి విషయంలో జిల్లా కేంద్రమైన వికారాబాద్‌ను విస్మరించడం తగదని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ అన్నారు. వికారాబాద్‌ను సెంటర్ పాయింట్‌గా చేసుకొని అభివృద్ధి చేస్తే అన్ని నియోజకవర్గాలు పురోగతి సాధిస్తాయని పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా కేంద్రాన్ని కాదని తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం అడగకపోవడం సరికాదని హితవు పలికారు. ఎన్నికల సమయంలో అనంతగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న సీఎం ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర రాజధానికి 60 కిమీల దూరంలో ఉన్న వికారాబాద్‌ను కాదని కొడంగల్‌ను మాత్రమే అభివృద్ధి చేయడం ఏమిటని ప్రశ్నించారు. కొడంగల్‌తో పాటు వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అధికార పక్షాన్ని నిలదీయాల్సింది పోయి ప్రతిపక్షంలోని బీఆర్ఎస్ను విమర్మించడాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని తెలిపోయిందన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ వర్కింగ్ ప్రసిడెంట్ సుభాన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, ధారూర్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు దేవదాసు, మండల వర్కింగ్ ప్రసిడెంట్ అశోక్, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు గయాజ్, పట్టణ అధ్యక్షుడు ముర్తుజాలీ, నాయకులు మల్లేశం, లక్ష్మయ్య, రమణ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలివ్వాలి
కొడంగల్ రూరల్: జీఓ నంబర్ 81, 85 ప్రకారం వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాల జేఏసీ ఆధ్వర్యంలో చలో కొడంగల్ కార్యక్రమంలో నిర్వహించారు. మంగళవారం కడా కార్యాలయానికి చేరుకున్న వీరు సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 340మంది వీఆర్ఏలు మృతి చెందారని, అనేక మంది అనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం పాలైన తల్లిదండ్రల స్థానంలో వారసులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. 61 ఏళ్లకు పైబడిన 3,797మంది వీఆర్ఏల వారసులకు వారి తండ్రి స్థానంలో ఉద్యోగ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. కడా కార్యాలయానికి వెళుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు నర్సింలు, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు సత్యం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భరత్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్, యాలాల మండల అధ్యక్షుడు కోట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏల అక్రమ అరెస్ట్ సరికాదు పరిగి: ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, వీఆర్ఏ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ మంగళవారం చలో కొడంగల్ కార్యక్రమం చేపట్టారు. వారిని మార్గమధ్యలో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వీఆర్ఏలు సీఐటీయూ ఆధ్వర్యంలో పరిగి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీఆర్ఏల అక్రమ అరెస్టు సరికాదన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జీఓ నంబర్ 81, 85 ప్రకారం మిగిలిపోయిన వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు సంగమేష్, రాజఽశేఖర్, రవి, భరత్, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి పల్లైపె ఫోకస్ పెట్టండి
● తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ● పెద్దేముల్ పోలీస్‌స్టేషన్ తనిఖీ తాండూరు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి పల్లైపె ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. మంగళవారం పెద్దేముల్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు పరిశీలించి కేసుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలో గ్రామా ల్లో గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బెల్టు షాపులను నియంత్రించాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. పోలీసులు వివాదాల జోలికి వెళ్లరాదని సూచించా రు. ప్రజలకు విశ్వాసం కలిగేలా ప్రవర్తించాల ని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఎస్ఐ శంకర్, హెడ్ కానిస్టేబుళ్లు రమేష్, రఫీ తదితరులు పాల్గొన్నారు. -
మోగిన నగారా
పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం అనంతగిరి: ఎన్నికల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు మంగళవారంతో తెరపడింది. పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ జారీ చేయడంతో గ్రామాల్లో ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 594 పంచాయతీలు ఉండగా, 5,058 వార్డులు ఉన్నాయి. మొదటి విడతలో తాండూరు డివిజన్ లోని తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దే ముల్, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల్ మండలాల్లోని 262 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో వికారాబాద్ డివిజన్లోని వికారాబాద్, ధారూరు, మోమిన్‌పేట, నవాబుపేట, బంట్వారం, మర్పల్లి, కోట్‌పల్లి మండలాల్లోని 175 జీపీల్లో.. మూడో విడతలో వికారాబాద్ డివిజన్లోని పరిగి, పూడూరు, కుల్కచర్ల, చౌడాపూర్, దోమ మండలాల్లోని 157 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 23 నెలలుగా ప్రత్యేక పాలనలో.. 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించగా పదవీ కాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ వస్తోంది. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయి. దీనికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం అందకపోవడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు తప్పలేదు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో త్వరలో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. దీంతో రెండేళ్లుగా నెలకొన్న స్తబ్ధత తొలగనుంది. గతంలో పెద్ద ఎత్తున ఖర్చు ప్రభుత్వం దసరా పండుగకు ముందు సెప్టెంబర్‌లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆశావహులు అప్పటికే రంగంలోకి దిగారు. ఎ న్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఏ ర్పాట్లు చేసుకున్నారు.వినాయకచవితి, దసరా సమయాల్లో పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. కానీ బీసీ రిజర్వేషన్లపై కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం.. ఎన్నికలను వాయిదా పడడంతో వారి ఆశల పై నీళ్లు చల్లినట్లైంది. తాజా నోటిఫికేషన్‌తో ఇక గ్రామాల్లో ఎన్నికల కోలాహలం నెలకొననుంది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు.. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడడంతో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ దృష్టి సారించాయి. ఆర్థికంగా బలంగా ఉన్న వారితో పాటు, పలుకుబడి ఉన్న వారిని గుర్తించి మద్దతిచ్చే పనిలో నిమగ్నమయ్యాయి. షెడ్యూల్ ఇదీ..ఎన్నికల నిర్వహణ మొదటి విడత రెండో విడత మూడో విడత నామినేషన్ల స్వీకరణ 27 (నవంబర్) 30 (నవంబర్) 3 (నవంబర్) చివరి తేదీ 29 (నవంబర్) 2 (డిసెంబర్) 5 (డిసెంబర్) నామినేషన్ల పరిశీలన 30 (నవంబర్) 3 (డిసెంబర్) 6 (డిసెంబర్) అభ్యర్థుల జాబితా 30 (నవంబర్) 3 (డిసెంబర్) 6 (డిసెంబర్) ఉపసంహరణ 3 (డిపెంబర్) 6 (డిసెంబర్) 9 (డిసెంబర్) అభ్యర్థుల జాబితా 3 (డిసెంబర్) 6 (డిసెంబర్) 9 (డిసెంబర్) పోలింగ్ 11 (డిసెంబర్) 14 (డిసెంబర్) 17(డిసెంబర్) -
వంతెన నిర్మాణం.. సాకారం
● జేపీదర్గా కూడలిలో తగ్గనున్న ప్రమాదాలు ● ఫ్లైవర్ నిర్మాణానికి శ్రీకారం ● హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు కొత్తూరు: రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నూతన వంతెనల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని జాతీయ రహదారిపై జేపీ దర్గా కూడలి వద్ద ప్రయాణికులు ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ముల్‌నర్వ గ్రామంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన జేపీ దర్గా, అంతేకాకుండా పీఅండ్‌జీ, నాట్కో ఇతర పరిశ్రమలకు వెళ్లాలంటే తప్పకుండా కూడలి దాటాల్సిందే. జాతీయ రహదారి కావడంతో వాహనాలు అతి వేగంగా ప్రయాణిస్తుంటాయి. కాగా ఇక్కడ కూడలి దాటాలంటే వాహనదారులకు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలకు గురై కార్మికులు, దర్గా దర్శనం కోసం వచ్చే భక్తులు పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. కూడలిలో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలను నివారించాలని స్థానికులు, పోలీసులు ఎన్హెచ్ఏఐ అధికారులకు విన్నవించారు. దీంతో ఎట్టకేలకు కూడలి వద్ద వీయూపీ(వెహికల్ అండర్ పాస్) నిర్మాణానికి ఆమోద ముద్ర పడింది. రూ.35 కోట్లతో నిర్మాణం జేపీ దర్గా కూడలిలో ప్రమాదాల నివారణకు సుమారు రూ.35 కోట్లతో ఒకటిన్నర కిలోమీటర్ పొడవుతో భారీ ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. ఇప్పటికే వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వంతెన నిర్మించే స్థలంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. నిర్మాణం పూర్తయితే కూడలి వద్ద సాధ్యమైనంత వరకు ప్రమాదాలు తగ్గిపోనున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వైపునకు వెళ్లే భారీ వాహనాలు వంతెన కింద నుంచి యూటర్న్ తీసుకొని తిరిగి పాత జాతీయ రహదారి మీదకు చేరుకునే విధంగా భారీ వెడల్పుతో వంతెన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ప్రయోజనాలు ఇవే.. ● వంతెన నిర్మాణంతో ప్రమాదాలు తగ్గడంతో పాటు ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు రాకపోకలు కొనసాగిస్తాయి. ● ఇప్పటికే వై జంక్షన్ కూడలి సమీపంలో నిర్మించిన అండర్‌పాస్ డిజైన్ లోపం కారణంగా వర్షాకాలంలో వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. ● హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వైపునకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు దర్గా కూడలిలో నిర్మించే వంతెన కింది నుంచి యూటర్న్ తీసుకొని వై జంక్షన్ సమీపం నుంచి పాత జాతీయ రహదారిపైకి చేరుకుంటాయి. ప్రమాదాల నివారణ జాతీయ రహదారిపై ఆయా కూడళ్ల వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలను ఇప్పటికే ఎన్హెచ్ఏఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారు స్పందించి జేపీదర్గా కూడలి, నందిగామ మండలంలో మేకగూడ కూడలి, కేశంపేట్ రోడ్డులో చటాన్‌పల్లి కూడలి, బూర్గుల వద్ద రాయికల్ కూడలిలో భారీ వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణం పూర్తయితే ప్రమాదాలు తగ్గుతాయి. – వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్‌నగర్ -
ఇదేం భోజనం?
కుల్కచర్ల: ప్రభుత్వం వంట కార్మికులకు నిధులు పెంచి ఇస్తున్నా నాణ్యమైన భోజనం అందించకపోవడం బాధాకరమని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి అన్నారు. మంగళవారం చాపలగూడెంలో పర్యటించిన నేతలు ప్రా థమిక పాఠశాలలో మధ్యాహ్నా భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంట సిబ్బందికి నిధులు ఆలస్యంగా వస్తున్నప్పటి కీ వచ్చే నిధులను పెంచి ఇస్తున్నామన్నారు. చిన్నారులకు నీళ్లచారుతో అన్నం పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి, వెంకటయ్య, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఏఎంసీ చైర్మన్ ఆగ్రహం -
మళ్లీ నిరాశే!
వికారాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా మొదటి అధికారిక పర్యటన నిరాశే మిగిల్చింది. వరాల జల్లు కురిపిస్తారనే ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి(నారాయణపేట జిల్లా) బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత రెండు సార్లు దసరా పండుగకు చుట్టపుచూపుగా కొడంగల్‌కు వచ్చి వెళ్లారు. సోమవారం అధికారికంగా జిల్లాలో మొదటి సారి పర్యటించారు. దీంతో అన్ని ప్రాంతాల ప్రజలు, ప్రజాప్రతినిధులు భారీగా నిధులు వస్తాయని ఆశ పడ్డారు. కానీ ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరైంది మొదలు సభ ముగిసే వరకు తన సొంత నియోజకవర్గం కొడంగల్ చుట్టే ప్రసంగం సాగింది. వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. ఈ ప్రాంతాలకు చిల్లిగవ్వ కూడా విదల్చలేదు. అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆయా నియోజకవర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం జిల్లాలో ఇదే టాపిక్ నడుస్తోంది. ఈ విషయమై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులు వికారాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ పలు విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక కొడంగల్కా అని ప్రశ్నించారు. అన్నింటా అదే పరిస్థితి అభివృద్ధి, సంక్షేమం రెండింటి విషయంలోనూ కొడంగల్ నియోజకవర్గం మినహా మిగతా ప్రాంతాలకు నిరాశే ఎదురైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల తరహాలోనే వికారాబాద్, పరిగి, తాండూరుకు నిధులు వచ్చాయే తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదనే విమర్శ ఉంది. కొడంగల్‌కు మాత్రం పారిశ్రామిక వాడ, డెంటల్, మెడికల్, ఇంజనీరింగ్, పాల్టెక్నిక్, ఫిజియోథెరపీ, అగ్రికల్చర్, వెటర్నరీ, డిగ్రీ, ఇంటర్ తదితర కళాశాలన్నీ మంజూరు చేశారు. ఇందులో ఏ ఒక్కటి కూడా జిల్లా పరిధిలోని ఇతర నియోజకవర్గాలకు మంజూరు చేయలేదు. ప్రభుత్వ బడులలో చదువుతున్న విద్యార్థుల విషయంలోనూ వివక్షే కనిపిస్తోంది. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని 312 పాఠశాలలకు చెందిన 28 వేల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తుండగా మిగతా మూడు ప్రాంతాల్లో ఆ పథకం కనిపించడంలేదు. సోమవారం జరిగిన సీఎం సభలో జిల్లా అంతటా ఈ పథకం వర్తింపజేస్తారని అందరూ ఆశించారు. కానీ అలాంటి ప్రకటనే చేయలేదు. ఇదే వేదికగా కొడంగల్ పరిధిలోని ఆయా మండలాలకు, గ్రామాలకు కమ్యూనిటీ హాళ్లు, కార్యాలయాలకు నూతన భవనాలు, సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. మిగతా నియోజకవర్గాల ఊసే లేదు. ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి పక్కనే స్టేజీ పంచుకుంటున్న తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు కూడా వారి నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించుకోలేపోయారనేది వాస్తవం. మున్సిపాలిటీలకు మొండిచేయిజిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ ఉండగా ఇందులో అన్నింటికంటే చిన్నది కొడంగల్. ఏడాది కాలంగా ఆ మున్సిపాలిటీలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీ, కార్యాలయాలు, ఆస్ప్రతుల నిర్మాణ పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. తాజాగా ఇదే మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం రూ.60 కోట్ల విలువ చేసే పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. కొడంగల్ కంటే పెద్ద పురపాలికలకు చిల్లిగవ్వ కూడా కేటాయించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే తాండూరు, వికారాబాద్, పరిగి ప్రాంతాలకు రూ.15 నుంచి రూ.25 కోట్లు మంజూరైనా నిధులు విడుదల కాక పనులు ప్రారంభానికి నోచుకోలేదు. సీఎం నుంచి నిధులు రాబట్టడంలో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, స్పీకర్ విఫలమయ్యారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. జిల్లాకు అసంతృప్తి మిగిల్చిన సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన -
పర్యావరణ పరిరక్షణపై అవగాహన అవసరం
తుర్కయంజాల్: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం పెంపొందాలని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గారెత్ విన్స్ ఓవెన్, మాజీ స్పెషల్ ఛీప్ సెక్రటరీ, యూఎన్ఏసీసీసీ నేషనల్ చైర్మన్ అజయ్ మిశ్రా అన్నారు. ఎన్విరాన్మెంటల్ కాన్షియస్ గ్లోబలైజేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుర్కయంజాల్‌లోని సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇండస్ వ్యాలీ స్కూల్లో మంగళవారం నిర్వహించిన గ్రీన్ అవేర్నెస్ మాస్ ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండడంతో పాటు పలువురిని చైతన్యం చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్టేట్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ బి. ప్రభాకర్, టీటీడీ మాజీ జేఈఓ, ఐఏఎస్ రిటైర్డ్ డా.లక్ష్మీ కాంతం, ఈసీజీ ఫౌండేషన్ కోర్ టీమ్ సభ్యులు సత్తారు, వెంకటేశ్వర్లు, సుధీర్, మార్కండేయులు, కళాశాల యాజమాన్యం రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ట్రెసా
అనంతగిరి: రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ అన్నారు. మంగళవారం ట్రెసా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడిగా పరిగి డీటీ విజయేందర్, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా దీపక్ సాంసన్దాస్, ఉపాధ్యక్షుడిగా ఎండీ నైమాత్ అలీ, విజయ్‌కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా మునీరుద్దీన్, కోశాధికారిగా మహ్మద్ యూనుస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఆనంద్‌రావు, సురేశ్, స్పోర్ట్స్ అండ్ కల్చరర్ సెక్రటరీగా నరేందర్, జాయింట్ సెక్రటరీలుగా షేక్ రషీద్ అహ్మద్, అజయ్‌కుమార్, ఎండీ ఖాజాపాషా, శిరీష, కార్యవర్గసభ్యులుగా సయ్యద్ అసద్ అలీ, శ్రీకాంత్, కనకారావు, మాధవరెడ్డి, వెంకటేశ్, నాగమణి, శశికళ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా నారాయణరెడ్డి, నిరంజన్, రాష్ట్ర కార్యదర్శి మనోహర్ చక్రవర్తి, రాష్ట్ర నాయకులు బి.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్ -
ఇది స్కాంల సర్కార్
● రెండేళ్లలో చేసిందేమీ లేదు ● బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి యాచారం: రెండేళ్లలో కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని, స్కాంల సర్కార్‌గా పేరు తెచ్చుకోవడం తప్ప అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్‌గౌడ్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి మాట్లాడుతూ.. ఎలా స్కాంలు చేయాలి, రూ.లక్షలాది కోట్లు ఎలా సంపాదించుకోవాలనే ధ్యాస తప్ప ప్రభుత్వానికి అభివృద్ధిపై, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మహానగరం చుట్టూ విస్తరించిన విలువైన భూములను కాజేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీ కోసం వేలాది ఎకరాల సేకరిస్తే అవే భూముల్లో ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీకి సేకరించిన భూములను తిరిగిస్తామని చెప్పిన వారు నేడు ప్రజల్లోకి వెళ్లడానికే భయపడుతున్నారన్నారు. రెండేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారని, మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే సంక్షేమం, అభివృద్ధి జరుగుతాయని చెబుతున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులను సమష్టిగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, యాచారం పీఏసీఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పదేళ్లలో ప్రపంచస్థాయి అభివృద్ధి యాచారం: ప్రపంచస్థాయి అభివృద్ధికి యాచారం మండలం చిరునామాగా మారబోతోందని, వచ్చే పదేళ్ల కాలంలో ఈ ప్రాంతం ఊహించని విధంగా అభివృద్ధి చెందనుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. నందివనర్తి, నస్దిక్‌సింగారం, కొత్తపల్లి, మంతన్‌గౌరెల్లి తదితర గ్రామాల్లో మంగళవారం రూ. కోటిన్నరకు పైగా నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ తెచ్చిన ఫార్మాసిటీని రద్దు చేసి, అదే భూముల్లో ప్యూచర్సిటీని నిర్మిస్తున్నామన్నారు. ప్యూచర్‌సిటీ నిర్మాణాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రజల్లో లేనిపోని అనుమానాలు కలిగించడానికి కుట్రలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలతో పాటు రూ. కోట్లాది రుణాలిచ్చి కోటిశ్వరులను చేయాలన్నదే సర్కార్ ఉద్దేశ్యమన్నారు. ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బిలకంటి చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
కులవ్యవస్థను నిర్మూలించాలి
షాద్‌నగర్‌రూరల్: గ్రామాల్లో కులవ్యవస్థ నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఎల్లంపల్లిలో ఇటీవల పరువు హత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కులాంతర వివాహానికి సహకరించాడని దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్‌ను దారుణంగా హత్య చేయడం బాధాకరమని పేర్కొన్నారు. సమాజంలో కులవివక్ష హత్యలు అధికంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కులవివక్ష అనేది కరోనా కంటే ప్రమాదకరమైందన్నా రు. ఎర్ర రాజశేఖర్‌ను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ -
నేడు మోమిన్‌పేటకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ రాక
మోమిన్‌పేట: మండలంలో మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నందివాగు ప్రాజెక్టులో చేప పిల్లలను వదలడం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, దేవరంపల్లిలో రూ.47 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, రూ.18 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవన ప్రారంభోత్సవం, చక్రంపల్లిలో రూ.19 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవన ప్రారంభోత్సవం, రూ.56 లక్షలతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనికార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత పూడూరు: దేవాదాయ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత హెచ్చరించారు. పరిగి పట్టణంలోని గోపాలస్వామి ఆలయానికి చెందిన భూములు పూడూరు మండలం చన్గోముల్ గ్రామంలో ఉన్నాయి. అట్టి భూములు ఆక్రమణకు గురైనట్లు ఇటీవల ఆ గ్రామ ప్రజలు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికారులు గ్రామ సర్వే నంబర్లోని 14.21 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని, కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ తహసీల్దార్ హరిత, జిల్లా సహాయ కమిషనర్ చంద్రశేఖర్, ఈఓ నరేందర్, గ్రామ పాలనాధికారి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కుల్కచర్ల: జాతీయస్థాయి మల్లకంబ్ పోటీలకు బండవెల్కిచర్ల గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన కీర్తన్, మహేష్, అఖిల్భరత్, హన్మంతులు ఈ నెల 15న నగరంలో జరిగిన ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు వెళ్లారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ లక్ష్మికాంత్ రెడ్డి, ఉపాధ్యాయ బృంధం అభినందించారు. మొయినాబాద్: మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్ డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనులు చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ నెల 5వ తేదీలోపు కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, నూతన యూనిఫాం, గుర్తింపు కార్డులు, సబ్బులు, నూనెలు, ఈఎస్ఐ కార్డు, పీఎఫ్ నంబర్ వంటి అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, మండల కన్వీనర్ ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ గౌరవ అధ్యక్షుడు రత్నం, అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్ పాల్గొన్నారు. -
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అన్ని విఽ దాలా అండగా ఉంటామని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని అన్మాస్‌పల్లి, ఎక్వాయిపల్లి, మర్రిపల్లి, ఆకుతోటపల్లి గ్రామాల రైతులతో సోమవారం ఎక్వాయిపల్లిలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న పలువురు రైతులు తమ గోడు వెలిబుచ్చారు. తాతల కాలం నుంచి సేద్యం చేసుకుంటూ బతుకుతున్నామని, ప్రభుత్వం రోడ్డును నిర్మిస్తే ఎక్కడికి వెళ్లి బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా కోల్పోతున్న భూమికి భూమి పరిహారంగా ఇవ్వాలని, లేని పక్షంలో కొంగరకలాన్, రావిర్యాలలో ఇచ్చినట్లు పరిహారం ఇవ్వాలని కోరారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ప్రారంభమయ్యే రావిర్యాల నుంచి ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి వరకు ఒకే విధమైన పరిహారం చెల్లించాలన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి సమస్యను వివరిస్తామని, న్యాయమైన పరిహారం అందించేందు కు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయశ్రీ, ఎంపీడీఓ సుజాత, మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికాంత్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి -
బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు
తాండూరు రూరల్: బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ప్రసక్తే ఉండదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పెద్దేముల్ మండలం మంబాపూర్లో 30 అడుగుల బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. లిక్కర్ కేసులో మేం మాజీ ఎంపీ కవితను లోపల వేశామని.. కాంగ్రెస్‌కు దమ్ముంటే ఫార్ములా – ఈ రేసు కేసులో కేటీఆర్‌ను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం, ఇతర కుంభకోణాల్లో కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని ఓడించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి పని చేశాయన్నారు. భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ సమావేశానికి అప్పటి సీఎం కేసీఆర్ బస్సులు పంపారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి భారీగా నిధులు ఇస్తోందని తెలిపారు. ఆవాస్ యోజన కింద తెలంగాణకు నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లు మంజూరు చేస్తోందని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రూ.13 కోట్లు వెచ్చించి 200 సీసీ రోడ్లు వేశామని పేర్కొన్నారు. దేశానికి బీజేపీ అవసరం ఉంది దేశానికి బీజేపీ అవసరం ఉందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బిహార్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని చెప్పారు. దేశ ప్రజలు ప్రధాని మోదీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ స్ఫూర్తిలో దేశం ఐక్యత సాధిస్తోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో డీ లిమిటేషన్ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరగవచ్చని అన్నారు. రెండు వారాల క్రితం గుండె చికిత్స చేయించుకున్న ఆయన మొదటి సారి జిల్లాకు వచ్చారు. ప్రహ్లాద్రావే.. జిల్లా అధ్యక్షుడు ప్రస్తుతం పార్టీ జిల్లా ఇన్చార్జ్గా వ్యహరిస్తున్న ప్రహ్లాద్‌రావును జిల్లా అధ్యక్షుడిగా అనుకోవాలని ఎంపీ కొండా అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలో దింపాలన్నారు. కార్యకర్తలే బీజేపీ బలమన్నారు. కార్యక్రమంలో పార్టీ వికారాబాద్ ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్‌గుప్తా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్‌కుమార్, నాయకులు వడ్ల నందు, శ్రీధర్‌రెడ్డి, కృష్ణ, రాంచెందర్, వీరారెడ్డి, రాజు, శాంతుకుమార్, లలిత, సాహు శ్రీలత, వీరేశం, సందీప్, ఆంజనేయులు, వడ్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి పోస్టులు సిగ్గుచేటు అనంతగిరి: కేటీఆర్ సోషల్ మీడియా గ్రూప్‌లో తన ఆరోగ్యంపై నీచమైన పోస్టులు పెట్టడం సిగ్గుచేటని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయి పటేల్ జయంతిని పురస్కరించుకొని సోమవారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్‌గ్రౌండ్‌లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత పటేల్జీకే దక్కుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక చిన్న చిన్న రాజ్యాలను, సంస్థానాలతో మాట్లాడి భారతదేశంలో విలీనం చేశారన్నారు. ఇటీవల తన గుండెకు ఆపరేషన్ జరిగిందని, ప్రజలు, అభిమానుల ఆశీస్సులతో త్వరగా కోలుకున్నానని తెలిపారు. వరందరికీ ధన్యవాదాలు అన్నారు. కేటీఆర్ సోషల్ మీడియాలో నీవు సావురా.. సచ్చిపోరా అని పోస్టులు పెట్టారన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం నాకేం కాదన్నారు. మేం కవితను లోపల వేశాం కాంగ్రెస్‌కు దమ్ముంటే కేటీఆర్‌ను జైల్లో పెట్టాలి సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మంబాపూర్లో 30 అడుగుల బీజేపీ జెండా ఆవిష్కరణ -
ఎడ్యుకేషన్ హబ్ పనుల్లో వేగం పెంచాలి
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్ శివారులో ఎడ్యుకేషన్ హబ్‌కు కేటాయించిన స్థలాన్ని ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి సోమవారం పరిశీలించారు. ఇందుకు కేటాయించిన 224.04 ఎకరాల స్థలానికి సంబందించిన హద్దులను, వివిధ విద్యాలయాలకు కేటాయించిన స్థలాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ హబ్‌కు సంబందించిన పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం అన్ని విద్యాలయాలకు కేటాయించిన స్థలాలు చూడాగానే గుర్తుండేలా జెండాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయభాస్కర్ రెడ్డి, డీఈఈ రాజయ్య, ఏఈలు విజయభాస్కర్ రెడ్డి, జనార్ధన మూర్తి పాల్గొన్నారు. ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి -
కొడంగల్ రావాలె..
మంగళవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2025గొప్ప చదువుకు సీఎం సభ హైలెట్స్ కొడంగల్: ‘గొప్ప చదువు చదవాలంటే కొడంగల్‌కు రావాలే.. రూ.5 వేల కోట్లతో విద్యా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నాం.. ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బొంరాస్‌పేట మండలం ఎన్కేపల్లి సమీపంలో సోమవారం అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇక్కడే రూ.103 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా సంఘాలకు కేటాయించిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. సంఘం సభ్యులకు చెక్కులు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతోనే తనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. 70 ఏళ్లపాటు ఈ ప్రాంతం వెనుకబాటుకు గురైందని ఇప్పుడు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటి కోసం రూ.5 వేల కోట్లు వెచ్చించి ప్రత్యేక క్యాంపస్ నిర్మిస్తామని.. ఏడాదిన్నరలోపు పనులను పూర్తి చేస్తామన్నారు. కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో లక్షా 5వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రూ.5 వేల కోట్లు మంజూరు చేశామన్నారు. త్వరలో వికారాబాద్ – కృష్ణ రైల్వే లైన్ పనులు ప్రారంభించి మూడేండ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గురుకులాలకు అధునాతన వసతులతో కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పారు. క్రీడా ప్రాంగణం, ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్, కొడంగల్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. లగచర్లకు పారిశ్రామిక వాడ గుర్తింపు తెస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 312 పాఠశాలకు చెందిన 28 వేల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అండగా ఉంటూ అమ్మలా ఆకలి తీరుస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ్మ, వాకిటి శ్రీహరి, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ స్నేహమెహ్ర, కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గం ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాకారుల ధూంధాం ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు మొదటి ప్రాధాన్యత రూ.5 వేల కోట్లతో ప్రత్యేక క్యాంపస్ 70 ఏళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఎన్కేపల్లి సమీపంలో అక్షయ పాత్ర కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమిపూజ -
అదృశ్యమైన వృద్ధురాలు.. శవమై తేలింది
అనుమానాస్పద మృతిగా కేసు పూడూరు: వారం క్రి తం అదృశ్యమైన వృద్ధురాలు ఓ పాడుబడిన ఇంటిలో శవమై తేలింది. ఈ ఘటన చన్గోముల్ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ భరత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి రాములమ్మ(80) ఈ నెల 18న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం గ్రామానికి చెందిన జలీల్మియాకు చెందిన పాడుబడిన ఇంటి నుంచి దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు వెళ్లి పరిశీలించగా ఓ గోనె సంచి మూట కనిపించింది. అది విప్పి చూడగా తప్పిపోయిన రాములమ్మ మృతదేహం లభ్యమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన తల్లిమృతిపై అనుమానం ఉందని కుమారుడు పోలీసలుకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. మోసం చేసిన వారిపై కేసు ఇబ్రహీంపట్నం రూరల్: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని డబ్బుల వసూళ్లకు పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపారు. కుర్మల్‌గూడకు చెందిన కళ్లెం అంజయ్య, సునీల్‌కుమార్ 36 మంది వద్ద ప్లాట్లు ఇప్పిస్తామని మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. సోమవారం ఈ మేరకు విచారణ చేపట్టి ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మహిళ ఆత్మహత్య మొయినాబాద్: వ్యక్తిగత కారణాలతో ఓ హెడ్ కానిస్టేబుల్ భార్య ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మున్సిపల్ కేంద్రంలో సోమవారం వెలుగుచూసింది. ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మండలం వెంకన్నగూడకు చెందిన హెడ్ కానిస్టేబుల్ సోలిపేట సాయికుమార్ మున్సిపల్ కేంద్రంలోని గుల్షన్ కాలనీలో ఇళ్లు నిర్మించుకుని భార్య నిర్మల(28), ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. సాయికుమార్ సైబరాబాద్ హెడ్ క్వాటర్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. కాగా సోమవారం మధ్యా హ్నం 3గంటలకు నిర్మల తల్లి యాదమ్మ కూతు రు ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూసేసరికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో భయాందోళనతో పెద్దగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు సూసైట్ నోట్ లభించింది. నా చావుకు ఎవరూ కారణం కాదు. వ్యక్తిగత కారణాలతోనే చనిపోతున్నా.. అంటూ రాసి ఉంది. పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఆన్లైన్ లోన్ వేధింపులకు యువకుడి బలి ఇబ్రహీంపట్నం: ఆన్లైన్ లోన్ నిర్వాహకులు పెట్టే వేధింపులు భరించలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ చందర్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. దండుమైలారం గ్రామానికి చెందిన అచ్చిన నవీన్(23) ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలోని సిలింగ్ హుక్కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సేపటికే అతని సోదరి గుర్తించి ఇరుగుపొరుగు వారికి, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కిందికి దించారు. అప్పటికే నవీన్ మృతి చెందినట్లు గుర్తించారు. అతని మొబైల్ పరిశీలించగా ఆన్లైన్లో రుణాలు తీసుకున్నాడని.. దీంతో లోన్ నిర్వాహకులు వేధింపులకు గురిచేసే సందేశాలు పంపడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ చందర్‌సింగ్ తెలిపారు. -
చెంచు కుటుంబాలకు సొంతిళ్లు
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తాండూరు రూరల్: చెంచు కుటుంబాలకు సొంతింటి కల నేరవేరుస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దేముల్ మండలం చైతన్యనగర్‌లో ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ చెంచు కుటుంబానికి పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. పెద్దేముల్ మండలం చైతన్యనగర్‌లో 163 ఇళ్లు, బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలో 14 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. అనంతరం చెంచు మహిళలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జాదవ్, తహసీల్దార్ వెంకట్‌ప్రసాద్, ఎంపీడీఓ రతన్‌సింగ్, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణరెడ్డి నాయకులు మహిపాల్‌రెడ్డి, ఉప్పరి మల్లేశం, రియాజ్, శోభారాణి, డీవై నర్సింలు పాల్గొన్నారు. కొడంగల్‌లో స్వచ్ఛంద బంద్ కొడంగల్ రూరల్: శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే విద్యా సంస్థల నిర్మాణం చేపట్టాలని కేడీపీ జేఏసీ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంతో సోమవారం పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ముందుగా శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లోనే అప్పాయిపల్లిలో మెడికల్ కళాశాల, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలతోపాటు మున్సిపల్ పరిధిలోని పాతకొడంగల్లో సమీకృత గురుకులాలను అక్కడే నిర్మించేందుకు కృషిచేయాలని వ్యాపార సముదాయాలను మధ్యాహ్నం వరకు మూసివేశారు. పేదలకు ఉపాధి పనులు కల్పించాలి ఏఎంసీ వైస్ చైర్మన్ రామ్మోహన్‌శర్మ కుల్కచర్ల: పేదలకు ఉపాధిహామీ పనులు కల్పిస్తూ ఆర్థిక సహకారం అందించాలని ఏఎంసీ వైస్ చైర్మన్ రామ్మోహన్‌శర్మ అన్నారు. సోమవారం చౌడాపూర్ మండలం మరికల్లో ఉపాధిహామీ పనులపై ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులకు ఉపాధి కల్పించడంతో పాటు వారికి సమయానుకూలంగా బిల్లులు అందేలా చూడాలన్నారు. గతేడాది తప్పులు జరిగితే వాటిని రీపేమెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బిల్లులు అందేలా చర్యలు హౌసింగ్ ఏఈ నవీన్ కుమార్ దోమ: ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసు కోవాలని హౌసింగ్ ఏఈ నవీన్‌కుమార్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని శివారెడ్డిపల్లిలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు నిర్మించుకుంటన్న ఇళ్ల కొలతలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ వారికి త్వరితగతిన బిల్లులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎలక్షన్ కోడ్ వస్తే బిల్లులు జాప్యం అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. కొందుర్గు: తమ పంట పొలాల మీదుగా రోడ్డు వేయొద్దంటూ మండలంలోని చుక్కమెట్టు, ముట్పూర్, ఉమ్మెంత్యాల గ్రామాల రైతులు సోమవారం నగరంలోని హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగించే తమ భూములు తీసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. పచ్చని పంట పొలాల్లో రోడ్డు వేయడం ఏమిటని నిలదీశారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాలని, లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. కార్యక్రమంలో రైతులు యాదయ్య గౌడ్, రాజు, చెన్న కేశవులు, నర్సింహారెడ్డి, కిష్టారెడ్డి, మల్లేష్, రామయ్య, రాములు, నర్సింలు, శివ తదితరులు పాల్గొన్నారు. -
రక్షణ కల్పించలేకపోతే ఆయుధాలివ్వండి
షాద్‌నగర్: పేదలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వానికి చేతకాకపోతే వారికి ఆయుధాలిచ్చి లైసెన్సులు జారీ చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఫరూఖ్‌నగర్ పరిధిలోని ఎల్లంపల్లిలో ఇటీవల దారుణహత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కులాంతర వివాహానికి సహకరించాడని దళితుడైన రాజశేఖర్‌ను దారుణంగా హతమార్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. సమాజంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అందులో బహుజన వర్గాల వారే చితికిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వారికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హోంశాఖను తన వద్దే ఉంచుకొని పేదలను కాపాడలేకపోతున్నారని, బహుజనులను రక్షించడం చేతకాకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరువు హత్య జరిగినా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్డూరి లక్ష్మణ్ బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. రాజశేఖర్ హత్యకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, నిర్లక్ష్యంగా వ్యహరించి పోలీసులపై చర్యలు చేపట్టాలని అన్నారు. దిశ ఎన్కౌంటర్ తరహాలో నిందితులకు శిక్ష పడాలన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకోవాలని, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, నాయకులు కొందూటి నరేందర్, ఎంఎస్ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ హత్యకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి దిశ ఎన్కౌంటర్ తరహాలో నిందితులకు శిక్ష పడాలి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ -
మహిళా సమాఖ్యకు పెట్రోల్ బంక్
దుద్యాల్: మహిళా సాధికారత కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని పలువురు మహిళలు కొనియాడారు. ఇందులో భాగంగానే ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఆర్టీసీలో బస్సుల నిర్వహణ, పెట్రోల్ బంకులు, క్యాంటిన్లు ఏర్పాటు చేయిస్తున్నారని తెలిపారు. దుద్యాల మండలానికి మంజూరైన పెట్రోల్ బంకు అనుమతి పత్రాలను సోమవారం కొడంగల్ సభలో మండల మహిళా సమాఖ్య సభ్యులకు అందజేశారు. సంఘం అధ్యక్షురాలు గోవిందమ్మ, కార్యదర్శి సత్యమ్మ, కోశాధికారి సునీత తదితరులు సీఎం చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందుకున్నారు.అనుమతి పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి -
లెక్క తేలింది
జిల్లాలో రిజర్వేషన్లు ఇలా.. వికారాబాద్: ఎట్టకేలకు గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల లెక్క తేలింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో 50 శాతానికి మించకూడదని నిర్ణయించింది. సోమవారం ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ వీడింది. బీసీలు మాత్రం నిరాశకు లోనయ్యారు. ఆ సామాజిక వర్గానికి చెందిన రిజర్వేషన్లు 18 శాతానికి పడిపోయాయి. వంద శాతం ఎస్టీలు నివసించే ఆవాసాలు పూర్తిగా వారికే కేటాయించారు. మిగతా జీపీలను మండల జనాభా యూనిట్‌గా తీసుకుని ముందుగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఖరారు చేశారు. అనంతరం పూర్తి రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా కేటాయించారు. దీంతో ఓవరాల్‌గా జిల్లాలో బీసీలకు 18 శాతం రిజర్వేషన్లు దక్కగా కొన్ని మండలాల్లో జనాభా ప్రాతిపదికన 13 లేదా 14 శాతం స్థానాలు కూడా దక్కాయి. బీసీలకు తీవ్ర అన్యాయం ప్రభుత్వ హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి ఉంటే 250 జీపీలు ఆ సామాజిక వర్గానికి దక్కాల్సి ఉండేది. ప్రస్తుతం 107 సీట్లు మాత్రమే దక్కాయి. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఆశావహులు అందుకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు సంతోషంలో మునిగిపోగా ప్రతికూలంగా వచ్చిన వారు నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో 594 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న జీపీలను ఆ సామాజిక వర్గానికే రిజర్వు చేశారు. దీంతో బీసీలకు అన్యాయం జరిగిందనే వాదన తెరపైకి వచ్చింది. గతంలో జిల్లాలో 4,850 వార్డులు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 5,058కు చేరింది. ఆశావహులు పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ గ్రూపులు, వర్గాలను కూడగట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నాయకులు, ఆయా వర్గాల నుంచి మద్దతు కోరుతున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో.. సర్పంచుల పదవీ కాలం గతేడాది జనవరి 31తో ముగియగా ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తి కావాల్సి ఉన్నా ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు కావడం ఆశావహుల్లో ఆనందం నింపింది. ఇప్పటికే ఓటరు జాబితాను సిద్ధం చేశారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు కసరత్తు కూడా పూర్తయింది. దీంతో అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఇక వరుస ఎన్నికలు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, డీపీఓలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా కసరత్తు పూర్తి చేశారు. గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు జిల్లాలో మొత్తం 594 జీపీలు మహిళలకు కేటాయించిన స్థానాలు 278 ఎస్టీలకు 119 ఎస్సీలకు 111 బీసీలకు 107 ఆశావహుల్లో వీడిన ఉత్కంఠ సామాజికవర్గం మహిళలు అన్ రిజర్వ్డ్ మొత్తం శాతం ఎస్టీ (వందశాతం ఎస్టీ జనాభా ఉన్న తండాలు) 47 45 92 ఎస్టీ (జనాభా ప్రాతిపదికన) 07 20 27 ఓవరాల్‌గా ఎస్టీలకు కేటాయించిన స్థానాలు 54 65 119 20 ఎస్సీ 51 60 111 18.6 బీసీ 49 58 107 18 అన్ రిజర్వ్డ్ 124 133 257 43 -
రోడ్ల పక్కనే ధాన్యం కొనుగోళ్లు!
దోమ: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రత్యేక స్థలాలు ఉన్నప్పటికీ, కొంతమంది నిర్వాహకులు ఇష్టారాజ్యంగా, ప్రమాదకరంగా ధాన్యం సేకరిస్తున్నారు. ఆరుగాళలం శ్రమించి పండించిన పంటను రైతులు ఆరబెట్టుకొని, తూకం చేసి సంచులలో నింపి ట్రాక్టర్లలో తీసుకువస్తుండగా, రోడ్ల పక్కనే లారీలు నిలిచి అందులోకి డంప్ చేస్తున్నారు. ప్రధాన రహదారులపై, మూల మలుపుల వద్ద లారీల్లోకి ధాన్యం దించుతున్నారు. ఈ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. బొంపల్లి, బొంపల్లితండా, బాస్పల్లి గ్రామాలకు చెందిన బొంపల్లి పీఏసీఎస్ సెంటర్లో ధాన్యం విక్రయిస్తారు. సాధారణంగా కేంద్రం నిర్వాహకులు ధాన్యం దించుకుని, తేమ, తాలు శాతాన్ని పరిశీలించాలి. ఆతర్వాతే తూకం వేసి లారీలోకి ఎక్కించాలి. కానీ ఇక్కడ మాత్రం పరిగి– మహబుబ్‌నగర్ ప్రధాన రోడ్డు పక్కనే లారీలను నిలిపి, నేరుగా ట్రాక్టర్ల నుంచి ధాన్యం సంచులు లోడ్ చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సెంటర్ ప్రాంతంలోనే కొనుగోళ్లు, సురక్షిత స్థలంలోనే లోడింగ్ పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. బొంపల్లి సెంటర్ నిర్వాహకుల ఇష్టారాజ్యం పరిగి– మహబూబ్‌నగర్ ప్రధాన రోడ్డు పక్కనే లోడింగ్ ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని వాహనదారుల మండిపాటు -
రహదారి ఆక్రమణకు యత్నం
దుద్యాల్: ప్రజలు నడిచే రహదారికి అడ్డంగా గొయ్యి తీసి ఆక్రమించడంతో ఓ నిండు బాలింత తీవ్ర అవస్థ పడిన సంఘటన మండల పరిధిలోని పీర్లగడ్డ తండాలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుముల్ మైల్వార్ నుంచి చెట్టుపల్లి తండాకు వెళ్లే ప్రధాన దారి నుంచి పీర్లగడ్డ తండాకు రోడ్డు ఉంది. కొన్నేళ్లుగా తండావాసులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ దారికి బీటీ రోడ్డు సైతం మంజూరైంది. అయితే చిలుముల్ మైల్వార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భూమిలో ఈ రోడ్డు ఉందని అడ్డంగా పెద్ద గోతి తీశాడు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే క్రమంలో తండాకు చెందిన కవితబాయి వారం రోజుల క్రితం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. ఆపరేషన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు ఆమెను డిశ్ఛార్జ్ చేశారు. రాత్రి 7 గంటలకు ఇంటికి వస్తున్న బాలింతకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వెళ్లేందుకు మార్గంలేక చీకటిలో అలానే నిరసించిపోయారు. చివరకు స్థానికులు ఆమెను గోతిని దాటించారు. అప్పటికే గుమిగూడిన తండావాసులు రోడ్డు ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గొయ్యి తీయడంతో అవస్థ పడిన బాలింత -
బీసీ జేఏసీ పరిగి చైర్మన్‌గా సదానందం
పరిగి: బీసీ జేఏసీ పరిగి నియోజకవర్గ చైర్మన్‌గా పరమటి సదానందంను నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ హన్మంతుముదిరాజ్ సమక్షంలో నియోజకవర్గ నూతన కమిటీని ఎంపిక చేసుకున్నారు. వైస్ చైర్మన్‌గా ఆనంద్‌గౌడ్, ఉపాధ్యక్షులుగా చెరుకు సత్తయ్య, ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శులుగా వెంకట్రాములు, యాదయ్య, ముఖ్య సలహాదారులుగా వెంకటేష్, జగన్మోహన్, నర్సింహులు, బాలముకుందం, పాండురంగాచారి, సంయుక్త కార్యదర్శులుగా ఆంజనేయులు, శ్రీనివాస్, వెంకటేష్, లక్ష్మణ్‌లను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ బీసీల ఐక్యత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య అనంతగిరి: వికారాబాద్ మండలం గోధుమగూడ–ధారూరు రైల్వేస్టేషన్ సమీపంలో యాలాల మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన బాలకృష్ణ(19) ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు నగరంలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో లోకో పైలట్ చూస్తుండగానే రైలు కింద పడి అతడు మృతి చెందినట్లు ఽరైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కాగా మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ హరిప్రసాద్ తెలిపారు. -
తాగునీటికి తండ్లాట
కుల్కచర్ల: నీటి కటకటతో హీర్యనాయక్ తండా వాసులు ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరాలో అంతరాయం కలగడంతో గిరిజనులు సమీప పొలాల వద్దకు వెళ్లి, తెచ్చుకుంటున్నారు. మూ డు రోజులుగా ఇబ్బంది పడుతున్నామని, అధికారులు స్పందించి, తాగునీటి సమస్యను పరిష్కరించాలని తండావాసులు కోరుతున్నారు. బోరులో కెమికల్ వాటర్ తాండూరు రూరల్: వ్యవసాయ పొలంలో బోరు వేయగా కెమికల్ నీళ్లు వచ్చిన సంఘటన మండలంలోని గుంతబాసుపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామ శివారులో మాజీ సర్పంచ్ జగదీష్ తన పొలంలో నూతనంగా బోరు మోటారు తవ్వించారు. 360 ఫీట్లు వేసిన తర్వాత బోరు నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. తీరా నీటిని చూసిన వారు షాక్ అయ్యారు. మోటారు నుంచి కెమికల్ వాసన రావడంతో పాటు నీళ్లు డీజిల్ మాదిరిగా వచ్చాయి. గతంలో గ్రామ శివారులో విండోస్ కెమికల్ ఫ్యాక్టరీ కొనసాగేది. ఆ ఫ్యాక్టరీ నిర్వాహకులు వ్యర్థ జలాలను బోరు వేసి భూమిలోకి రివర్స్ పంపించారు. అప్పట్లో ఇలా చేయడం ద్వారానే ప్రస్తుతం గ్రామ శివారులోని పొలాల్లో బోరు నుంచి కెమికల్ నీళ్లు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వారం రోజుల క్రితం ఓ రైతు వ్యవసాయ పొలంలో బోరు వేయడంతో పాటు, గ్రామానికి వాటర్ ప్లాంట్ కోసం బోరు వేసిన సమయాల్లో సైతం ఇలా కెమికల్ నీళ్లు వచ్చాయని గ్రామస్తులు చెబుతున్నారు. చిక్సిత పొందుతూ మహిళ మృతి మొయినాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జా తీయ రహదారిపై మొయినాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చెందింది. మొయినాబాద్ సమీపంలోని ఆన్ ది వే డ్రైవ్ ఇన్ హోటల్(పెంటయ్య హోటల్) వద్ద శుక్రవారం ఉదయం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో క్యాబ్ డైవర్ కరీం అక్కడికక్కడే మృతి చెందగా ఫొటో గ్రాఫర్ లోకేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో తలకు గాయమై తీవ్రంగా గాయపడిన హోండా కారు డ్రైవర్ తాండూరుకు చెందిన వెంకట్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అదే ప్రమాదంలో తలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుజాత (50) పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందింది. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. గాయపడిన మరో ము గ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేడపై నుంచి జారి పడి వ్యక్తి దుర్మరణం ఇబ్రహీంపట్నం రూరల్: తమ్ముడి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిన ఓ అన్న మేడపై నుంచి జారి పడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన కుంచెల ముత్యాలు వివాహం ఈ నెల 26న జరగాల్సి ఉంది. దీనికి ఆయన సోదరుడు శ్రీశైలం(30) పెళ్లి పత్రికలు పంచడానికి శనివారం తుర్కయంజాల్‌లో వారి బంధువు విష్ణు ఇంటికి వెళ్లాడు. రాత్రి కావడంతో భోజనం చేసి ఇల్లు ఇరుకుగా ఉండడంతో మూడు అంతస్తుల మేడపై అందరూ నిద్రపోయారు. తెల్లవారుజామున 2 గంటల చూసే సరికి శ్రీశైలం పక్కన కనిపించలేదు. దీంతో చుట్టూ వెతకగా కింద కుక్కలు అరస్తుండటం గమనించడంతో దగ్గరకు వెళ్లి చూశారు. అక్కడ తీవ్ర గాయలతో శ్రీశైలం విగత జీవిగా పడి ఉన్నాడు. నిద్రమత్తులో రేయిలింగ్‌పై నుంచి పడి చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం..మహిళ మృతి వెంగళరావునగర్ : గ్యాస్ లీక్ కావడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ రహమత్‌నగర్ కమాన్‌గల్లీలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సతీష్‌సింగ్, సోనూబాయి(40) దంపతులు కమాన్‌గల్లీలో నివాసముంటున్నారు. ఆదివారం ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతం చేసుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మధ్యాహ్నం సోనూబాయి వంట చేస్తోంది. ఒక్కసారిగా వంటింట్లో్ంచి కేకలు వినిపించాయి. సోనూబాయి తల్లిదండ్రులు వంటగదిలోకి వచ్చి కుమార్తెను రక్షించారు. ఈ ప్రయత్నంలో వారికి కూడా మంట లు అంటుకున్నాయి. హుటాహుటిన సమీ పంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళగా అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించా రు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండ గా మంటలు పెద్ద ఎత్తున గది నిండా వ్యాపించాయి. ఫిల్మ్‌నగర్ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. -
ఇందిరమ్మ ఇళ్లకు ‘ఉపాధి’
● 90 రోజుల పాటు కూలీ డబ్బుల పంపిణీ ● జాబ్‌కార్డు ఉన్న లబ్ధిదారులకు మేలు ● నిర్మాణాల్లో వేగం పెరిగే అవకాశం లబ్ధిదారులకు ఊరట ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం అదనంగా ఇచ్చే 90 రోజుల పని దినాల డబ్బులు ఇంటి నిర్మాణదారులకు మరించి ఊరటనిస్తుంది. సర్కారు ఇచ్చే రూ.5 లక్షలకు అదనంగా రూ.27,630 కూలీ డబ్బులు, రూ.12 వేలు బాత్రూం బిల్లు ఇవ్వడంతో ఇంటి నిర్మాణాల్లో వేగం పెరుగుతోంది. – అనురాధ, ఎంపీడీఓ, నవాబుపేట నవాబుపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరింత మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటి నిర్మాణానికి ఇప్పటికే రూ.5 లక్షలు ఇస్తుంది. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో సర్కారు రాయితీపై ఇసుకను సరఫరా చేస్తుంది. ఇంత వెసులుబాటు ఉన్నప్పటికీ ఇంకా సగం మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడంలేదు. దీంతో పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉపాధిహామీని తోడు చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా అదనపు ప్రయోజనం దక్కనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ, ఉపాధిహామీ అధికారులు కూలీలలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఇలా అమలు చేస్తారు ఇందిరమ్మ పథకం కింద మొదటి విడతలో నవాబుపేట మండలానికి 700 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 341 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. జాబ్ కార్డు ఉన్న ఇందిరమ్మ గృహ లబ్ధిదారులను అర్హులుగా గుర్తించి 90 రోజుల పని దినాలు కల్పిస్తారు. వారికి రోజుకు రూ.307 చొప్పున రూ.27,630 కూలీల ఖర్చు కోసం చెల్లిస్తారు. అదనంగా రూ.12 వేలు బాత్రూం బిల్లు చెల్లిస్తారు. పునాది స్థాయిలో 40 రోజులు, పైకప్పు స్థాయిలో 50 రోజులు కూలీ దినాలు వేయాలని నిబంధన పెట్టారు. ఇంకా స్లాబ్ పడగానే ఆ లిస్టును గృహనిర్మాణ శాఖ అధికారులు ఎంపీడీవోలకు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఽఅధికారులకు పంపిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుసంధానమైన కూలీలు ఇతర ఉపాధిహామీ పనులకు వెళ్లడానికి అవకాశం ఉండదు. సంవత్సరం అయ్యాక మళ్లీ వచ్చే 100 రోజుల పనులు చేసుకోవడానికి వీలు కల్పిస్తారు. ఇంటి నిర్మాణస్థాయిని లబ్ధిదారుడు ఫొటోతో సహా ఆన్లైన్లో నమోదు చేస్తారు. పనులు పూర్తయినా అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి బిల్లుల చెల్లింపులకు అనుమతిస్తారు. అప్పుడు ఎంపిక చేసి లబ్ధిదారుల పేర్లపై మస్టర్ రాసి మేమెంటు చేస్తారు. మండలంలో 29 మంది ఎంపిక మండలంలో 700 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా అందులో 341 ఇళ్లు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికి 29 మంది లబ్ధిదారులకు ఉపాధిహామీ కింద ఇచ్చే 90 రోజుల పని దినాలు చెల్లించమని ఆదేశాలు వచ్చాయి. దీంతో కూలీలకు అదనంగా లబ్ధి చేకూరనుంది. -
సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం
● ఓఆర్ఆర్పై లారీని వెనుక నుంచి ఢీకొన్ని డీసీఎం ● ఒకరి దుర్మరణం,ఇద్దరికి తీవ్ర గాయాలు అబ్దుల్లాపూర్‌మెట్: ఔటర్ రింగ్ రోడ్డుపై ముందుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో వెనుక నుంచి వచ్చి డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందడంతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ గుజ్జ గ్రామానికి చెందిన బంగారు సతీష్‌కుమార్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర గ్రామానికి చెందిన సూరజ్కుమార్రామ్, అజిత్ రామ్‌లు అదే మండలం నాగారం గ్రామానికి చెందిన రాచకొండ భిక్షం వద్ద కోళ్లు సరఫరా చేసే డీసీఎంపై ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున యాచారం నుంచి దమ్మాయిగూడకు కోళ్లను తీసుకుని వస్తుండగా మార్గమధ్యలో ఔటర్ రింగ్‌రోడ్డుపై గండిచెరువు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేసి నిలిపివేశాడు. దీంతో అప్పటికే వేగంగా ఉన్న డీసీఎం లారీకి వెనుక భాగంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎంలో ప్రయాణిస్తున్న సూరజ్‌కుమార్ రామ్(34) క్యాబిన్లో ఇరుక్కుపోయి శరీరమంతా నుజ్జునుజ్జు అయి అక్కడిక్కడే మృతిచెందాడు. సతీష్‌కుమార్, అజిత్రామ్లకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యంత్రాలు లేక.. పంటలు తెగక
● సరిపడా హార్వెస్టర్లు దొరకని వైనం ● నేలవాలుతున్న వరి పొలాలు ● అల్పపీడనంతో ఆందోళన చెందుతున్న రైతులు అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు పంట చేతికొచ్చిందని సంబరపడేలోపు సరిపడా వరికోత యంత్రాలు (హార్వెస్టర్లు) దొరకక మదన పడుతున్నారు. మరోవైపు అల్పపీడనం ఏర్పడడంతో వర్షాల భయం వెంటాడుతోంది. దోమ: ఆరుగాలం శ్రమించి పంటల సాగు చేసే రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. సాగు చేసిన నాటి నుంచి పంటలను కాపాడుకునేంత వరకు అన్నీ ఇబ్బందులే. ప్రస్తుతం పంటలను కోసి ధాన్యం విక్రయించుకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పంట కాలం పూర్తి కావడంతో పొలాలు వరి కోతలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ సరిపడా వరి కోత మిషన్లు(హార్వెస్టర్లు) లేకపోవడంతో అయోమయంలో పడ్డారు. ఓ పక్క తుపాను ధాటికి అనేక పంటలు దెబ్బతిన్నప్పటికి.. మళ్లీ అల్పపీడనం ఏర్పడిన వార్త కర్షకుల గుండెల్లో గుబులు రేపుతోంది. దీంతో ఎక్కడ వర్షాలు కురిసి పంటలు నాశనం అవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. నిత్యం వరి కోత యాంత్రాల వద్దకు పరుగులు తీస్తూ గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వాలిపోతున్న పొలాలు మండల వ్యాప్తంగా ఎక్కువ మంది రైతులు వరి సాగునే ఎంచుకున్నారు. వానకాలం సీజన్లో మండలంలో 16,210 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం ఆ పొలాలన్ని కోత దశకు చేరుకున్నాయి. వరి కోత యంత్రాలు దొరకకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్న యంత్రాలు సమయానికి రాక కోత దశకు చేరుకున్న పంటలు తారిపోయి నేలవాలిపోతున్నాయి. ఇప్పటికే మోంథా తుపాన్ రైతులను తీవ్రంగా నష్టం చేసినప్పటికీ.. అల్పపీడనం ఏర్పడడంతో రైతులు తీవ్ర కలవరపాటుకు లోనవుతున్నారు. వర్షాలు కురిస్తే ఇన్నాళ్లు చేసిన కష్టం వృథాగా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరి కోత యంత్రాల వద్దకు పరుగులు పెడుతున్నారు. మరి కొంత మంది కర్షకులు హార్వెస్టర్లు దొరకక కూలీలతో కోతలు చేస్తున్నారు. దీంతో భారం ఎక్కువై తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.భారీగా నష్టం పొలంలో అప్పు చేసి వరి పంటను సాగు చేశా. మోంథా తుపాన్ ప్రభావంతో పంట నేలవారిపోయింది. చేసేదేమి లేక వరికోత యంత్రాలను ఆశ్రయిస్తున్నాం. కానీ సమయానికి రావడం లేదు. దీంతో గింజలు పూర్తిగా రాలిపోతున్నాయి. తీవ్ర నష్టం వాటిల్లే ముప్పు ఉంది. – మధుసూదన్‌రెడ్డి, రైతు, బాస్పల్లి చుట్టూ తిరుగుతున్నాం యంత్రాలు దొరకక పంటను కోయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నేలవాలిపోవడంతో దిగుబడి చేతికొచ్చే పరిస్థితి లేదు. మరోపక్క మొగులు గుబులు రేపుతుండడంతో ధాన్యం ఎక్కడ పాడవుతుందోనని ఆందోళనగా ఉంది. నిత్యం హార్వెస్టర్ల చుట్టూ తిరుగుతున్నాం. – బాల్‌రెడ్డి, రైతు, గొడుగోనిపల్లి -
ఆత్మరక్షణకు కరాటే దోహదం
దోమ: ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్ఐ వసంత్ జాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రం జిల్లా పరిషత్ పాఠశాలలో డీవైఎస్ఓ (డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్) ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షణ పొందిన విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. మాస్టర్ బోయిని రాములు నెల రోజులుగా 121 మందికి కరాటేలో శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు ధృవపత్రాలు అందజేశామని మాస్టర్ తెలిపారు. చిన్నారుల్లో శారీరక, మానసిక సమతుల్యతకు, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యుద్ధ విద్య దోహపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మయ్య ముదిరాజ్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మత్తు వదలరా!
షాబాద్: యువత మత్తుకు బానిస అవుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా బానిస అవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో తమ బంగారు భవిష్యత్‌ను చేజేతులా అంధకారంలోకి నెట్టి వేసుకుంటున్నారు. అంతేకాకుండా కుటుంబాలు కూడా ఛిన్నాభిన్నం అవుతున్నాయి. మత్తుకు బానిస అయిన వారికి అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో గ్రామసభల ద్వారా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో గుట్కా నుంచి గంజాయి వరకు విచ్చల విడిగా వినియోగిస్తూ తమ జీవితలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో అధికారులు గ్రామాల బాట పట్టారు. మత్తు పదార్థాలు వాడకం వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. గంజాయి, గుట్కా, తంబాకు, మద్యం మత్తులో నేరాలకు పాల్పడుతూ కటాకటాల పాలవుతున్నారు. మత్తుతో కలిగే అనర్థాలు ● మత్తు పదార్థాలు తాగడంతో ఏం చేస్తున్నామో తెలియక అత్యాచారాలు, అఘాయిత్యాలు చేస్తున్నారు. ● తాగి వాహనడం నడపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ● చిరాకు, కోపం ఎక్కువై కుటుంబాల్లో కలహాలు ఏర్పడుతున్నాయి. ● ఆరోగ్యం క్షీణించి యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ● అధిక మత్తు పదార్థాలైన డైజోఫాం కలిపిన కల్లు తాగి మతి స్థిమితం కోల్పోతున్నారు. గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న అధికారులు యువత సన్మార్గంలో నడవాలని సూచన -
ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్‌జైన్, సిక్తా పట్నాయక్, వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్ర, సీఎంఈఓ అధికారి వాసుదేవరెడ్డి ఇతర అధికారులు ఎన్కేపల్లి గేటు సమీపంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక్కడ అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే మధ్యాహ్న భోజనం కిచెన్‌షెడ్ నిర్మాణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేస్తారు. బొంరాస్‌పేటలో గ్రంథాలయ భవన ప్రారంభోత్సవం, హకీంపేట ఎడ్యుకేషన్ హబ్, సైనిక్‌స్కూల్ నిర్మాణ పనులకు సామూహిక శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆదివారం భారీగా పోలీసులు మోహరించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. సభాస్థలి వద్ద అతిథులకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, సబ్‌కలెక్టర్ సుధీర్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, డీపీఎం నర్సింలు తదితరులు పాల్గొన్నారు. హకీంపేట్‌లో ఏరియల్ సర్వే దుద్యాల్: కొడంగల్ పర్యటనలో భాగంగా సీఎం దుద్యాల్ మండలం హకీంపేట్‌లో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించే అవకాశం ఉందని ఎడ్యుకేషన్ హబ్ సూపరింటెండెంట్ ఇంజనీయర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఆదివారం హకీంపేట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హకీంపేట్ పర్యటన రద్దయిన నేపథ్యంలో హెలిక్యాప్టర్ నుంచి విద్యాలయాలకు కేటాయించిన స్థలాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎడ్యుకేషన్ హబ్ డీఈఈ పీ రాజయ్య, ఏఈ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్కేపల్లి గేటు వద్ద సభాస్థలిని పరిశీలించిన వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ, ఉన్నతాధికారులు -
సీఎం సాబ్.. జర దేఖో!
వికారాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం జిల్లాకు రానున్న నేపథ్యంలో వరాల జల్లు కురిపిస్తారనే ఆశలో జనం ఉన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే మధ్యాహ్న భోజనం కిచెన్‌షెడ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. అక్కడి నుంచే జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాతారు. ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయిన కొత్తలో కోస్గీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు.. ఆ తర్వాత రెండు సార్లు దసరా పండుగకు, ఓ సారి పోలెపల్లి జాతరకు చుట్టపు చూపుగా రావడం మినహా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో సీఎం హోదాలో పాల్గొన్నది తక్కువే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండుళ్లు కావస్తున్నా నియోజకవర్గం దాటి మిగతా ప్రాంతాల్లో పర్యటించింది లేదు. ఎన్నికల సమయంలో జిల్లా అంతట పర్యటించిన ఆయన అనేక హామీలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం వరాల జల్లు కురిపిస్తారని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. కడా తరహాలో ఉడాను అభివృద్ధి చేయాలని.. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే తన సొంత నియోజకవర్గం కొడంగల్ సమగ్రాభివృద్ధి కోసం కడా(కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించారు. దీంతో వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలపై వివక్ష చూపుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఏడాది క్రితం జిల్లాలోని అన్ని జీపీలు, మున్సిపాలిటీలను కలుపుతూ ఉడా(వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేశారు. కానీ పెద్దగా ప్రయోజనం చేకూరింది మాత్రం లేదు. కడా తరహాలోనే ఉడాను కూడా అభివృద్ధి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జిల్లాకు అనేక పనులు మంజూరయ్యాయి. టెండర్లు కూడా పిలిచారు. ఈ ప్రక్రియ పూర్తయి ఆరు నెలలు దాటినా పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. అనేక రహదారులు పాడై ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అభివృద్ధి, నిధుల మంజూరు విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల్లోని సమస్యల చిట్టాతో సీఎంను కలిసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రజలు ఆశిస్తున్న పనులివే.. ● ఎన్నికల సమయంలో జిల్లాలో పర్యటించిన రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. అందులో కొన్ని.. ● జిల్లాకు పాలమూరు నీళ్లు తెచ్చి రైతుల పాదాలు తడుపుతామని హామీ ఇచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ తప్ప ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ● కొత్త మున్సిపాలిటీలు పరిగి, కొడంగల్‌కు ప్రత్యేక నిధులతో పాటు వికారాబాద్, తాండూరు పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎమ్మెల్యేలు నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ● తాండూరు పారిశ్రామిక వాడకు గత ప్రభుత్వం జీఓ ఇచ్చి చేతులు దులుపుకోగా ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ● అనంతగిరి పర్యాటక అభివృద్ధి కలగానే మిగిలింది. రూ.1,000 కోట్లు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇవ్వగా పనులు నత్తను తలపిస్తున్నాయి. ● నిధులు లేక తాండూరులో బైపాస్ రోడ్డు పనులు సగంలో ఆగిపోయాయి. ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలనే డిమాండ్ ఉంది. ● జిల్లాను హార్టికల్చర్ జోన్ ప్రకటించి అభివృద్ధి చేస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. ● ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ● వికారాబాద్ ఫై ఓవర్ బ్రిడ్జి పనులు నత్తను తలపిస్తున్నాయి. ● వికారాబాద్ సమీపంలోని శివారెడ్డిపేట చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చి దిద్దాలని పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ● తాండూరు, పరిగి, కొడంగల్, వికారాబాద్ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, బ్రిడ్జిల నిర్మాణం మధ్యలో ఆగి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ● పరిగిలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. ● ధారూరు మండలం నాగసముందర్లో కాగ్నా నదిపై ఒక టీఎంసీ సామర్థ్యంతో ప్రాజెక్టు కడతామని భూ సేకరణ చేసి వదిలేశారు. ● కోట్‌పల్లి ప్రాజెక్టు అభివృద్ధి నిధులు లేక వెలవెలబోతోంది. ● మన్నెగూడ – వికారాబాద్ వరకు ఫోర్ లేన్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ● వికారాబాద్ నుంచి నవాబుపేట మీదుగా శంకర్పల్లి వరకు చేపట్టిన రోడ్డు పనులు ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ● నాలుగు మున్సిపాలిటీల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ● వికారాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ● రూ.1,000 కోట్లతో పలు రోడ్లకు టెండర్లు పలిచి ఆరు నెలలు దాటినా ఇంకా పనులు ప్రారంభానికి నోచుకోవడంలేదు. నేడు జిల్లాకు ముఖ్యమంత్రి రాక కొడంగల్ నియోజకవర్గంలో అక్షయ పాత్ర కిచెన్ షెడ్‌కు భూమిపూజ అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడనున్న రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపిస్తారనే ఆశలో జనం, ప్రజాప్రతినిధులు గతంలో నిధులు మంజూరైనా ప్రారంభానికి నోచుకోని పనులు -
చురుగ్గా జాతీయ రహదారి పనులు
యాలాల: మండలంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. చించోళి నుంచి మహబూబ్‌నగర్ వరకు నాలుగు లేన్ల(167 నేషనల్ హైవే) రోడ్డు పనులు మంజూరు కావడంతో కల్వర్టులు, భారీ సైడ్ డ్రైనేజీల నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే నెల రోజుల క్రితం సబ్ కాంట్రిక్టర్లు బిల్లులు మంజూరు కాకపోవడంతో వారం నుంచి పది రోజుల పాటు పనులను ఆపేశారు. ఈ సమస్యను సైట్ కాంట్రాక్టర్ సాన్వర్స్ రైల్టెక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పరిష్కరించడంతో పనుల్లో వేగం పుంజుకుంది. సీఎం సొంత జిల్లా కావడం, పనులు జాప్యం పట్ల ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడంతో కదలిక వచ్చింది. లక్ష్మీనారాయణపూర్, రసూల్పూర్, దౌలాపూర్, తిమ్మాయిపల్లి తదితర స్టేజీల వద్ద అవసరమైన బ్రిడ్జిలతో పాటు భారీ సైడ్ డ్రైనేజీలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే దౌలాపూర్ సమీపంలో నాలుగు లేన్ల తారు రోడ్డు పనులను పూర్తి చేశారు. రోడ్డు మధ్యలో పలు మొక్కలను సైతం నాటారు. లక్ష్మీనారాయణపూర్ నుంచి తాండూరు బైపాస్ మార్గం వరకు పనులు ఊపందుకుంటున్నాయి. పనులు వేగంగా జరుగుతుండటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రేమ ఉన్నచోటే పరమాత్ముడు ఉంటాడు
● హైకోర్టు ప్రముఖ న్యాయవాది సాయిప్రసాద్ ● ఘనంగా భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు అనంతగిరి: ప్రేమ ఉన్నచోటే పరమాత్ముడు ఉంటాడని హైకోర్టు ప్రముఖ న్యాయవాది డా. ఎస్ సాయిప్రసాద్ అన్నారు. ఆదివారం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు వికారాబాద్‌లోని స్థానిక జ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవ ప్రతిఫలాపేక్షతో చేయకూడదని ప్రేమతో చేయాలని, ప్రేమ ఉన్నచోటే పరమాత్ముడు ఉంటాడని తెలిపారు. బాబా ఒక వ్యక్తి కాదని అతడు ఒక వ్యవస్థ అని, అందుకే సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచంలోని అనేక దేశాల్లో వెలిశాయన్నారు. మనిషి వికాసానికి శాస్త్ర విజ్ఞానం, దైవ విశ్వాసం రెండు ముఖ్యమేనన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన డా.చంద్రశేఖర్ పట్నాయక్ మాట్లాడుతూ.. నిష్కామ కర్మతో చేసిన ఏ మంచి పనైనా సేవే అని పేర్కొన్నారు. పరమ సత్యాన్ని ఎవరో వచ్చి బోధించరని, నీకు నీవే తెలుసుకోవాలన్నారు. జ్ఞాన కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు డా. హారతి ద్వారకానాథ్ మాట్లాడుతూ.. సత్యధర్మ శాంతి, ప్రేమ, అహింస అనే మానవతా విలువలను పాఠాలుగా బోధిస్తూ కోట్ల మంది భక్తుల గుండెల్లో సత్యసాయి కొలువయ్యారని పేర్కొన్నారు. అందరినీ ప్రేమించు.. సేవించు అన్న సాయి సూక్తి మన జీవితాన్ని మహోన్నతం చేస్తుందని తెలిపారు ప్రచారం ఆర్భాటం ప్రదర్శన కోసం చేసే సేవ మీ కీర్తి ప్రతిష్టలు పెంచవచ్చు కానీ.. అది సమాజానికి మంచి సందేశాన్ని స్ఫూర్తిని ఇవ్వలేదని నొక్కి చెప్పారు. అనంతరం వికారాబాద్ మండల, జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను సన్మానించి జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు ప్రదానం చేశారు. సాయం కాలం దీపోత్సవం, స్వామివారి డోలారోహణం, జవహర్ బాలకేంద్రం విద్యార్థులో కూచిపూడి, భరతనాట్యం నిర్వహించారు. కార్యక్రమంలో కన్వీనర్ సత్యనారాయణ గౌడ్, ఆధ్యాత్మిక సమన్వయకుడు బందప్ప గౌడ్, జిల్లా యూత్ కోఆర్డినేటర్ బసవరాజ్, పాపయ్య, గోపాల్ రెడ్డి, సతీష్ చంద్ర, కొండ మల్లయ్య, కపిల్ దేవ్, విఠోబా, ముట్పూరి అనురాధ, కె.వర్దిని తదితరులు పాల్గొన్నారు. -
● సదర్.. అదుర్స్
దుద్యాల్: మండలంలోని ఆలేడ్ గ్రామంలో ఆదివారం రాత్రి సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో దున్నపోతులతో ఊరేగింపు నిర్వహిచారు. ఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రధాన వీధుల మీదుగా సాగింది. దున్నపోతుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు జింకల యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యాదవులంత సంఘటితం కావాలని, కలిసి కట్టుగా ఉంటూ అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, మండల అధ్యక్షుడు నర్సింలు, నాయకులు పక్కీరప్ప, వెంకటయ్య, అనంతయ్య, వెంకటేశ్, రమేశ్, మాజీ సర్పంచ్ రాములు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత
అనంతగిరి: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. వికారాబాద్ పట్టణంలోని రామమందిరంలో ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో నెల రోజులుగా సాగుతున్న రుద్రాభిషేక మహోత్సవం ఆదివారంతో ముగిసింది. ఉదయం ఓంకారం, సుప్రభాత సేవ, నగర సంకీర్థన, గోపూజతో ఉత్సవాలు ప్రారంభయ్యాయి. మహా గణపతి పూజ, మహన్యాస, లఘున్యాస పూర్వక లఘు రుద్రాభిషేకం నిర్వహించి శివపార్వతులకు కల్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలన్నారు. సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ, శోభాయాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో నవాబుపేట మాణిక్‌ప్రభు సంస్థాన్ పీఠాధిపతి బాలమార్తాండ మహరాజ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మంజుల, మాజీ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్, గీతావాహిణి అధ్యక్షురాలు శ్రీదేవి, సేవా మండలి ప్రతినిధులు రాజు, వెంకట్, సుభాష్ పంతులు, భోగేష్ పంతులు, యాస్కి రవీందర్, శ్రీనివాస్, విజయ్, వేణుగోపాల్, వినోద్, నరేందర్, విజయ్‌కుమార్, సుధీర్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ -
విహార యాత్రలో విషాదం
ఇబ్రహీంపట్నం రూరల్: తో టి విద్యార్థులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన విద్యార్థి మృతిచెందాడు. ఆదిబట్ల పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని బల్కంపేటకు చెందిన వేలంగి శివకుమార్ తేజ(13) అమీర్‌పేట్‌లోని నివేదిత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 21న విహార యాత్రలో భాగంగా తోటి విద్యార్థులతో కలిసి రావిర్యాల సమీపంలోని వండర్లాకు వచ్చాడు. మధ్యాహ్న భోజనం అనంతరం వండర్‌లాలోని కొలనులో ఈత కొడుతూ పడిపోయాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని, వెంటనే అంబులెన్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. బాలుడి తండ్రి సునీల్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. వండర్లాలో ఈత కొడుతూ అస్వస్థతకు గురైన విద్యార్థి మృతి -
హోటల్‌కు రూ.50 వేల జరిమానా
తుర్కయంజాల్: నిబంధనలు పాటించని హోటల్ నిర్వాహకులకు శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత రూ.50వేల జరిమానా విధించారు. వివరాలు.. మున్సిపల్ కేంద్రంలోని తులిప్స్ గ్రాండ్ హోటల్లో శుభ్రత పాటించకపోవడంతో పాటు నిల్వ ఉంచిన ఆహార పదార్థలను విక్రయిస్తున్నారనే ఆరోపణలు వచ్చా యి. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ కె.అమరేందర్‌రెడ్డి శానిటరీ సిబ్బందిని పరిశీలించాలని సూచించారు. శనివారం దాడులు నిర్వహించిన శానిటరీ అధికారులు కిచెన్ అపరిశుభ్రంగా ఉందని, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారపదరార్థలు పాడైనట్లు గుర్తించి డస్ట్‌బిన్‌లో వేయించామన్నారు. అనంతరం హోటల్ నిర్వాహకులకు జరిమానా విధించి రశీదు ఇచ్చామని తెలిపారు. కోడిపందేల స్థావరంపై ఎస్ఓటీ పోలీసుల దాడి మొయినాబాద్ రూరల్: ఓ ఫాంహౌస్‌లో కోడి పందేలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. శనివారం రాత్రి మండల పరిధిలోని బాకారం సమీపంలో ఓ ఫాంహౌస్‌లో రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు దాట్ల కృష్ణం రాజు పాటు మరో 14 మందిని అరెస్ట్ చేశారు. నాలుగు కార్లు, 13 మొబైల్ ఫోన్స్, రూ.60,950 నగదు, 22 కోళ్లు, 18 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయమై మొయినాబాద్ పోలీసులను వివరణ కోరగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
ఎనిమిది నెలలుగా ఎదురుచూపులు
● వేతనాలు అందక ఇబ్బంది పడుతున్న స్కావెంజర్లు ● పట్టించుకోని అధికారులు దౌల్తాబాద్: బాత్రూంలో బ్లీచింగ్ చల్లుతున్న స్కావెంజర్ వెంకటప్ప. ఈయన దౌల్తాబాద్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం వరకు స్కూలులోనే పనిచేస్తుంటాడు. తరగతి గదులు, గ్రౌండ్‌ను శుభ్రం చేసి ట్యాంకులకు నీరు నింపుతాడు. ఈయనకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఎనిమిది నెలలుగా జీతం లేక కుటుంబపోషణ భారంగా ఉంది. వెయ్యి మంది స్కావెంజర్లు పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే స్కావెంజర్లు, స్వీపర్లు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న వీరికి ఎనిమిది నెలలుగా జీతాలు పెండింగ్‌లోఉన్నాయి. సాలరీ సమయానికి ఇవ్వడంతోపాటు పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా పెంచాలని కోరుతున్నారు. జిల్లాలో సుమారు వెయ్యి మందికి పైగా స్కావెంజర్లు పనిచేస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని స్వీపర్లు, అటెండర్లు ఉద్యోగ విరమణ చేయడంతో కొత్తగా పర్మినెంట్ ఉద్యోగస్తుల నియామకం చేపట్టలేదు. దీంతో పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేసేందుకు గత విద్యా సంవత్సరంలో స్కావెంజర్లను నియమించారు. వీరికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. స్కావెంజర్ల విధులు ● టాయిలెట్స్ క్లీనింగ్, బ్లీచింగ్ చల్లడం, ట్యాంకులు నింపడం ● పరిసరాలు, తరగతి గదుల శుభ్రం చేయడం ● ఉపాధ్యాయులు, విద్యార్థులకు తాగునీటి ఏర్పాట్లు. వేతన వివరాలు విద్యార్థుల సంఖ్య వేతనం 1–30 రూ.3 వేలు 31–100 రూ.6 వేలు 101–250 రూ.8 వేలు 251–500 రూ.12 వేలు 501–750 రూ.15 వేలు 750కి పైగా రూ. 20 వేలు -
కిశోర బాలికలకు పంజాబీ డ్రెస్సు!
● మహిళలు ముందుకు వస్తే దాల్మిల్ ఏర్పాటు ● ఇందిరమ్మ చీరల పంపిణీలోఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరు రూరల్: 15ఏళ్ల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న కిశోర బాలికలకు ప్రభుత్వం పంజాబీ డ్రెస్స్‌లు అందజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారిస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయ న తాండూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతిని విస్మరించిందని విమర్శించారు. డ్వాక్రా మహిళలు ముందుకు వస్తే దాల్, జిన్నింగ్ మిల్లు,పెట్రోల్ బంక్, రైస్ మిల్లుల ఏర్పాటుకు బ్యాంకుల నుంచి వడ్డీ లేకుండా రూ.5 కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు రుణాలు ఇప్పించి, ప్రభుత్వ స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రేషన్‌కార్డులో పేరున్న ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర అందజేస్తామని.. మార్చి 31 వరకు చీరల పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, ఎంపీడీఓ విశ్వప్రసాద్, డీఆర్డీఏ, డీపీఎం శేఖర్, ఏపీఎం బాలయ్య, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శి భానుప్రియ, కోశాధికారి నాగమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగప్ప, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్‌చందు, ఆయా గ్రామాల డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. వారసులకు ఉద్యోగాలు కల్పించండి వయస్సు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని వీఆర్ఏలు కోరారు. శనివారం ఎమ్మెల్యే పెద్దేముల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరవగా వీఆర్ఏ లు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం ఇచ్చి న వారిలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు వెంకటయ్య, కార్శదర్శి జనార్ధన్, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, వీఆర్ఏలు ఇస్మాయిలప్ప, బాలప్ప, పురుషోత్తం, నర్సింలు, హన్మంతు, భీములు ఉన్నారు. నాణ్యమైన చీరలతో ఆడపడుచులకు గౌరవం యాలాల: నాణ్యమైన చీరలతో ఆడపడుచులకు గౌరవం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరలను నాణ్యమైనవి పంపిణీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బాల్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ నాగసాయి శ్రీనిజ, ఏపీఎం శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, నాయకులు భీమప్ప, అక్బర్‌బాబా, మధుసూదన్‌రెడ్డి, రఘురాంరెడ్డి, మహిపాల్, సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. వారసులకు న్యాయం చేయండి వయసు పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న వీఆర్ఏల తరపున వారి వారసులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు కోట్ల శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే చొరవతో తాగునీటి పైప్‌లైన్ పనులు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో తాగునీటి పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయని సొసైటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోకట్ బ్రిడ్జి నుంచి గ్రామానికి వచ్చే పైపులు వరద ధాటికి కొట్టుకుపోయాయి. ఈ విషయమై గ్రామ కాంగ్రెస్ నాయకులు ఈడ్గి రాజేశ్వర్, రాములు, నాగప్ప, సూరప్ప తదితరులు కలిసి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఆయన వెంటనే కొత్త పైప్‌లైన్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేశారు. ఆయా పనులు పూర్తి కావడంతో సొసైటీ చైర్మన్‌తో పాటు పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు భీమప్ప, జిల్లా నాయకులు ధారాసింగ్ తదితరులు కాగ్నా నది వద్ద తాగునీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎస్జీఎఫ్ జిల్లా క్రికెట్ టోర్నీ విజేతగా తాండూరు
తాండూరు టౌన్: స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన అండర్–14 జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీలో తాండూరు జట్టు విజేతగా నిలిచింది. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, పెద్దేముల్, మోమిన్‌పేట్ జోన్ల మధ్య జరిగిన పోటీల్లో తాండూరు, వికారాబాద్ జట్లు ఫైనల్‌కు చేరాయి. శనివారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వికారాబాద్ జట్టు పది ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తాండూరు జట్టు మూడు ఓవర్లు మిగిలి ఉండగానే, రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ టోర్నీలో తాండూరు జట్టు క్రీడాకారులు కీపర్, కెప్టెన్ కనవ్ పండిట్ 94 పరుగులు, ఆల్ రౌండర్ రిశ్విత్చంద్ర 77 పరుగులు, అభిలాష్ 10 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ టోర్నీలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతయ్య, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణమూర్తి, పీఈటీలు అంబదాస్, ఖాజా, నర్సింలు, రాజేందర్ రెడ్డి, గోపాల్, రాజేందర్, రాజు, మధు, కోచ్ విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఫైనల్లో విజేతగా నిలిచిన తాండూరు జట్టు క్రీడాకారులను అందరూ అభినందించారు. అండర్–14 విభాగంలో ఎనిమిది వికెట్ల తేడాతో వికారాబాద్ జట్టుపై విజయం -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి
● దేవరంపల్లిలో ఘటన ● చేవెళ్ల పీఎస్‌లో కేసు నమోదు చేవెళ్ల: అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని దేవరంపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన అలుగారి సుమతమ్మ (66) ఇంటి వద్ద ఒంటరిగా ఉంటోంది. ఆమె కొడుకు రాఘవేందర్‌రెడ్డి పిల్లల చదువుకోసం, షాబాద్ మండలం నాగరగూడలో అద్దెకు ఉంటున్నాడు. నిత్యం దేవరంపల్లికి వచ్చి, తల్లితో కలిసి, వ్యవసాయ పనులు చేసుకుని, సాయంత్రం నాగరగూడకు వెళ్తాడు. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి చేరుకోగా, అచేతనంగా పడిపోయిన తల్లిని గమనించి, చుట్టుపక్కల వారి సాయంతో చేవెళ్ల ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. సుమతమ్మ మెడలోని బంగారు గొలుసు, చెవి కమ్మలు కనిపించకపోవడంతో ఆమె మృతిపై అనుమానం వ్యక్తంచేస్తూ బాధిత కుటుంబ సభ్యులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, క్లూస్ టీమ్‌తో వెళ్లి ఆధారాలు సేకరించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
కొడంగల్ పోస్టాఫీస్‌లో ఆధార్ సేవలు
కొడంగల్ రూరల్: కొడంగల్ పోస్టాఫీసులో ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ పోస్టాఫీసు కార్యాలయాల జిల్లా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం పట్టణంలోని పోస్టాఫీసు కార్యాలయంలో ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార్ కార్డులో పుట్టినరోజు మార్చుకోవడానికి 18ఏళ్ల లోపువారు తప్పనిసరిగా జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. పేర్లు రెండింటిలోనూ ఒకేలా ఉండాలన్నారు. ఆధార్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు బంట్వారం: సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు ఇవ్వనున్నట్లు కోట్‌పల్లి వ్యవసాయ అధికారి కరుణాకర్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కల్టివేటర్, సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్, పవర్ వీడర్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తిగల రైతులు క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను స్రందించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. లారీ బ్రేక్‌లు ఫెయిలై.. ● ఆర్టీసీ బస్సును ఢీ ● తప్పిన ప్రమాదం పూడూరు: లారీ బ్రేక్‌లు ఫెయిల్ అవడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం చన్గోముల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. హైదరాబాద్–బీజాపూర్ హైవేపై తిర్మలాపూర్ స్టేజీ వద్ద మన్నెగూడ వైపు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్పగాయలయ్యాయి. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని లారీని స్టేషన్‌కు తరలించామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. సడలింపు ఇవ్వాలి అనంతగిరి: ప్రస్తుత సీజన్లో భారీ వర్షాలు పడినందున పత్తి నాణ్యత నిబంధనలను సడలించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణ సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎకరాకు 12 క్వింటాళ్లు సేకరించాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా పంట కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, సతీష్, లక్ష్మయ్య, అక్బర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుడికి వెళ్లినమహిళ అదృశ్యం మొయినాబాద్: గుడికి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ సంఘటన మొయినాబాద్ ఠాణా పరిధి చిలుకూరులో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని చిలుకూరుకు చెందిన అంతిగల్ల వైశాలి(31) శనివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి హనుమాన్ ఆలయానికి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో మొయినాబాద్ పోలీస్ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
భూ బాధితుల ఆందోళన
కుల్కచర్ల: మార్టిగేజ్ పేరిట భూములు కోల్పోయిన అంతారం రైతులు శనివారం డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది రియల్ వ్యాపారులు ఫిబ్రవరిలో తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తామని నమ్మబలికి వారి భూములు మార్టిగేజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాము మోసపోయామని తెలుసుకున్న రైతులు రెవెన్యూ అధికారులు, పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉ్నారు. ఈ క్రమంలో డీజీపీని కలిసేందుకు వెళ్లగా ఆయన రైతులను కలవకపోవడంతో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అడిషనల్ డీజీపీ చౌహాన్ డిసెంబర్ మొదటివారంలో డీజీపీని కలవాలని సూచించడంతో ఆందోళన విరమించామని రైతులు తెలపారు. వీరి ఆందోళనకు పీఎన్‌పీఎస్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ మద్దతు తెలిపారు. -
స్థానిక పోరుకు సిద్ధం కండి
అనంతగిరి: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్‌రావు నాయకులు, కార్యకర్తలకు సూచించారు. వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం వికారాబాద్‌లోని స్వాగత్ కన్వెన్షన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కో– కన్వీనర్లుగా శ్రీధర్‌రెడ్డి, కృష్ణ ముదిరాజు, రాంచంద్రరావును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర నాయకులు శివరాజు, రమేష్‌కుమార్, మారుతీకిరణ్ తదితరులు పాల్గొన్నారు. పంట నష్టపరిహారం చెల్లించండి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు డిమాండ్ చేశారు. శనివారం ఈ మేరకు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా పంటలు కోల్పోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారని తెలిపారు. అలాగే గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సాగు, తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అక్రమంగా ఎర్రమట్టి, ఇసుక, ఇతర ఖనిజాల తరలిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోందని తెలిపారు. వెంటనే కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వడ్ల నందు, రాజేందర్‌రెడ్డి, యాస్కి శిరీష, సుచరితారెడ్డి, కేపీ రాజు, నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండండి
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శనివారం కొడంగల్‌కు వచ్చిన ఆయన పట్టణ శివారులో నిర్మించనున్న అక్షయ పాత్ర వంటశాల స్థలాన్ని పరిశీలించారు. అక్కడే సీఎం భూమిపూజ చేయనున్నారు. అలాగే నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. సభాస్థలిని జిల్లా అధికారులు, సీఎం వ్యక్తిగత సిబ్బంది పరిశీ లించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, రెండు అంబులెన్సులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శానిటేషన్, బారికేడ్స్, మొబైల్ టాయిలెట్స్, తాగునీరు, స్టేజ్ ఏర్పాటు, వీఐపీ పార్కింగ్, ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయాలన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అధికారులు అందుబాటులో ఉంటూ పనులను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, డీఈఓ రేణుకాదేవి, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, తహసీల్దార్ రాంబాబు, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్, ఆర్అండ్బీ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. పర్యటన వివరాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యా హ్నం 3 గంటలకు కొడంగల్‌కు వస్తారు. తాండూరు రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రలైజుడ్ కిచన్ షెడ్‌ను పరిశీస్తారు. అక్కడి నుంచి బయ ల్దేరి పట్టణ శివారులో నిర్మించనున్న అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్ కిచన్ షెడ్‌కు భూమిపూజ చేస్తారు. అక్కడి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 28వేల మంది విద్యార్థులకు..కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. కొడంగల్ సమీపంలో రెండు ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ కిచన్ షెడ్‌ను నిర్మిస్తారు. నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో చదువుతున్న 28వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తారు. ఇందుకు సంబంధించిన కిచన్ షెడ్ నిర్మాణానికి సీఎం భూమిపూజ చేస్తారు. -
కొనలేం.. తినలేం!
వికారాబాద్: కూరగాయల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాన్యులు కొనాలంటేనే జంకుతున్నారు. 15 రోజుల వ్యవధిలో 30 నుంచి 40 శాతం మేర పెరిగాయి. ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఉత్పత్తి పడిపోయింది. ఈ కారణంగా ధరలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సుమారు 27 వేల ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తున్నట్లు సమాచారం. క్యారెట్, టమాటా, బీట్రూట్, బెండ, చిక్కుడు, ఆకుకూరల పంటలు కూడా సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు దెబ్బతీశాయి. ఏ కూరగాయ ధర చూసినా రూ.60 నుంచి రూ.100 పై మాటే. పదిరోజుల క్రితం రూ.40 పలికిన కూరగాయలు అమాంతంగా ఎగబాకాయి. కార్తీక మాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో సహజంగానే కూరగాయల వినియోగం అధికంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ధరలు పెరగడం పేదలకు ఇబ్బందిగా మారింది. వర్షాలకు కుళ్లిన పంటలు నెల రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కూరగాయ పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. క్యారెట్ భూమిలోనే కుళ్లిపోయింది. టమాటా నీటిలో మునిగి పాడైంది. ఆకుకూరలు తడిసి ముద్దయ్యాయి. బీట్రూట్, బెండ, చిక్కుడు తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దిగుబడిపై ప్రభావం పడటంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని వ్యాపారులు అంటున్నారు. నియంత్రణ చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అమాంతం పెరిగిన కూరగాయల ధరలు కూరగాయల ధరలు ఇలా.. (కిలోకి..) కూరగాయ రకం 15రోజుల క్రితం ప్రస్తుతం టమాటా 20 60 ఉల్లిగడ్డ 20 40 వంకాయ 40 80 పచ్చిమిర్చి 60 80 కాకరకాయ 40 80 చిక్కుడు 40 80 బెండ 60 80 గోరుచిక్కుడు 60 80 క్యారెట్ 40 80 కాలీఫ్లవర్ 40 80 దొండకాయ 40 80 బీట్రూట్ 50 80 క్యాప్సికమ్ 60 80 ఆలుగడ్డ 30 40 బీరకాయ 60 80 క్యాబేజీ 40 60 బీర్నీస్ 60 100 గోంగూర 60 80 పాలకూర 40 80 మెంతికూర 60 100 రైతు బజార్లో కాస్త తక్కువవికారాబాద్ రైతు బజార్లో రైతులే స్వయంగా అమ్ముకుంటేనే ఈ ధరలు ఉన్నాయి. ఇక చిల్లర వ్యాపారులు మాత్రం వీటికి 10 నుంచి 20 శాతం పెంచి విక్రయిస్తున్నారు. ఆ లెక్కన ఏ కూరగాయ ధర తీసుకున్నా.. రూ.80కి మించి పలుకుతోంది. కొనుగోలు చేయాలంటేనే భయమేస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. ‘ఉదయం మార్కెట్‌కు వెళ్లా.. పాలకూర కట్ట(ఒక్కటి) రూ.30 చెప్పారు. ఒక్క పాలకూరతో ఏం చేయాలి.. పప్పు చేద్దామంటే పచ్చిమిర్చి(కిలో రూ.80), టమాటా(రూ.60), ఉల్లిగడ్డ(రూ.40)..తోపాటు కందిపప్పు కొనాలి.. దీంతో భయమేసి ఇంటికి తిరిగొచ్చా..చికెట్ సెంటర్‌కు వెళ్లి రూ.42 పెట్టి అర డజను కోడిగుడ్లు తెచ్చా.. కాసింత ఉప్పు.. కారం వేసి ఫ్రై చేశా.. పిల్లలకు టిఫెన్ పెట్టి.. బాక్స్ కట్టా.. రాత్రికి పులిహోరాతో సరిపెట్టా’ అని వికారాబాద్ పట్టణానికి చెందిన మన్నె వసంత తెలిపారు. -
శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యం
మహిళల రక్షణకుప్రత్యేక చర్యలు అనంతగిరి: జిల్లా నూతన ఎస్పీగా స్నేహ మెహ్ర శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా పని చేస్తూ బదిలీపై ఇక్కడికి వ చ్చారు. ఇక్కడ పని చేస్తున్న నారాయణరెడ్డి మహేశ్వరం డీసీపీగా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. నేర నియంత్రణ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఆయా స్టేషన్ల పరిధిలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్య లు తీసుకుంటామన్నారు. తద్వారా ప్రజలకు మరింత చేరు వ అవుతామని అన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య బాగా పెరుగుతోందని, వాటి నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తా మని తెలిపారు. మహిళలు, పిల్లల భద్రత, రక్షణకు ప్ర త్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లా లో పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. -
ప్రణాళికతో సాగితే మెరుగైన ఫలితాలు
దుద్యాల్: చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఈఓ రేణుకాదేవి ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, దుద్యాల్ పాఠశాలలను సందర్శించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠాలు చెబుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సరైన సమయానికి వస్తున్నారా? పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారా అని అడిగారు. తెలుగు, ఇంగ్లిష్‌లో చదవడం, రాయడాన్ని నేరుగా పరిశీలించారు. అనంతరం దుద్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొన్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా పక్కా ప్రణాళికతో సాగాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి విజయ రామారావు, డీఈవో కార్యాలయ సిబ్బంది రాజేంద్రప్రసాద్, సీఆర్పీ రాందాస్ తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ జాదవ్
వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ధారాసింగ్ జాదవ్ నియమితులయ్యారు. శనివారం ఏఐసీసీ విడుదల చేసిన జిల్లా అధ్యక్షుల జాబితాలో ఆయనకు చోటు లభించింది. వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన గతంలో పలుమార్లు పెద్దేముల్ ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. ఆయన భార్య తారాబాయి పెద్దేముల్ సర్పంచ్‌గా పనిచేశారు. 1988లో పెద్దేముల్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1991లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పని చేశారు. 1995లో ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొంది ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2001లో జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2012లో ఎఫ్ఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. డీసీసీబీ డైరక్టర్‌గా పనిచేశారు. 2019లో జెడ్పీటీసీగా గెలుపొందారు. 2022 నుంచి ఇప్పటి వరకు పీసీసీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జెడ్పీటీసీ సభ్యుల్లో ఆయనొక్కరే గెలుపొందారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ధారాసింగ్ జాదవ్ పేరు తెచ్చుకున్నారు.


